Saturday, November 23, 2024

దేవ గణారాధనే ప్ర‌కృతికి రక్షణ

ఉన్నది ఒక్కటే! అదే భగవంతుడు. రకరకాల భావాలు, నమ్మకాలు, రూపాలు, మహిమలు ఏదైతేనేమి చివరకు చేరేది ఆ ఒక్కడినే! ఆయన దష్టిలో సకల చరాచర జీవరాశుల ఆయుర్దాయం కనురెప్ప కాలములో సహస్రాంశం.
ఈ మాత్రం దానికి నాది గొప్పంటే నాది గొప్పని కొట్టుకు చావడమంత అజ్ఞానం మరొకటి ఉండదు.

”బహుస్యాం ప్రజాయాయేతి” అద్వైత సత్యమైన ఆ ఒక్క భగవంతుడు అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ అనేకమే ఈ సకల విశ్వము. అనంతమైన ఈ అంతరిక్ష సమూహాలే ఆ ఒక్కటి. ఆ అనం తంలో విచిత్రం మనం నివసించే భూమి, ఎను బది నాలుగు లక్షల జీవరాశులు. ప్రతి సెకను లోని సహస్రాంశములో జీవి పుడుతోంది. నశిస్తోంది.
భగవంతుడు అనేకమవడంతోనే కాలా న్ని సృజించి మనకందించాడు. దానితోపాటు గా త్రిగుణాలను కలబోసి ప్రకృతిని మనకం దించాడు. అణువులో ఎలక్ట్రాన్‌, ప్రోటాన్‌, న్యూట్రాన్‌లని మన ఆధునిక రుషులు చెప్పేది ఆ గుణాల గురించే!
త్రిగుణాలు సత్త్వ, రజో, తమోలనే పదా ర్థ చైతన్యాలు. వీటిని గుర్తించి, అనుభవించి, ప్రతిఫలించేది మనసనే మహా పదార్థం. వీటికి ఇంధనం ఆహారం. ఈ అనంత విశ్వరూపంలో జీవి ఎక్కడ ఉన్నా త్రిగుణాల ప్రభావంతో సత మతమవడం తప్పదు.
స్వచ్ఛమైన కాంతి ద్వారా సృష్టి విన్యాసా లను స్పష్టంగా చూడవచ్చు. ఆ స్వచ్ఛమైన గుణమే సత్త్వ గుణం. జీవుని గమ్యాన్ని చూపే ది కూడా ఈ గుణమే. ఇక ఆహారోత్పాదనకు నిత్యమూ కర్మలను ప్రేరేపించేది, రాగద్వేషా లు, అహంకారం, తాపం, దు:ఖం, పీడనం మొదలైనవాటిని ప్రేరేపించేది రజోగుణంగా భావించాలి. కర్మను వ్యతిరేకించి బద్ధకంతో సృ ష్టికి విరుద్ధంగా చేసేది తమోగుణం. అజ్ఞా నం, దురాక్రమణ, హింస దీని ప్రధాన లక్షణాలు.
జన్మ మెత్తినది ఏదైనా ఈ సృష్టిని ఆస్వా దించక తప్పదు. తనలో త్రిగుణాలను నింపు కుని జీవించడం, తుదకు మార్పు చెందడం సహజం. ఈ అద్భుతమైన, అనిర్వచనీయ మైన అనుభవాన్ని ఇచ్చిన ప్రకృతిని, దానిని సృష్టించి మనిషిని అందులో భాగం చేసిన భగ వంతునికి సదా కృతజ్ఞత చూపించడం మాన వ లక్షణం. దానికి దోహదపడేది సత్త్వ గుణం. అటువంటి సత్త్వ గుణాన్ని ప్రధానంగా సూచి స్తూ దిశా నిర్దేశం చేసేది మన సనాతన ధర్మం. దైవ దత్తమైన ఈ ధర్మాన్ని పాటించేవారు సత్య మైన ఆ భగవంతుని వీక్షించడం, ఐక్యమవడం పరమ సత్యం.
త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతిని మన కున్న అతిస్వల్ప జీవిత కాలములో పూజించి పరిరక్షించాలనేది సనాతన ధర్మము యొక్క పవిత్రాశయం. అందుకే ప్రకృతి శక్తులను అగ్ని, వాయు, వరుణ, ఇంద్ర, భూదేవి మొద లైన నామాలతో కీర్తించి, పూజిస్తున్నాము. రావి చుట్టూ తిరిగినా, పుట్టలో పాలుపోసి మ్రొ క్కినా, కప్పల కళ్యాణం చేసినా, గిరిప్రదక్షిణ చేసినా, నదికి హారతులిచ్చినా వీటి అంతరార్థం ప్రకృతిలో మనమొక భాగమని చాటడం. ప్రకృతి సమతౌల్యం మానవ సౌభాగ్యం. ఎప్పుడైతే ప్రకృతిని అసమతుల్యం చేయడా నికి ప్రయత్నిస్తామో అప్పుడు నాశనం తప్ప దు. అందుకే అనేక పండగల రూపాలలో దైవీ శక్తి అయిన ప్రకృతిమాతను అనేక పరోక్ష పద్ధ తులలో పూజిస్తున్నాము.
నాగుల చవితిని పుట్ట దగ్గరకు వెళ్ళి సర్పా న్ని చూస్తూ నిర్భయంగా పూజిస్తున్నామంటే మేమూ నీతో బాటు కలసి మెలసి ఉంటాం అని ప్రకటించడం. ఏ జీవికైనా తెలిసో తెలియకో హాని తలపెడితేనే అవి ప్రతిఘటిస్తాయి. నిజా నికి సమస్త జీవరాశులలో అత్యంత ప్రమాద కారి మానవుడేనని మిగిలిన జీవులన్నీ తీర్మా నం చేసే ఉంటాయి. ఎందువలన అంటే తనకు తానేకాక ఈ భూమండలాన్నే భస్మీపటలం చేయడానికి నిరంతరం రజో, తమో గుణాల ను దత్తత చేసుకుని ప్రయత్నిస్తున్నాడు. దేవగణమంతా ఎల్లవేళలా ఈ సృష్టిని కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకే ఆ దేవగణాన్ని దేవతా రూపాల్లో పూజిస్తూ ఉంటాము. అసుర భావా లను సంహరించి సుఖశాంతులతో జీవించి చివరకు ముక్తిని పొందేలా కటాక్షిస్తున్నారు దేవీదేవతలు. తారకాసురుని సంహరించిన కుమార స్వామిని అనేక నామాలతో, రూపాలతో మనం సుబ్రహ్మణ్యషష్టి జరుపుకుంటాం. అసుర సంహారంలో కార్తికేయుడు సర్ప రూపం కూడా దాల్చాడు. అందుకే కొన్ని ప్రాం తాల్లో శరణవభవుని సర్ప రూపంలో పూజి స్తారు.
మయూర వాహనుడైన కృత్తికా తన యుడు తన మహిమలను ప్రదర్శిస్తూనే ఉం టాడు. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల రెండో పుత్రుడు, గజముఖుని తమ్ముడైన కుమారస్వామిని పూజించడమంటే ప్రకృతిని పూజించడమే!
స్వమాయా శక్తితో నిర్మించిన ఈ సృష్టిని, ప్రకృతిని సేవించి తరించాలి తప్ప ఎదురు తిరి గి విర్రవీగితే భగవంతుడు క్షణంలో జీవులను భస్మం చేస్తాడు. ఇది ఒక అద్భుత సృష్టి. మాన వ మేధకు అందని రహస్యాలు ఎన్నో ఉన్నా యి. భగవంతుని తెలుసుకోవడానికి ప్రయ త్నించవచ్చు. అంతేకాని శాసించడానికి ఆలో చన చేస్తే మానవ మెదడును జడముగా మార్చే యడం ఖాయం. రాయి, రప్ప, చెట్టు, పుట్ట, నీరు, నిప్పు, గాలి, మెరుపు, వర్షం ఇవన్నీ ప్రకృతి ద్వారా మనకందించిన గొప్ప వరాలు.
సత్త్వ గుణంతో వీటిని అనుభవించి నన్ను చేరమని మనకీ జన్మనిచ్చాడు భగవంతుడు. ఏ అవతారమెత్తినా సృష్టి ధర్మాన్ని కాపా డడానికేనని ప్రతీ మనిషి గుర్తించాలి. సర్వ మానవ శ్రేయస్సే ధ్యేయంగా సాగుతున్న సనా తన ధర్మ పథాన్ని ఆశ్రయించకపోతే అశాంతే తప్ప శాంతికి చోటు ఉండదు. అందుకే అంతి మ విజయం ధర్మానిదేనని సృష్టి వాక్యంగా ముందు ప్రకటించాడు భగవంతుడు.

– వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement