ఏకోహం, బహుస్యాం- ప్రజాయేయేతి’ అని ఉపనిషత్తులు యుగయుగా లుగా చెప్తూనే ఉన్నాయి. తానొక్కడే అయిన భగవంతుడు తాను అనేకంగా మారి, తనలోని అనంత వైవిధ్యాన్ని ప్రసరించి ఆనందించాలని అనుకున్నాడట.ఆ దైవ సంకల్పం ప్రకారం ఆ పరతత్వం అనేక అంతస్తులు దిగివచ్చి పదార్థం గా మారింది. ఆ చివర పరబ్రహ్మ. ఈ చివర పదార్థం. ఈ పదార్ధంలో పరతత్వం లోని అన్ని స్థాయిలూ అంతర్లీనంగా వున్నాయి. దీనినే అవరోహణ అంటాం. ఈ రెంటి మధ్యా అనేక అంతస్తులు, ఈ అంతస్తులలో ఒక్కొక్క అంతస్తూ పదార్థంలో ప్రవేశించి తనదైన అంతస్తును బహిర్గతం చేస్తున్నాయి. అలా బ#హర్గతం అవుతు న్న క్రమాన్ని ఆరోహణ అంటున్నాం. ముందుగా పదార్థం పైన ప్రాణిక స్థాయి వత్తి డి తెచ్చిన కారణంగా అందులో అంతర్లీనంగా వున్న ప్రాణశక్తి. పదార్థాన్ని కలుపు కొని వృక్ష సంతతి, జీవకోటిగా వెలికి వచ్చింది. ఆ తర్వాత దశలో పదార్థంపై మాన సిక ఒత్తిడి ఫలితంగా సకల జీవరాశిపై తెచ్చిన మార్పు ఫలితంగా, పదార్థాన్ని ప్రాణాన్ని కలుపుకొని మానవజీవి వెలికి వచ్చాడు.ఈ మనస్సుకున్న ప్రధాన లక్షణం ఆలోచన, విభజన, సంకల్ప- వికల్పాలు, దీని కారణంగానే మానవుని మనస్సు మూడు రకాల విశిష్టతలను సమకూర్చుకుం ది. ఒకటి సౌందర్యారాధన, రెండు మేధస్సు, మూడు నైతిక శక్తి, వీటిలో సౌంద ర్యం అనగానే అందం అని సాధారణంగా అందరూ అనుకునేది మాత్రమే కాదు, సకల సృష్టి దైవానికి చెందినదే. భగవంతుని సృష్టిలో ప్రతి దీ అందమైనదే. సౌందర్యవంతమైనదే. అలా అందం లేదా సౌందర్యం అనే దానిని ఏ ఒక్క దానికో లేక తన వారికో తాను ప్రేమించే వారికో కాక సకల సృష్టిలోని సౌంద ర్యాన్ని ఆ సౌందర్యంలోని ప్రతి కదలికనూ, లయ నూ కళాత్మక దృష్టితో చూడడం. వలన కళలు ఏర్పడ్డాయి. సకల కళలూ ఆ సౌందర్యలహరి లోనివే. ఈ దృష్టిని అలవరచుకుంటే సకలంలో నూ ఆ దైవాన్ని చూడగలుగుతాం.అలాగే మేధాశక్తి. ఈ శక్తి అలవడడం వలన హేతుదృష్టి అభివృద్ధి చెందింది. హేతువాదంలో మనిషి మూఢాచారాల నుండి బయటపడ్డాడు. సైన్స్ అభివృద్ధి చెందింది. దీనివలన అనేక అద్భుతాలు ఆవి ష్కరించబడ్డాయి. ఇంక నైతికశక్తి మానవుడు మంచిచెడుల గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకొని వాటికే కట్టుబడి వున్నాడు. ఈ అభిప్రాయాలన్నీ మానవుడ్ని గొప్ప వెలుగులోకి తీసుకెళతాయి. అయితే అవి ఎంత గొప్పవైనా అవి ఆత్మధర్మ ధర్మాన్ని చేరుకునేలా చేయలేవు.ఈ మనస్సుకున్న మరో గుణం ప్రతీదానినీ విడగొట్టి చూడటం. ఈ విడగొట్టి చూడటం అనేది వ్యక్తుల మధ్య, సమాజం మధ్య, జాతుల మధ్య, వైరాన్ని వేరు భావాన్ని పెంచి ఘర్ష ణలకు దారితీసి అహానికి లోను చేస్తాయి. మానసిక జీవి అయిన మానవుడు దీనిని దాటి పోలేడు. సకల సమస్యలన్నింటికీ అసలు సమస్య అదే. వ్యక్తుల మధ్య, రాజ్యాల మధ్య, చిచ్చుపెట్టి జాతీయంగా, అంతర్జాతీయంగా మానవులను అది నిట్టనిలువునా చీలుస్తుంది. ఈనాడు మనకు కన్పించే సమస్యలన్నింటికీ మూలం అదే, వీటన్నింటికీ పరిష్కారం ఒక్కటే. అది మానవుడి మనస్సును దాటిపోవడమే. అంతవరకూ ఈ సమస్యలకు పరిష్కారం లేదు.మనం ప్రస్తుత ప్రపంచం వైపు దృష్టి సారించి చూస్తే అది సమస్యల వలయంలో పడి కొట్టుమిట్టాడుతున్నది, ప్రతీ దేశం ఎన్నో సంక్షోభాలతో కునారిల్లుతున్నది. నిజమే. మనం పదార్థ ప్రపంచంలో ఎంతో సాధించాం. గాలిలో పయనిస్తున్నాం. నీటిమీద నడవ గలుగు తున్నాం. నీటి లోపల గూడా దూసుకుపోతున్నాం. అంతేనా! గ్రహాంతరయానం కూడా చేయగలుగుతున్నాం. ఇదంతా బయటి ప్రపంచంలో. కానీ అంతరంగ ప్రపంచంలో ఒక్క అడుగు వేయలేకపోతున్నాం. ఆధ్యాత్మికంగా మనం గుండు సున్నాలం. కె.జి. క్లాసులో గూడా ప్రవేశించలేకపోయాం. ప్రగతి అనేది ఒక ప్రక్కనే జరుగుతున్నా, రెండవ ప్రక్కన చూడలేకపోవడం, సమతుల్యత అనేది లేకపోవడం లాంటివే ప్రపంచంలోని సంక్షోభా లన్నింటికీ అసలు కారణం. పరిణామ వికాసం ఒక వైపునే జరగడంవల్ల ప్రపంచం అనేది అంగవైకల్యంతో అసహ్యంగా తయారైంది. తెల్లారి లేచి వార్తాపత్రికలు చదివితే, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, పెత్తందారి పోకడలు, నియంతలుగా మారేందుకు సిద్ధం కావడం, అవినీతి, లంచగొండితనం, స్వార్థం, భోగ లాలస, దుర్మార్గం, దుర్నీతి, అత్యాచారాలు, జంతు ప్రవృత్తి. ఇదంతా చూసి మానవత్వం సిగ్గుతో తలదించుకుంటున్నది. మృగంలోంచి మానవుడు వచ్చాడంటాడు డార్విన్. కానీ ఈనాడు మనిషిలోంచి మృగం తొంగి చూస్తున్నది. దీనికంతటికీ కారణం పరిణామ క్రమం ఒకచోట ఆగిపోవడం. అది ఆగినచోటనే ఆగదు. అది ముందుకైనా సాగిపోవాలి. లేకపోతే వెనక్కు తిరగాలి. ఇప్పుడు అది తిరోగమనంలో ఉంది. సృష్టిలో మానవుడు చివరివాడు కాదు. అతడింకా ముందుకు సాగాలి. ఆదిమ మానవుడు, యాంత్రిక మానవుడు అయ్యాడు. సైంటిఫిక్ మానవుడయ్యాడు. అంతటితో ఆగిపోయాడు గనుక మరలా వెనక్కు తిరిగి మృగ ప్రాయుడవుతున్నాడు. ఇప్పుడు ధర్మానికి గ్లాని ఏర్పడింది. దైవం మరో అవతారం ఎత్తాల్సి న అవసరం వచ్చింది. అలా వచ్చిన వారిని గుర్తించడం కూడా మామూలు విషయం కాదు. మనం యుగసంధ్యలో వున్నాం.అయితే మనమంతా అంతర్ముఖులం కావాలి. మానవ జీవితానికి పరమార్థం తెలుసుకొని ఆ వైపుగా అడుగులు వేయాలి. ”మనమంతా పరమాత్ముని సంతానం పర మాత్మ అంతగా ఎదగాలి” అంటారు శ్రీ అరవిందులు, మానవుడిలో పరమాత్మ అంశం వుం ది. ఆ అంశాన్ని వికసింపజేసుకుంటే మానవుడు, మాధవుడు కాగలుగుతాడు. తన ద్వారా మాధవునిలోని అంశాలన్నీ ప్రకటితం కావాలి. అది పరమాత్ముని దివ్యసంకల్పం, అందు కోసం మానవజాతిని తిరిగితిరిగి పునర్నిర్మిస్తాడు.పరిణామ క్రమం ఆగిపోతే దైవం చూస్తూ ఊరుకోకుండా కొరడా జులిపిస్తాడు గదా! అందువలన మనమందరం నిద్ర నుండి మేల్కొని జాగరూకతతో మెలగాలి. శ్రీ అరవిందుల సందేశమును ఆకళింపు చేసుకొని కార్యాచరణకు పూనుకోవాలి. మన చైతన్యమును విస్తృత పరచుకుంటూ మనలోని దివ్యాంశను, విస్ఫులింగంను గ్రహించి, ఈ పృధ్విపై అన్నింటా దివ్య సంపదలను ఆవిష్కరింపజేసే దిశగా మనము పురోగమించాలి. మనవంతు కృషి మనం చేయాలి గదా మరి!
– కవితాశ్రీధర్, 9395511193