Friday, November 22, 2024

Devotional – సుషుమ్న గురువులు ఆత్మానందమయి స్వదేశీ ఆగమనం

హైదరాబాద్ – సుషుమ్న గురువులు ఆత్మానందమయి అమ్మగారు స్వదేశీ ఆగమనం పూజ్య గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయి అమ్మగారు, సుషుమ్న క్రియా యోగ ఉచిత దీక్షా కార్యక్రమాలను జయ ప్రదంగా అమెరికాలోని న్యూ జెర్సీ, అట్లాంటా, డాలస్, డెట్రాయిట్, కాలిఫోర్నియా, మియామీ, న్యూయార్క్ లలో నిర్వహించి నవరాత్రుల సందర్భంగా సోమవారం నాడు తిరిగి భారత దేశానికి విచ్చేసారు.

అమెరికాలో పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి దీక్షా కార్యక్రమాలకు వేల సంఖ్యలో సాధకులు హాజరయ్యారు. సుషుమ్న క్రియా యోగం అనే అధునాతమైన ధ్యాన సాధన ద్వారా సాధకులు ఏ విధంగా లాభపడతారో అమెరికాలో హార్వర్డ్ వైద్యులు పద్మజ, మియామీలో అపోలో పెయిన్ కేర్ వైద్యులు యాతం పద్మ వంటి వారు వివరించారు.

సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా తమ జీవితంలో సంభవించిన అద్భుతాలను అమెరికాలోని సాధకులు, దీక్షా వేదికలపై పంచుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, సుషుమ్న క్రియా యోగ ధ్యానం ద్వారా కలిగే లాభాలను గురించి వివరించడంతో పాటు, వారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా నిర్వహింపబడుతున్న న్యూ యార్క్ లోని ప్లేన్ వ్యూ సాయి మందిరాన్ని సుషుమ్న క్రియా యోగ ధ్యాన పరివ్యాప్తికి అందించారు.

- Advertisement -

సుషుమ్న క్రియా యోగం చాలా సులువైన ధ్యాన ప్రక్రియ. ఈ ధ్యానం 49 రోజుల పాటు చేయడం ద్వారా శారీరక, మానసిక, భావపూర్ణ, సామాజిక, ఆధ్యాత్మిక వికాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ ఆరోగ్యం కోసం నిర్విశ్రాంతంగా కృషి చేస్తోన్న ఆత్మానందమయి అమ్మగారికి ఎడిసన్ మేయర్ సామ్ జోషి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ప్రస్తుతం కమిషనర్ గా వ్యవహరిస్తున్న దిలీప్ చౌహాన్, మేయర్ ఆఫీస్ నుండి వరుణ్ జెఫ్ వంటి పెద్దల చేతుల మీదుగా పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారికి అమెరికాలో ఘన సత్కారం జరిగింది. అమ్మగారి కార్యక్రమాల నిర్వహణా సంస్థ దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ప్రశాంతి గారు మాట్లాడుతూ తమ సంస్థ ప్రపంచ ఆరోగ్యానికి, మానవుల సంక్షేమానికి కట్టుబడి పరిశ్రమిస్తూనే ఉంటుందని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement