Thursday, November 21, 2024

మేడారంలో పోటెత్తిన భక్తజనం

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్క రోజే మూడు లక్షల మందికి పైగా తరలివచ్చి తల్లులను దర్శించుకున్నారని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేశారు. మేడారం జాతరకు ఇంకా 9 రోజులు సమయం ఉన్నది. అయినా ముందే భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆర్టీసీ అధికారులు వివిధ జిల్లాకేంద్రాల నుంచి భక్తులు మేడారంకు వచ్చేవిధంగా ఏర్పాట్లను చేశారు. గత వారం రోజులనుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని బస్‌ డిపోలతో పాటు ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి నేరుగా మేడారంనకు బస్సులు నడుపుతున్నారు. ప్రధాన జాతర ఫి బ్రవరి 16 నుంచి 19వతేదివరకు జరగనున్నది. జాతర సందర్భంగా కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున సుదూర ప్రాంతాల నుంచి ముందుగానే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముందుగా జంవన్నవాగులో పుణ్య స్థానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నూతన వస్త్రాలు, బెల్లం, కొబ్బరికాయల సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు కోళ్లను, మేకలను, గొర్రెలను తల్లులకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. గద్దెల ప్రాంగణం భక్తులతో కిటకిట లాడింది. వాహానాలు ఎడతెరిపిలేకుండా రావడంతో ములుగు సమీపంలోని జవహర్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ఇరుకుగా ఉండటంతో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఓ వైపున ఇసుక లారీలు, మరోవైపున భక్తుల వాహానాలు, ఆర్టీసీ బస్సులతో టోల్‌ప్లాజా దాటడం ఇబ్బందిగా మారుతుండటంతో జాతర పూర్తయ్యే వరకు టోల్‌ ప్లాజాలు ఎత్తివేయాలని భక్తులు కోరుతున్నారు. అదేవిధంగా మితిమీరిన వేగంతో నడుస్తున్న ఇసుక లారీలతో భక్తులు ఇబ్బంది పడుతున్నందున జాతర పూర్తయ్యే వరకు లారీల నిలిపివేసే విధంగా అధికారులు నిర్ణయం తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

మేడారం భక్తులకు సకల సదుపాయాలు

మేడారం జాతకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని, పక్కా ప్రణాళికతో పటిష్ట ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, దక్షిణ కుంభమేళాగా మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందినదని మంత్రి అన్నారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే మేడారం జాతరపై ఇప్పటికే మూడుసార్లు సమీక్ష చేశామన్నారు. భక్తులు జాతరకు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతర మార్గాల్లో భారీ వా#హనాలు రాకుండా ఆదేశాలు జారీ చేశామన్నారు. పారిశుద్ధ్యంలో ఎలాంటి ఫిర్యాదు రాకుండా నిర్వ#హణ జరపాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. పారిశుద్ధ్య నిర్వ#హణ, ట్రాఫిక్‌ నియంత్రణ, మేడారం జాతర మార్గాలు, మేడారంలో భక్తుల వసతులు, సదుపాయాలపై ఎప్పటికప్పుడు భక్తులకు సమాచారం అందించేందుకు వీలుగా సోషల్‌ మీడియా, యాప్స్‌, సాంకేతిక పరిజ్ణాన్నాన్ని పూర్తిగా వినియోగిస్తున్నామన్నారు. అధికారుల మధ్య సమన్వయం చేసి బాధ్యతలు పటిష్టంగా నిర్వ#హంచేందుకు వీలుగా మేడారాన్ని 8 జోన్లుగా, పలు సెక్టార్లుగా విభజించి, మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించామని పేర్కొన్నారు. మేడారం వచ్చే భక్తుల భద్రత, దొంగతనాల నివారణ చర్యల కోసం భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, నిరంతర నిఘా ఉంటుందని, షీ టీమ్స్‌, మప్టీn పోలీసులు విధుల్లో ఉన్నారని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర అప్రమత్తంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. గద్దెల వద్ద భక్తులకు ఇబ్బందులు జరగకుండా క్యూలైన్‌ విధానం పటిష్టంగా రూపొందించామని, భక్తులకు క్యూలైన్‌ లో అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశామన్నారు. కరోనా నేపథ్యంలో కూడా వైద్య సిబ్బంది గతం కంటే రెండింతలు పెంచామని, పరీక్షలు చేసేందుకు కేంద్రాలను పెట్టామని, పాజిటివ్‌ తేలితే వెంటనే వారికి చికిత్స చేసేందుకు ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడికక్కడ మాస్కులు, సానిటైజర్ల అందుబా టులో ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement