Wednesday, January 15, 2025

Devottees – శ‌బ‌రిమ‌ల‌లో మ‌క‌ర‌జ్యోతి – పులకించి పోయిన భక్త జనం

శ‌బ‌రిమ‌ల‌లో మ‌క‌ర‌జ్యోతి ద‌ర్శ‌న‌మిచ్చింది. పొన్నాంబ‌ల‌మేడు ప‌ర్వ‌త శిఖ‌రాల్లో నేటి సాయత్రం మ‌క‌ర‌జ్యోతి ద‌ర్శ‌న‌మిచ్చింది. ప‌ర్వ‌త శిఖ‌రాల్లో దేదీప్య‌మానంగా జ్యోతి వెలుగులీనింది.

తిరువాభ‌ర‌ణ ఘ‌ట్టం పూర్త‌య్యాక మ‌క‌ర జ్యోతి రూపంలో భ‌క్తుల‌కు అయ్య‌ప్ప‌స్వామి ద‌ర్శ‌న‌మిచ్చారు. అయ్య‌ప్ప శ‌ర‌ణుఘోష‌తో శ‌బ‌రిగిరులు మార్మోగాయి. స్వామియే శ‌ర‌ణం అయ్య‌ప్ప అంటూ నామ‌స్మ‌ర‌ణ చేశారు. మ‌క‌ర‌జ్యోతిని చూసేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. మ‌క‌ర‌జ్యోతిని ప్ర‌త్య‌క్షంగా ల‌క్ష‌న్న‌ర మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా శ‌బ‌రిమ‌ల‌లో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement