Friday, November 22, 2024

భక్తుడు- భగవంతుడు

ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ విడిచి, భక్తితో భగవంతుడిని కొలుస్తారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులవురు. దేవునిపై మనకున్న భక్తిని వివరించే ఓ నీతికథ ఇది.
పూర్వం ఒకరాజు ఉండేవాడు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని రాజ్యాన్ని పాలిం చేవాడు. ప్రజలంటే ప్రేమ, ధర్మస్వభావం కలవాడు. నిత్యం భగవంతుడిని ఎంతో భక్తి తో కొలిచేవాడు. తన రాజ్యం, ప్రజలు సుభిక్షంగా వుండాలని భగవంతుని పూజించి, స్మరించుకునేవాడు. రాజు భక్తికి మెచ్చిన భగవంతుడు ఓరోజు ప్రత్యక్షమయ్యాడు.
భగవంతుని దివ్యమంగళ స్వరూపం చూసిన రాజు ఆనందపారవశ్యంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. దేవునికి నమస్కరించాడు. భగవంతుడు ”రాజా నీ భక్తికి మెచ్చాను ఏదైనా వరం కోరుకో” అన్నాడు. రాజు ”స్వామీ! మీ కరుణాకటాక్షాల వల్ల నా రాజ్యంలో సిరిసంపదలు న్నాయి. అందరూ సంతోషంగా వున్నారు. కానీ నాకు ఒక కోరిక వుంది. తీరుస్తారా” అన్నాడు.
”చెప్పు రాజా” అన్నాడు .
”మీరు నాకు దర్శనమిచ్చినట్లే నా ప్రజలకు కూడా దర్శన భాగ్యం కల్పించండి స్వామీ” అన్నాడు.
భగవంతుడు ”ఇది ఎలా సాధ్యమవుతుంది” అని ఏదో చెప్పబోతుంటే రాజు అడ్డుపడి ”స్వామీ నా కోరిక మీరు తీర్చవలసిందే” అని పట్టుబట్టాడు.
భగవంతుడు భక్తుడి కోరికను మన్నించక తప్పలేదు. ”సరే! రేపు నీ రాజ్య ప్రజలం దరినీ తీసుకుని ఆ కొండ దగ్గరకు రా! అందరికీ దర్శనమిస్తాను” అన్నాడు.
రాజు మరుసటిరోజు ఉదయం రాజ్యంలో ”రేపు ఉదయం రాజుగారితో కలిసి అం దరు కొండ దగ్గరకు రావలసిందేనని, అక్కడ అందరికి భగవంతుడు దర్శనమిస్తాడు… ఇది రాజుగారి ఆజ్ఞ” అంటూ దండోరా వేయించాడు.
రెండవరోజు రాజుగారు తన ప్రజలందరిని తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు. కొండదారిలో ఒకచోట రాగి నాణాల రాశి కనిపిస్తుంది. ప్రజలలో కొంతమంది అవి తీసుకోవడానికి పరిగెత్తారు. జ్ఞాని… భక్తుడు అయిన రాజు ”అటు వైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు. ఎందుకంటే మీరందరూ భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణాల వెంటపడి మీ అదృష్టాన్ని కాలదన్నుకోకండి” అన్నాడు.
కొంతమంది భగవంతుడిని తర్వాతైనా చూసుకోవచ్చని రాగినాణాలను తీసు కుని ఇళ్ళకు వెళ్ళిపోయారు. రాజు ముందుకుసాగాడు. కొంతదూరం వెళ్ళాక ఒకచోట వెండి నాణాల రాశి కని పించింది. కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణాలను మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. రాజు మిగిలినవారితో కలిసి ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారు నాణాల రాశి కనిపించింది. రాజుతో వచ్చిన అందరి దృష్టిని బంగారు నాణాల రాశి ఆకర్షించింది. రాజు వారిస్తున్నా వినక ఇతరుల లాగే బంగారు నాణాలను మూటలు కట్టుకుని ఇంటిదారి పట్టారు.
చివరకు రాజు, రాణి ఇద్దరే మిగిలారు. రాజుగారు రాణితో ఇలా అన్నారు. ”చూడు ఈ ప్రజలు ఎంత మూర్ఖులు, ఆశపరులో! భగవంతుడి నిజ దర్శనం లభిస్తుందని తెలిసినా ఎలా వెళ్ళిపోయారో! భగవంతుడి నిజ దర్శనం లభించడం కంటే భాగ్యం ఏముంటుంది? భగవంతుడి ఎదుట ఈ ధనం, సిరిసంపదలు ఒక లెక్క కాదే! ఈ విష యం వీరికి ఎవరికీ తెలియటంలేదు” అని బాధపడ్డారు. రాజురాణి ముందుకు సాగా రు. కొంతదూరం వెళ్లాక ఏడు రంగులలో ధగధగా మెరుస్తూ వజ్రాల రాశి కనిపించిం ది. వాటిని చూసిన రాణి ఆకర్షితురాలై అటువైపు పరిగెత్తింది. వజ్రాలన్నింటినీ మూట కట్టుకోవటం ప్రారంభించింది. ”మీరు త్వరగా వెళ్ళిరండి” అంది.
రాణి మాటలకు రాజు విరక్తిచెందింది. బరువైన మనసుతో ఒక్కటే భగవంతుడు చెప్పిన కొండవైపుగా సాగాడు. నిజంగా భగవంతుడు అక్కడ నిలబడి వున్నాడు. ఒంటరిగా వచ్చిన రాజును చూసి చిరునవ్వుతో ”రాజా! నీ భార్య, బంధువులు, ప్రజలు ఎక్కడ? నేను చాలాసమయం నుంచి ఇక్కడే నిలబడి మీ అందరికోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను” అన్నాడు. రాజుగారు సిగ్గుతో తలదించుకున్నారు. అది చూసి భగవంతుడు ”ఓ రాజా! ఎవరైతే తమ జీవితంలో భౌతిక, సంసారిక సుఖా లు నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను కనిపించను. అలాంటివారు నా కృపను ఎన్నటికీ పొందలేరు.” అంటూ అంతర్థానమవుతాడు భగవంతుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement