Wednesday, October 2, 2024

దేవతారాధనే నిత్య యజ్ఞం!

ప్రపంచంలోని సకల సౌకర్యాలతో సకల మానవాళి జీవితాలు మూడు పూవులు ఆరు కాయలుగా వెలిగాయంటే అందుకు మూలం యజ్ఞమే. యజ్ఞాలతో మానవులు దేవతలను ఆరాధిస్తే ఆ దేవతలు వర్షాలతో, పంటలతో, పాడితో ఇతర సంపదలతో ప్రాణులను సంతోషపెడ్తాయని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే గీతలో ఇలా ఉపదేశించాడు.
సహ యజ్ఞే: ప్రజాస్సష్ట్వా పురోవాచ ప్రజాపతి:
ఆనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తు ఇష్టకామధుక్‌.
అని. అనగా సృష్టి ప్రారంభంలో బ్రహ్మ యముల తో ప్రజలను సృష్టించి ఈ యజ్ఞములతో ఆరాధించం డి. ఈ యజ్ఞమే మీ ఇష్టమైన కోరికలను ప్రసాదిస్తుంది అని చెప్పారు. అంతేకాదు బ్ర#హ్మ సృష్టించబడిన తరు వాత నారాయణుని కొరకు తపస్సు చేశాడు. తపస్సు అన్నా యజ్ఞమే కదా! ‘యజదేవ పూజాయాం’ అని కదా ధాతువు. దైవారాధనే యజ్ఞం. అలా నారాయణుని గూ ర్చి తపస్సు చేస్తే నారాయణుడు సాక్షాత్కరించాడు. అతన్ని పూజించాలి కదా! స్వామీ! పూజాసామగ్రి లేదు. మీరు ప్రసాదిస్తే మిమ్ములను పూజిస్తాను అని ప్రార్థించాడు. స్వామి తన దివ్య అవయవాల నుండి యజ్ఞసామగ్రిని బ్రహ్మకు అందించాడు. స్వామి ఇచ్చిన ద్రవ్యంతో స్వామి నే పూజించాడు బ్రహ్మ. ద్రవ్యములతో పూజించటం యజ్ఞము కదా! ఆ ద్రవ్యములు స్వామియే కదా! పూజించబడే స్వామి కూడా యజ్ఞమే అంటే యజ్ఞముతోనే యజ్ఞమును పూజించారు అంటుంది వేదం. ‘యజ్ఞేన యజ్ఞ మయజన్త దేవా’ అంటుంది. దేవతలు యజ్ఞముతోనే యజ్ఞముని ఆరాధిం చారని అర్థము. అంటే సృష్టికి మూలం యజ్ఞము సృష్టి యజ్ఞము. యజ్ఞ ముతో సృష్టి. ఇది ఒకచక్రము. అందుకే గీతలో స్వామి ఇలా ఉపదేశిస్తారు.
దేవాన్‌ భావయతానేనతే దేవా భావయన్తువ:
పరస్పరం భావయన్త: శ్రేయ: పరమవాప్స్యధ.
ఈ యజ్ఞముతో దేవతలను ఆరాధించండి. ఆ దేవ తలు మీకు కోరిన కోరికలనిచ్చి మిమ్మల్ని గౌరవిస్తారు. ఇలా ఒకరినొకరు సం భావించుకుంటూ గొప్ప శ్రేయస్సును పొందం డన్నాడు. శ్రేయ స్సును పొం దండి
అనలేదు. పరమ శ్రేయస్సును అన్నారు. పరమ శ్రేయస్సు అనగా మోక్ష మే. పుట్టుక లేకుండా చేసుకోవటమే పుట్టుకకు పరమ శ్రేయస్సు. పుట్టుక అంటే ఆత్మను శరీరంలో చేర్చుట. శరీరాన్ని విడిచిపెట్టుట మరణం. ఇం కా బాగా చెప్పాలంటే శరీరం అంటే వస్త్రం. ఆత్మ వస్త్రమును ధరించేవా డు. శరీరమంటే ఇల్లు. ఆత్మ అంటే ఇంటి వాడు. ఉత్తమ జన్మ కావాలి అని యజ్ఞం చేశాం అంటే కాస్ట్‌లీ డ్రస్‌ లేదా కాస్ట్‌లీ ఇల్లు కోరుకున్నట్లే కదా! వస్త్రం ధరిస్తే చాలా? మంచి వస్త్రం కొంటే చాలా? మంచి వస్త్రధా రి కావద్దా? వస్త్రం ధరించే శరీరం రోగాలతో, రొష్టులతో, పుండ్లతో, గడ్డలతో, క్షయ కుష్టులతో ఉంటే ఎంత గొప్ప వస్త్రం ధరించినా సంతోషం కలుగుతుందా? ఇల్లు మ హంద్ర భవనంలా ఉండి, ఇంటి యజమాని గుడ్డి, కుం టి అయితే ఆ ఇల్లు ఆనందాన్ని ఇస్తుందా?
దుర్యోధనుడికి తండ్రి మహారాజు, భీష్ముడు, ద్రో ణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, మిత్రుడు అంగరా జు, #హస్తినాపుర సామ్రాజ్యం అన్నీ ఉన్నాయి. మరణించే వరకు ఒక్కనాడైనా మనశ్శాంతితో ఉన్నాడా? నాకు సం పద కావాలి అనుకుంటే తప్పుకాదు. నాకే కావాలి అను కున్నవాడు శాంతిగా ఉండలేడు. అందుకే మనస్సు బా గుండాలి. బుద్ధి బాగుండాలి. ఇవన్నీ బాగుండాలి. మంచి కర్మలు చేయా లి. అంటే యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలతో ఆరోగ్యమైన శరీరం, ఆరోగ్యమైన మనస్సు, ఆరోగ్యమైన బుద్ధి, అందమైన భార్య, ఇల్లు అన్నీ లభిస్తాయి. ఇలా కొన్ని జన్మలు గడుస్తుంటే ఇలా ఎంతకాలం వస్తూ పోతూ ఉండాలి. మళ్ళీ రాకుండా ఆ పరమాత్మ వద్ద నే ఉంటే బాగుంటుంది అనే జ్ఞానం, వైరా గ్యం కూడా యజ్ఞంవల్లనే కలుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement