Tuesday, November 26, 2024

దేవకి చింత తీర్చిన బలరామకృష్ణులు

ఒకసారి బలరామకృష్ణులతో కొంతకాలము గడపాలని మహర్షులు అందరు శమంతపంచకమునకు వస్తారు. స్వర్గం నుండి నారదుడు, చ్యవన, అసిత, దేవల, విశ్వామిత్ర, సదా నంద, భరద్వాజ, గౌతమ, వశిష్ఠ, గాలవ, భృగు, పులస్త్య, కశ్యప, అత్రి, భృహస్పతి, అంగీరస, అగస్త్య, యాజ్ఞవల్క్య, వామదేవాది ఋషులు అందరూ వస్తారు. వారందరూ తపస్సంపన్నులు. ఈ లోకాన్ని లయింపజేయడానికి, నూతన లోకాన్ని సృష్టించటానికిగా ని కావలసిన తపస్సంపద వారిలో ప్రతి ఒక్కరికి వుంది. నారాయణా వతారులయిన బలరామకృష్ణులు, యాదవ కుటుంబంలో జన్మించి సాధారణ మానవులవలె జీవిస్తున్న ఆ సోదరులకు తమ గౌరవ వం దనాలు సమర్పించారు. తమ మనస్సులలో కృష్ణుని పూజించారు. వారి పూజలను గౌరవాన్ని అంగీకరించినట్లుగా శ్రీకృష్ణుడు తన నేత్రా ల ద్వారా తెలిపాడు.
ఋషులు కూడా తమ మనస్సుల ద్వారానే ”ప్రభూ! నీ చర్యలు సాధారణ మానవులకు అంతుపట్టనివి. ఒకే మట్టి నుండి వివిధ రకా లైన పాత్రలు చేస్తారు. ఒక్కొక్క పాత్ర ప్రత్యేకంగా వున్నా వాటిలోని మట్టి మాత్రం ఒకటే. అదే రీతిగా నీవు వివిధ రూపాలు, ఆకారాలతో ఈ లోకాన్ని సృష్టించి, పోషించి నశింపజేస్తున్నావు. ఎట్టి బంధాలకు లోబడవు. ఆ యా రూపాలలో నీకై నీవు ఆపాదించుకొన్న బంధాలను చూసి లోకులు నీవు సామాన్య మానవుడనవని, సుఖదు:ఖాలను చక్రగతి నీకు కూడా వర్తిస్తుందని భావిస్తారు. అంతరించిపోతున్న ధర్మాన్ని పున: ప్రతిష్టించుటకు నీవు మరల మర ల అవతరిస్తున్నావు. నీవు పరబ్రహ్మస్వరూపుడవని, గంగను పరిశుద్ధం చేసిన నీ దివ్యపాదములను దర్శించి మౌనంగా పూజించడానికి మేము ఇక్కడకు వచ్చా ము. మా ధన్యవాదములు స్వీకరించి ఆశీర్వదింపుము” అని ప్రార్థించారు.
ఇక వెళ్ళడానికి అందరూ శ్రీకృష్ణుని దగ్గర సెలవు తీసుకున్నారు. అక్కడే వున్న వసుదేవుడు వారిని అనుసరించాడు. ”నేను మిమ్ములను ఒక కోరిక కోరాలనుకుం టున్నాను. పాపభూయిష్టమైన ఈ జీవితం నుండి విముక్తి కలిగించే మార్గం నాకు బోధించండి’ అన్నాడు.
సాక్షాత్తు దైవస్వరూపం కృష్ణుడు తనతో వున్నప్పటికీ వసుదేవుడు తన పాపాల నుండి విముక్తి పొందడానికి మార్గం తెలుసుకోవాలనుకోవడం దైవలీల కదా అనుకున్నారు.
వసుదేవునితో ఋషులు ”నారాయణుని పూజించుటే నీవు అనుసరించదగు ఉత్తమ మార్గం. తొందరగా ముక్తిని చేకూరుస్తుంది మహారాజు తన జీవితంలో ఒకసారి అయినా యాగము చేసి దానధర్మాలు చేస్తే సులభంగా మోక్షం పొందు తాడు” అని చెప్పారు.
వెంటనే వసుదేవుడు మహాపురుషులు అయిన ఆ ఋషులందరి ఆధ్వర్యం లో పరమ పవిత్రమైన శమంతపంచక తీర్థము వద్ద యజ్ఞం చేయాలని సంకల్పిం చాడు. ఆ యజ్ఞ నిర్వహణకు తనకు సహకరింమని వసుదేవుడు ఋషులను కోర తాడు. అందుకు ఋషులు అంగీకరిస్తారు. వెంటనే యజ్ఞానికి కావలసిన సన్నాహా లు అన్నీ ప్రారంభమవుతాయి.
యజ్ఞము చేయాలనుకున్నవారికి సంపద, భార్యాపిల్లలు, భౌతికవాంఛలపై మమకారం వుండకూడదు. స్వర్గ జీవితము, స్వర్గ సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వుండకూడదు. ఆత్మజ్ఞానము కలగడానికి ఇవి గొప్ప అవరోధాలు. అందుకే పూర్వకాలంలో మహారాజులు మోక్షప్రాప్తికి రాజ్యము, సంపద, బంధువులను విడిచిపెట్టేవారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తప్పనిసరిగా చేయవలసిన కర్త వ్యాలు మూడు వున్నాయి. ఒకటి భగవంతుని పట్ల చేయాలి. అదే యాగము. రెండ వది ఋషుల పట్ల చేయాలి. మూడవది తల్లిదండ్రుల పట్ల చేయాలి. అది పుత్రుల కు జన్మనిచ్చి వంశము కొనసాగేట్లు చేయాలి. ఈ మూడు కర్తవ్యాలు నిర్వహిం చుటవలన వారు పైన చెప్పిన ముగ్గురి ఋణాలను తీచ్చుకోగలుగుతారు. వసుదేవుడు ఒక ఋణము మాత్రమే తీర్చుకోవలసిన అవసరం వుంది. అది దైవ ఋణము. యజ్ఞము చేయడం ద్వారా ఆ ఋణం తీరుతుందని ఋషులు వసు దేవుడికి చెబుతారు. వసుదేవుడు జరిపిన యాగానికి ఋషులు ఋత్విక్కులుగా వ్యవహరించారు.
ఆ సమయంలోనే దేవికి బలరామకృష్ణులను పిలిచి ”మీరిద్దరు నారాయణు ని అవతారాలని ఋషులు నాకు చెప్పారు. వారు చెప్పినదానిని నేను విశ్వసిస్తున్నా ను. మీరిద్దరు నాకు పుత్రులు అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం మీ ఇద్దరు సాందీపుడు గురుదక్షిణగా తన పుత్రుని బ్రతికించ మని కోరినప్పుడు, మీరు యమపురికి వెళ్ళి ఆ కార్యము నిర్వహించిన విషయం నాకు తెలుసు. మీరిద్దరికి ముందు నాకు పుట్టిన ఆరుగురు పుత్రులను కంసుడు సం హరించాడు. అది తలచుకొని నేను చాలాకాలం బాధపడ్డాను. నాకు వారినందరిని ఇప్పుడు ఒకసారి చూడాలని వుంది.” అంది.
వెంటనే బలరామకృష్ణులు తమ యోగశక్తితో సుతల లోకానికి వెళతారు. ఆ లోకమునకు బలి అధిపతి. అతడు బలరామకృష్ణులను సంతోషంగా ఆహ్వానిం చాడు. వారిని బలి స్తుతిస్తాడు. వాటిని స్వీకరించి కృష్ణుడు ఇలా అంటాడు. ”నిన్ను ఒక సహాయం కోరడానికి వచ్చాము. స్వాయంభువ మన్వంతరమందు మరీచి వర్షలకు ఆరుగురు పుత్రులు కలిగారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన కుమార్తె సరస్వతితో రతికేళి చేయయత్నించాడు. అది చూచి మరీచి ఆరుగురు పుత్రులు నవ్వారు. అప్పుడు బ్రహ్మ వారిని అసురులుగా జన్మించమని శపించాడు. వారు హిరణ్యకశిపుని పుత్రులుగా జన్మించారు. ఆ తర్వాత వారు దేవకీదేవికి జన్మించా రు. జన్మించిన వెంటనే వారిని కంసుడు సంహరించాడు. వారిప్పుడు నీవద్ద వున్నా రు. చనిపోయిన తన పుత్రులను చూడాలని మా తల్లి దేవకి తపిస్తోంది. వారిని నేను తీసుకువెళతాను. ఆ తర్వాత వారు శాపవిముక్తులై స్వర్గలోకానికి వెళతారు” అని చెబుతాడు.
బలరామకృష్ణులు దేవికి ఆరుగురు పుత్రులను తమతో తీసుకువెళతారు. వారి పేర్లు స్మర, ఉద్గత, పరిష్వంగ, పతంగ, క్షుద్రభృత్‌, ఘృణి. ద్వారక చేరిన తర్వాత బలరామకృష్ణులు ఆ ఆరుగురిని తల్లి సమక్షానికి తీసుకువెళతారు. మర ణించిన తన పుత్రులను చూసి ఆమె అమితంగా సంతోషించింది. వారిని తన తొడ పై కూర్చోపెట్టుకుని కన్నీటితో అభిషేకించింది. దాంతో వారు శాపవిముక్తులై దేవకీ వసుదేవులకు ప్రణామం చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. ఇన్ని సంవత్సరాలుగా ఆమె పొందిన తపన, బాధ అంతా అదృశ్యమయిపోయాయి. తన పుత్రులు తిరిగి తనను కలుసుకున్న వెంటనే అలా వెళ్ళిపోవడం ఆమెను బాధించలేదు. వారు తిరిగి స్వర్గలోకానికి వెళ్ళారని ఆమె ఏమాత్రం విచారించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement