Friday, September 20, 2024

దేహాథో ముఖత్వన్యాయము!

దేహ అనగా దేహము, శరీరము, తనువు, మేను. అథోముఖము అనగా తక్కువ స్థాన ము, పాతాళ ముఖము, పతనము అనే అర్థాలున్నాయి. పాంచ భౌతికమైన దేహ మును ఆశ్రయించిన ఆత్మ అథోముఖ గతి ని పొందుతుంది.
మనిషిని పంచముడు అంటారు. పం చముడు అంటే పంచభూతాలైన భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశములతో ఏర్పడిన వాడని అర్థము. అలాంటి పాంచ భౌతిక దేహాన్ని ఆశ్రయించిన ఆత్మ ఐహక సంబంధమైన విషయ వాసనలకు లోబడి అథోముఖంగా సంచారము చేస్తుంది. ఊర్ధ్వ ముఖంగా అమల జ్ఞానమును, తుర్యాతుర్యములను ఎరుగవలసిన ఆత్మ అలా అథోముఖంగా తిరుగుతుందన్న మాట.
అయితే అథోముఖము, ఊర్థ్వ ముఖము అనేవి ప్రత్యేకంగా విభజిం పబడి ఉన్నాయా? అనే సందేహం కలుగుతుంది. అథోముఖము అంటే భ్రాంతి. ఊర్థ్వ ముఖము అంటే భ్రాంతి రహతమైన స్థితి. అయితే అథో ముఖము ఊర్థ్వ ముఖము అనేవి కంటికి ప్రత్యక్షంగా కానరావు. కాబట్టి ఏమీ లేవనే అనిపిస్తుంది. ఆధ్యాత్మిక వాదులు ఏమంటారంటే శరీరం లోపల ఉండేది ఆత్మ అనీ, బయట ఉండేది పరమాత్మ అని అంటారు. ఇలా మానవుడికి బయట ఉండేది బహ: ప్రజ్ఞ. లోపల ఉండేది అంత: ప్రజ్ఞ. అదీ మానవుడు ఉంటేనే మానవుడుగా రూపమెత్తనప్పుడు అంత: ప్రజ్ఞ, బహ: ప్రజ్ఞ కలిపి ఒకటే ప్రజ్ఞ. ఇక్కడ ప్రజ్ఞ అనేది ఒక ఆత్మజ్యోతిగా భావిస్తే అంతర్‌ జ్యోతి, బహర్‌ జ్యోతి కలిపి ప్రత్యక్‌ జ్యోతి మాత్రమే. అది అర్థంకానంత వరకూ ఊర్ధ్వ ముఖము, అథోముఖము అనేవి ఉన్నాయనే భ్రాంతిలో ఉంటాము. ఈ జగత్తులో శరీరమే నేను అనుకున్నప్పుడు పంచభూతాల స్వరూపమే నేనుగా అయ్యాననేది గ్రహంచాలి.
ఆత్మ లేని దేహము నిరుపయోగము, విలువ రహతము. ఆత్మ నాశ రహతము, శాశ్వతమని తెలుసుకోవాలి. ఆత్మ దేహమందు నిలిచి వున్న ప్పుడు చైతన్య పూర్ణమౌతుంది. ఆత్మ దేహము నుండి ముక్తిని పొందిన తర్వాత దే#హము చైతన్య రహతమవుతుంది కానీ ఆత్మ కాదు అనే విషయాన్ని గ్రహంచాలి. అలా శరీరం నుండి విడివడిన ఆత్మ ఊర్థ్వ ముఖమున పయనిస్తుంది. ”అథో ముఖంతు హృత్పద్మముద్ధత్య ప్రణవే నతు” అంటే అథోముఖమై ఉన్న #హృదయ పద్మమును ప్రణవము అంటే ప్రాణాయామం ద్వారా ఊర్థ్వ ముఖము చేసి వికసింప చేయాలి.
ఆత్మ తత్వము బోధపడాలంటే దేహాత్మ నేను, ఉనికి జ్ఞానము అనే చైతన్యం రెండో నేను అంటే సత్‌చిత్‌ ఆనందం.. ఇలా రెండు నేనులతో ఉండే మనం ఉన్నామని గ్రహంచాలి. మొదటి నేను అయిన దేహాత్మ బహర్ముఖంలో ఉన్న నేననీ, ఆత్మ ప్రకాశంచేత అం త:క రణ ప్రతిబింబముగా వచ్చినటువంటి నేను అనేది అంతరాత్మ అని తెలియాలి. ధ్యానం చేయడం వల్ల లోపల బయట ఊర్థ్వ,అథో ముఖాలనేవి ఏమీ లేవనే స్ఫురణ కలు గుతుంది. దే#హతో ముఖత్వ న్యాయము”లోని అంతరార్థం అర్థమైంది. నేను అనే భావన వీడితే సత్‌చిత్‌ ఆనంద నిల యమైన ఆత్మతత్వము, ఆత్మ జ్ఞానం, పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోగలం.

Advertisement

తాజా వార్తలు

Advertisement