Tuesday, November 19, 2024

ఇంద్రజిత్తు మరణంతో రావణుడి ఓటమి

మకరాక్షుడి మరణవార్త విన్న రావణుడు ఇంద్రజిత్తుతో వానరులకు ఎదురుగా నిలబడి యుద్ధం చేయకుండా, మాయ ప్రయోగించి వాళ్లను చంపమని చెప్తాడు. ఇంద్ర జిత్తు, అదృశ్యంకాగల రథం ఎక్కి వెళతాడు. వానరసేన మధ్యవున్న రామలక్ష్మణులను చూసి జడివానలా బాణాలను వారిమీద వేయగా వారు కూడా బాణాలను వేశారు. అయితే, రామలక్ష్మణుల బాణాలు ఇంద్రజిత్తుకు తగల్లేదు. ఇంద్రజిత్తు బాణాలు రామలక్ష్మ ణుల దేహాలను తాకి బాధపెట్టాయి. వంచనతో యుద్ధం చేస్తున్న ఇంద్రజిత్తు వ్యవహారానికి కోపించి లక్ష్మణుడు ”అన్నా! నువ్వు అంగీకరిస్తే బ్రహ్మాస్త్రం ప్రయోగించి ప్రపంచంలో రాక్షసులనే వారు లేకుండా చేస్తాను” అన్నాడు. దానికి రాముడు అంగీకరించలేదు.
యుద్ధం చేస్తూ, ఇంద్రజిత్తు హనుమంతుడున్న పశ్చిమ ద్వారానికి వచ్చాడు. మాయా సీతను తన శక్తితో కల్పించి, ఏడుస్తు న్న ఆ రూపాన్ని తన రథం మీద వుంచుకుని, వానరులకు ఎదురుగా (మాయా) సీతను చంపడానికి పూనుకున్నాడు. #హనుమంతుడు రథం మీదున్న మాయా సీతను చూసి ఆమె నిజమైన సీతే అని సంకటపడ్డాడు. ఇంద్రజిత్తు ఏ కీడు చేయకముందే (మాయా) సీత ను రక్షించాలనుకున్నాడు హనుమంతుడు. తన మీదికి వస్తున్న హనుమంతుడిని చూసి ఇంద్రజిత్తు ఖడ్గంతో (మాయా) సీతాదేవి తల వెంట్రుకలు పట్టుకుని, ఆమె ”రామా! రామా!” అని అరుస్తుం టే నరికాడు. హనుమంతుడు వానర సేనల మధ్యవున్న శ్రీరాముడి ని సమీపించి దు:ఖంతో పాపాత్ముడు ఇంద్రజిత్తు సీతను చంపాడని చెప్పాడు. హనుమంతుడు చెప్పగానే రాముడు నేల కొరిగాడు.
ఇది గమనించిన లక్ష్మణుడు ప్రేమతో అన్నకు ఓదారు స్తుం డగా, అక్కడికి విభీషణుడు వచ్చి, దు:ఖిస్తున్న లక్ష్మణుడిని, ఇతర వానరులను చూసి, విషయం తెలుసుకుని ”పుణ్యాత్ముడా! సము ద్రం ఇంకిపోయిందని ఎవరైనా చెప్తే, అది ఎంత నిజమో, హనుమం తుడు చెప్పింది కూడా అంతే నిజమే! నమ్మతగినది కాదు. ఎందు కంటే, సీత విషయంలో రావణుడి చిత్తవృత్తి నాకు తెలుసు. ఆమెను వాడు చంపడు. ఏవిధంగాను బాధించడు. రామచంద్రా! సామ దాన భేదం వల్లకాని, మాయాదండం వల్ల కాని, సీతాదేవి సమీపా నికి వెళ్ళడానికి ఎవ్వరికీ సాధ్యపడదు. కాబట్టి ఇంద్రజిత్తు సీతాదేవి ని లాక్కొని తెచ్చి సం#హరించడం అనేది అవాస్తవం. ఇంద్రజిత్తు ఇలా చేయడానికి కారణం ఏమిటని నువ్వు అడగవచ్చు. ఇప్పటిదాకా లంకలో వున్న యోధులంతా యుద్ధం చేస్తుంటే ఇంద్రజిత్తు లంకలో హోమాలు చేసి వస్తున్నాడు. ఇప్పుడు లంకలో అతను తప్ప ఇతరులెవరూ ఇక్కడికి వచ్చి మనతో యుద్ధం చేసేవారు లేరు. ఎవరు అతడు చేస్తున్న యజ్ఞాన్ని విఘ్నం చేస్తాడో అతడి చేతిలో ఇంద్రజిత్తు చస్తాడని బ్రహ్మవరం వుంది. యజ్ఞం పరిపూర్ణంగా సమాప్తమైతే అతన్ని దేవతలైనా జయించలేరు. ఇంద్రజిత్తు మిమ్మల్నందరినీ మోసం చేశాడు. ఆలస్యం చేయ కుండా మా వెంట లక్ష్మణుడిని పంపు. ఇంద్రజిత్తును చంపుతాడు. ముందుగా లక్ష్మణుడు ఇంద్రజిత్తు యజ్ఞాన్ని చెడగొట్టాలి. ఆ తరు వాత వధించాలి. యజ్ఞం పూర్తవుతే అదృశ్యుడై యుద్ధం చేస్తాడు.”
”ఇంద్రజిత్తు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మవల్ల బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని, ఆకాశ సంచారం చేయగల గుర్రాలను, రథాన్ని వరం గా పొందాడు. ఆ కారణాన వాడు యజ్ఞం పూర్తిచేయాలని తలచి దానిమీదే మనసు నిలిపి వున్నాడు. సేన తనను చుట్టుకుని వుండగా వాడు కనపడకుండా నికుంభిలకు పోయాడు. ఆ యజ్ఞం వాడు పూర్తిచేస్తే మనమంతా చచ్చిపోయినట్లే. బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చే టప్పుడు ఈ యజ్ఞాన్ని ఎవరు విఘ్నపరుస్తారో వాడి చేతిలో ఇంద్ర జిత్తు చావున్నదని చెప్పాడు. కనుక ఇంద్రజిత్తు మరణిస్తే రావణుడు చచ్చినట్లే. రామా!” అన్నాడు. వెంటనే రాముడు లక్ష్మణుడిని విభీష ణుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు అన్న పాదాల కు నమ స్కారం చేసి, విభీషణుడితో కలిసి బయలుదేరాడు.
విభీషణుడు సూచన మేరకు లక్ష్మణుడు పిడుగుల్లాంటి బాణా లను రాక్షసుల మీద వేశాడు. వానరుల దాడికి, లక్ష్మణుడి బాణాల కు భయపడకుండా రాక్షస సేనలు వానరసేనకుఘోరమైన యుద్ధం జరిగింది. వానరుల ముందు నిలబడలేక రాక్షసులు చెదరిపోగా కోపంతో ఇంద్రజిత్తు హోమం చేయడం ఆపుచేసి బయటకు వచ్చా డు. అక్కడికి వచ్చిన హనుమని రాక్షస మూకలన్నీ కలిసికట్టుగా ఎదుర్కున్నాయి. వారందరినీ పీనుగుపెంటలు చేశాడు హనుమం తుడు. ఆ దిక్కుగా రథాన్ని వేగంగా పోనిమ్మనీ, లేకపోతే హనుమం తుడు రాక్షస సేననంతా నాశనం చేస్తాడని ఇంద్రజిత్తు అన్నాడు.
హనుమంతుడి పైకి బాణాలు వేసేందుకు విల్లెక్కుపెడుతున్న ఇంద్రజిత్తును చూపించి విభీషణుడు లక్ష్మణుడితో త్వరగావెళ్ళి వాడిని బాణాలతో పడగొట్టమని పురమాయించాడు.
విభీషణుడు, లక్ష్మణుడిని సమీపంలోనే వున్న వనంలోకి తీసుకుపోయి, అక్కడ ఇంద్రజిత్తు యజ్ఞం చేసిన విధానమంతా వివరించాడు. ”లక్ష్మణా! భయంకరమైన మర్రి చెట్టు ఇదే! ఇక్కడ ఇంద్రజిత్తు భూతాలకు బలులిచ్చి, హోమం పూర్తి చేసి, యుద్ధా నికి వస్తాడు. రాగానే ఎవరికీ కనపడకుండా యుద్ధం చేస్తాడు. శత్రువు లను చంపుతాడు. అందుకే మళ్లిd ఇక్కడికి ఇంద్రజిత్తు రాకుండా రథంతో, సారథితో సహా చంపు” అని చెప్పాడు విభీషణు డు. అలాగే చేస్తానని లక్ష్మణుడు తన విల్లు తీశాడు. ఇంతలో లక్ష్మణుడి దగ్గరికి ఇంద్రజిత్తు వచ్చాడు. అతడిని చూడగానే కోపంతో లక్ష్మణుడు ”నిన్ను వెతుక్కుంటూ వచ్చాను.నీ మాయలిక సాగవు.” అన్నాడు. ఇంద్రజిత్తు కోపంగా హనుమ వీపు మీద వున్న లక్ష్మణుడిని ”నా బాణాలు నిన్నేమి చేయబోతున్నాయో చూడు. నీ సేనను అవి కాలు స్తాయి. ఇప్పుడే మీరంతా యమపురికి పోతారు. ఎవరైనా నా బాణ వర్షాన్ని స#హంచగలరా? లక్ష్మణా! గతంలో నా బాణాల దెబ్బకు తెలివితప్పి కొనవూపిరితో పడిపోయిన సంగతి మరిచావా? తెలివి మాలినవాడివై మళ్లిd ఇక్కడికి వచ్చావు” జవాబుగా లక్ష్మణుడు, ”చేతగాని ప్రతిజ్ఞలు ఎందుకు పలుకు తావు? మాయా యుద్ధం చేయలేవు కదా? ఏదీ నీ బాహాటమైన శక్తి చూపించు. నా భుజ బలంతో నిన్ను యుద్ధంలో ఓడిస్తాను.”
ఇంద్రజిత్తు లక్ష్మణుడి మీద బాణాలు వేయడం ప్రారంభిం చాడు. ఇరువురి మధ్య ఘోర యుద్ధం జరిగింది. లక్ష్మణుడి బాణాలకు ఇంద్రజిత్తు కవచం, తునాతునకలై రథం మీద పడిం ది. ప్రతిగా భయంకరమైన బాణాలను వేసి ఇంద్రజిత్తు లక్ష్మణుడి కవచాన్ని కూడా ఖండించాడు. ఇద్దరిలో ఎవరూ వెనుకడుగు వేయలేదు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారథి శిరస్సు ఖండించా డు. సారథి లేకపోయినా గుర్రాలు తిరగడం చూసిన శరభుడు, గంధమాదనుడు, రభస ప్రమాధుడు అనే వానరవీరులు ఇంద్ర జిత్తు నాలుగు గుర్రాలను చంపారు. మాయలు చేయడంలో నేర్ప రైన ఇంద్రజిత్తు లంకకు పోయి వేరే రథంతో సారథి తో సహా వచ్చి యుద్ధంచేశాడు. తాను వేసిన అన్ని అస్త్రాలనూ ఇంద్రజిత్తు ధైర్యంగా ఎదుర్కోవడంతో లక్ష్మణుడు మామూలుగా చావడు అనుకున్నాడు. తాను ఒకవేళ బ్రహ్మాస్త్రం వేసినా అతను కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడని భావించాడు. ఇలా ఆలోచించి, లక్ష్మణుడు, ఇంద్రాస్త్రాన్ని సంధించి ఇంద్రజిత్తు మీద వేయగా అది సూర్యకాంతితో ఇంద్రజిత్తు తలను ఖండించింది. అది చూసిన విభీషణుడు, వానరులు, దేవతలు సంతోషించారు. తమ ప్రభువు మరణం చూసిన రాక్షసులు, వానరులు తరుముకొస్తుంటే ఆయుధాలను నేలపడేసి, లంకవైపు పరుగెత్తారు. జాంబవంతుడు, హనుమంతుడు, విభీషణుడు, ఇంద్రజిత్తుని చంపిన లక్ష్మణుడిని పొగిడారు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

  • వనం జ్వాలా నరసింహారావు
    8008137012
Advertisement

తాజా వార్తలు

Advertisement