Friday, November 22, 2024

ఏప్రిల్‌ 1 నుంచి శ్రీవారిఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల వెంకన్నకు పూర్తిస్థాయిలో మొక్కులు తీర్చుకునే భాగ్యం భక్తులకు త్వరలోనే లభించనుంది. కోవిడ్‌ నేపథ్యంలో శ్రీవారి ఆల యంలో రెండు సంవత్సరాలుగా నిలిపివేసిన అంగ ప్రదక్షిణను తిరిగి ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి ప్రారంభించాలని టిటిడి నిర్ణయించింది. ఏప్రిల్‌ 1 నుంచి భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించనున్న టిటిడి అదే రోజు నుంచి అంగప్రదక్షిణం చేసే భక్తులకు టోకెన్లు జారీ చేసి మరుసటి రోజు నుంచి భక్తులను అనుుమతించ నుంది. దీంతో శ్రీవారి భక్తులు ఆదేవదేవుడికి మొక్కులు చెల్లింపు మార్గం సుగుమం అయింది. తిరుమల శ్రీవారి దర్శనార్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుం టారు. స్వామివారి దర్శనార్ధం విచ్చేసే భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. కాలినడకన తిరుమ లకు చేరుకోవడం, తలనీలాలు సమర్పించడం, హుండీలో కానుకలు సమర్పించడం, ఒంటి పై ఉన్న బంగారు బంగారు సమర్పించడం (నిలువుదోపిడి), శ్రీవారి ఆలలయంలోని ఆనందనిలయం చుట్టూ అంగ ప్రదక్షిణ చేయడం ఇలా అనేక రూపాల్లో భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. కోవిడ్‌ కారణంగా గత రెండు సంవత్సరాలుగా శ్రీవారి భక్తులు తమ మొక్కులను పూర్తి స్థాయిలో చెల్లిం చుకునే భాగ్యం లభించలేదు. 2020 మార్చి 21 నుంచి శ్రీవారి ఆలయంలో కోవిడ్‌ కారణంగా దర్శనాలు నిలిపివేయడం అదే రోజు నుంచి భక్తులు అంగ ప్రద క్షిణ చేసుకునే అవకాశాన్ని కూడా నిలిపివేసింది. ఆ తరువాత కొద్ది నెలలకు శ్రీవారి ఆలయంలో టిటిడి దర్శనాలను పునరుద్దరించినప్పటికీ అంగ ప్రదక్షిణకు భక్తులను అనుమతించలేదు. దీంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలన్న భక్తులు కోరిక రెండేళ్ళుగా నెరవేరలేదు. కోనేటి రాయుడికి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించే భక్తులు తడి బట్టలు ధరించి గర్భాలయం చుట్టూ పొర్లు దండాలు పెట్టడమే అంగ ప్రదక్షిణ అంటారు. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతినిత్యం టిటిడి పరిమిత సంఖ్యలోనే భక్తులను అంగ ప్రదక్షిణ ద ర్శనానికి అనుమతి స్తుంది. స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొలిపిన సమయంలోనే భక్తులు గర్బాలయం చుట్టూ అంగ ప్రదక్షిణం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కొంత మంది భక్తులు మాత్రం ఆలయంలో అవకాశం లేనప్పటికి మాడవీధులలో మహా అంగప్రదక్షిణ చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ మహమ్మారి తగ్గుముఖం పట్టడం దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటుండంతో తిరుమలలో దశల వారిగా తొలగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 1 వ తేది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను కూడా అనుమతించేందుకు టికెట్లను జారి చెయ్యగా తాజాగా అంగ ప్రదక్షిణను కూడా అనుమతించాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement