Friday, November 22, 2024

విష్ణు భక్తి

శాసన అధికారం, సమగ్ర ధర్మ స్వరూపం, కీర్తి, సం పద, జ్ఞానం, వైరాగ్యం, ఈ ఆరు గుణాల సముదా యానికి ‘భగ’ అని పేరు. ఈ భగ ఎవ్వరిలో ఉంటుం దో అతడు భగవంతుడు. ఉత్పత్తి, ప్రళయం, స్థితిగతులు, సంసారం, మోక్షం అనే తత్వాలు ఎవని అధీనంలో వుంటా యో అతడే భగవంతుడు. భాగంలోని ‘భ’ కారం భర్త, సంభర్త అనే అర్ధాలను సూచిస్తే ‘గ’కారం అన్నింటికీ ఆధారమైన వాడు అనే అర్ధాన్ని సూచిస్తుంది. భగవత్‌ ఆరాధనతో కూడిన మతం భాగవత మతం. ఇదే వాసుదేవ మతం. వాసుదేవ మతమే వైష్ణవ మతం అంటారు. భగవంతుని చేరడానికి అనేక మార్గాలున్నాయి. అయితే వాటిలో భక్తి శ్రేష్టమని పెద్దల భావన. జ్ఞాన, భక్తి, కర్మలలో ఏది గొప్పది అనే సందేహం సహజం. కొందరు స్వాములు భక్తి షట్కాన్ని ‘దేహళీ దీపం’ గా వర్ణించారు. అంటే… గడప మీద పెట్టిన దీపం అటు బయ టికీ ఇటు లోనికి వెలుగును ప్రసరించేటట్లు, భక్తి, ఒక పక్షి అయితే జ్ఞానం-యోగం రెండు రెక్కలు. భక్తి గంగ అయితే కర్మ యమున, జ్ఞానం సరస్వతి. భక్తి లేని కర్మ జడం. భక్తి లేని జ్ఞానం శూన్యం.
విష్ణు భక్తులు విష్ణువునే సర్వాధికారిగా భావిస్తారు. ప్రాజ్ఞుని పట్టుకుని సుజ్ఞాన సంపాదనను చేసుకోవటం వైష్ణవ లక్షణం. ప్రాకృతుల సంబంధం వదులుకుని ఆత్మోద్ధరణకు అనుకూలమైన దివ్యదేశ నివాసం చేయడం మరో లక్షణంగా చెబుతారు. సార పదార్ధాలను సంగ్రహంచి తానూ తిని పిల్ల లకు పెట్టేవిధంగా వైష్ణవ రహస్య బోధన చేయడం మరో లక్షణం. లవణం నీళ్ళల్లో వేసినప్పుడు రూపు నశించినా లక్ష ణం పోదు. ఆవిధంగానే వైష్ణవుడు తాను నాశనమయినా భగ వదాచార్య కైకర్యం చేస్తాడు. భగవద అపచారం కంటే భాగ వతాపచారం చాలా చెడ్డది. ‘భక్త్యా భాగవతం జ్ఞేయం’ అని సూక్తి. ‘విద్యావతాం భగవతే పరీక్షా’ అని నిర్ణయం. భాగవ తంలో ‘భక్తి’కి ప్రాధాన్యం. ఎందరో మహాత్ములు భక్తిని ప్రచారం చేశారు. రామానం దుడు ఉత్తర భారతదేశంలో ప్రచారం చేస్తే, కబీర్‌ సప్తద్వీపాల లోను, నవఖండాలలోను ప్రచారం చేసాడు. సిద్ధ సంప్రదా యం, నాథ సంప్రదాయం అనంతరం భక్తి సిద్ధాంతం ప్రచా రం అయిందనడం సమంజసం. భగవంతుడు మాత్రం తన భక్తుల ఎడల ఎంతో శ్రద్ధను చూపాడు. తన భక్తులు ఎలాంటి వారైనా, వారిని నిందించే వారిని క్షమించను అని అన్నాడు. జయవిజయులకు శాపం కలగడం, గరుత్మంతుని రెక్కలు ఊడటం, దుర్వాసుడు అంబరీషుని విషయంలో అవమానం పాలుకావడం కూడా ఇదే కారణం. అంతేకాదు సీతమ్మ కష్టా లపాలు కావటం కూడా భగవదపచారమే కారణం. ఎన్నో భాగవత కథల్లో మనకు భగవంతుడే స్వయంగా ఎన్నో కష్టా లను అనుభవించినట్లు తెలుస్తుంది. అలాగే ఎందరో దాస్య భక్తిని మార్గంగా ఎంచుకున్నారు. అహంకారం అణగడానికి ఇంతకంటే మరోసాధనం లేదు. ఎలాంటి భక్తి మార్గాన్ని అనుసరించినా భక్తులందరూ తమకు తరుణోపాయాన్ని అన్వేషించుకుంటూనే, తమవం తుగా ధర్మ ప్రచారానికి వినియోగించారు. మానవసేవకు నడుం కట్టారు. గుడులు కట్టినా, మఠాలు నిలిపినా, వైద్యాల యాలు నెలకొల్పినా, బడులు కట్టినా సామాజిక ప్రయోజ నం కోసమే. ఇందులో భక్తి వుండవచ్చు. భక్తి వలన అశాంతి దూరమవుతుంది. ఆత్మోన్నతికి భక్తి ప్రథమ సోపానం.
– డాక్టర్‌ పులివర్తి కృష్ణమూర్తి, 99490 92761

Advertisement

తాజా వార్తలు

Advertisement