Friday, November 22, 2024

దేవకీ స్మృతి విభ్రమం!

చిన్ని కృష్ణా! నిన్ను నోరారా ‘చిన్ని కృష్ణా’ అని పిలిచే భాగ్యానికి నేను నోచుకోలేదు. హంసతూలికా తల్పం పై పరిచారికల సేవలందుకొంటూ గర్భధారణ వేళ తిరిగే భాగ్యం దక్క లేదు. కటిక నేలపై కారాగార క్లేశాన్ని అనుభవిస్తున్న నా కడుపున పడ్డ నాడే నీకూ కష్టాలు మొదలయ్యాయి.
హింసకు మారుపేరు మీ కంస మామ. ఆకాశవాణి ఏదో అన్నదని భయపడ్డ పిరికి మనిషి. ”అన్న! తగ దన్న! శమింపుమన్న! తగదల్లుడు గాడిది మేనకోడలే!”- అని నేను ఎం త బ్రతిమాలినా వినలేదు. కాళ్ల పారా ణి కూడా ఆరని వేళ రాజలాంఛనాల తో రథంపై నేను, మహారాజుల వారు పయనిస్తున్న వేళ ఆకాశవాణి మాట లకు బెదిరిపోయాడు! మహా రాజుల వారు మీ మామయ్యను బ్రతిమాలా డు. ఏమానాన వున్నాడో! కంస మామ కత్తిని వొరలో దోపాడు. ఆనాడే నా తల కత్తి రించి వుంటే, ఈ పిచ్చితల్లి కడుపున పడి అష్టకష్టాలు అనుభవించే బాధ నీకుండేదిగాదు.
ఎంత పిచ్చివాడు కంసమామ! భార్యాభర్త లిద్దరినీ కారాగారంలో ఒకే గదిలో బంధించాడు. అంతా విధివ్రాత. నా చిన్నికన్నా! నీవు ఈ దౌర్బా éగ్యు రాలి కడుపు ఎంచుకొన్నావురా! నీకు ఆరోనెల రాగానే నీ మాయకాంతులు విరజిమ్మావురా! గర్భ దోహద క్రియ లు చేసేందుకు పరిచారికలేరీ? వసు మహారాజులవారే నాకు ఉపశమన వాక్యా లు పలికేవారు. రెండు చేతులకూ సంకెళ్లు. గర్బా éన్ని చేతులారా స్పృశించే భాగ్యమూ నాకు లేదు.
చిన్ని కన్నా! ప్రసవ సమయాన్ని అర్థరాత్రి వేళ ఎందుకెంచుకున్నావయ్యా! అదీ అష్టమి నాడు- అష్టమ గర్భం. నీ లీలామానుష విగ్రహ రూపాన్ని చూసి నేను, మహారాజులవారు దిగ్భ్ర మ చెంది కళ్లు మూసుకొన్నాం. ఎంత తేజస్సు? కారాగారమంతా నిండిన కాంతిపుంజాలు. సహ స్ర చంద్రోదయ భాసమాన కాంతిరేఖలు. నీ మహాద్భుత రూపసందర్శనం నా భాగ్యం.
అప్పుడే ఊడిపడ్డ నీవు అందరిలా కేరింతలు పెట్టలేదు. కారాగార రక్షకులు కంసమామకు చెబుతారని గాబోలు! ఒక చేతిలో శంఖం, మరో చేతిలో చక్రం, విష్ణు స్వరూప దర్శన భాగ్యం మా కు కల్పించావు కన్నా!
పొత్తిళ్లలో చిన్నిపాపడిని బుజ్జగించే యోగ్య త నాకు లేదాయె! అనూహ్యంగా చేతి సంకెళ్లు, కాలి సంకెళ్లు ఊడిపోయాయి భవబంధాల వ లె. మరుక్షణంలో యోగమాయ ఆవరించింది.
మహారాజులవారు ఏ మాయ చేశారో తెలి యదు. ఓ పసిపాప నా పొత్తిళ్లలో చేరింది. నీవే మో యదుకుల స్వామివయ్యావు. ఆ యశోద ఎంతటి అదృష్టవంతురాలు. అయినా, ఆమె మా త్రం ఏం అనుభవించింది గాక! నీ కొంటె చేష్టలు, రాక్షస సంహారాలు చూసి జడుసుకొనేది. అవు నూ! ఆమెకు రెండుమార్లు విశ్వరూపం చూపా వట! ఎంత అదృష్టవంతురాలు! నంద మహారా జు మరీ అదృష్టవంతులు. ఆ గోపికలు పెట్టి పుట్టి నవారు. ఆ గోవులది, గోవత్సాలది అసలైన అదృ ష్టం. పాలివ్వడానికి వచ్చిన పూతనను నేలపాలు చేశావు. చిన్ని పాదంతో శకటాసురుని వక్రబుద్ధి నణచావు. విర్రవీగిన బ్రహ్మదేవుడికే బుద్ధి గరపా వు. తెగ గర్వపడిన మహేంద్రుని ఆటకట్టించావు.
ఎందుకురా! చిన్ని కన్నయ్యా! పాపం ఆ యశోదను ముప్పుతిప్పలుపెట్టి అల్లరి చేశావు. నిన్ను కట్టివెయ్యాలని ఆ పిచ్చితల్లి భ్రమ! రోటికి కట్టివేసింది. భువన భాండాలు బొజ్జలో నింపుకొ న్న దామోదరుడవని ఆమెకేం తెలుసు? కాళీయ మర్దనం నీకు సరదా! పేరంటానికి పిలిచినట్లు కంసమామ మధురకు పిలిచాడు నిన్ను, అన్న నూ. ఇద్దరూ కలిసి ఆట కట్టించారా?
తాతయ్య ఉగ్రసేన మహారాజుకు చెరవిడి పించి సింహాసనంపై కూచోబెట్టావు. నా కడుపున పుట్టినందుకు ఆరుగురికీ అల్పాయుష్షు. హంస తూలికా తల్పంపై శయనించే మహారాజులకు నావల్ల కారాగారవాసం. ఎన్నాళ్లకు చూశానురా! అమ్మను చూడాలని నీకనిపించలేదు. నీకా గోపి కలు గుర్తున్నంతగా నేను గుర్తురాలేదు. నీ ముద్దు ముచ్చట్లు చూసే భాగ్యంలేదు. గోరుముద్దలు తినిపించే నోము నోయలేదు. నీకు గోపికల వెన్న ముద్దలు, తీపి ముద్దులు ఇష్టం! కన్నా! నిన్ను కన్నా! మరిచిపోకు. నన్ను ఏమరచకు!

Advertisement

తాజా వార్తలు

Advertisement