Friday, November 22, 2024

దత్తాత్రేయుని గురువు ప్రకృతిమాత!

మహా పతివ్రత అనసూయాదేవిని త్రిమాతలు పరీక్షింపద లచి త్రిమూర్తులను అత్రి మహర్షి ఆశ్రమానికి పంపారు. త్రిమూర్తుల కోర్కెను తీర్చడానికి వారిని శిశువులుగా మా ర్చివేసింది. తరువాత అత్రి మహర్షికి వరాలు ఇవ్వడం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరుసగా చంద్రుడు, దత్తుడు, దుర్వాసునిగా అత్రి, అనసూయలకు జన్మించడం జరిగింది. చంద్రుడు, దుర్వాసుడు తమ దివ్య అంశలను దత్తాత్రేయునకు దత్తత చేసి వారు తప స్సులో మునిగిపోయారు. త్రిమూర్తుల అంశతో శ్రీ దత్తాత్రేయుడు అవధూ తయై నేటికీ భూ లోకంలో సంచరిస్తున్నారు.
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్‌
ప్రసన్నార్తి హరం వందే స్మర్తృగామీ సనోవతు
భక్తి ప్రపత్తులతో స్మరించిన వారికి ఎంతో వాత్సల్యంతో ప్రక్క న నిలుస్తారు శ్రీ దత్తాత్రేయులు. అటువంటి శ్రీ దత్తులవారి గురువు ప్రకృతి మాత. ఈ విశ్వంలోని పరమాత్మ తత్త్వమును తన గురువు గా భావించిన మహిమాన్వితులు శ్రీ దత్తులు. విశ్వం నుండి గ్రహిం చిన ఇరువదినాలుగు అంశలను తన జ్ఞానబోధగా ముందు తాము అవగతం చేసుకొని తిరిగి తన భక్తులకు అందించారు.
మొదట భూమిని గురువుగా భావించారు. విశ్వకర్త పరమా త్మ ఆజ్ఞానుసారం భ్రమణ, పరిభ్రమణాలను క్రమం తప్పకుండా చేయడం. అనగా ఓర్పు, సహనం, నిబద్ధత, నిస్వార్థం, ఆహారం అం దించడం, క్షమ, త్యాగంలాంటివి భూమాత నుండి నేర్చుకోవాలి.
గాలి నుండి స్వేచ్ఛ, స్వచ్ఛత గ్రహించాలి. ఎటువంటి ప్రదేశాల పైనుండి వీచినా తన నిజస్వరూపాన్ని విడవకుండా ఉంటుంది. సక ల జీవులకు ప్రాణాధారమై సృష్టికి సహకరిస్తోంది. స్వేచ్ఛకు భంగం రాకుండా చూసుకుంటూ, ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించకుం డా జీవించాలి. మనసులోకి ఎటువంటి చెడు ఆలోచనలు చేరినా వాటిని బుద్ధితో ఆలోచించి చిత్తమును చేరనీయకూడదు. దుర్గం ధం లాంటి దుర్గుణాలను వేరు చేయాలి. క్షణం వాయువు ఆగితే ప్రళయమే! అనే రహస్యాన్ని తెలుసుకుని అణుకువతో ఉండాలి.
అనంతమైన నిర్గుణుడే పరమాత్మ అనే సత్యాన్ని ఆకాశం నుం డి గ్రహించాలి. మనలోని ఆత్మ దానిలోని అంతర్భాగము. నిర్గుణం లో ఏదీ నీ స్వంతం కాదు. జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం అని ఆకాశం తెలియచేస్తోంది. సృష్టిలోని కనపడేదంతా నీ స్వంతం కాదు. అసల ది ఆకాశం లాంటిది. ఉందంటే ఉంది లేకపోతే లేదు.
నీరు స్వచ్ఛతను బోధిస్తుంది. ఆధ్యాత్మికత సాధన స్వచ్ఛతతో నే సాధ్యం. మనోనిర్మలంతోనే ఒక్కొక్క సోపానం అధిరోహించగ లరు. ఆహారం లేకపోయినా జలంతో జీవించగలరు. అంటే పదా ర్థంకంటే యథార్థం సత్యం. అటువంటి నీరు మానవులకు స్వచ్ఛత అనే శీల ప్రధానాన్ని నొక్కి చెపుతుంది. అందుకే జలవనరుల స్వచ్ఛ తను కాపాడుకుంటే మానవుల మనసులూ స్వచ్ఛంగా ఉంటాయి.
అగ్ని జ్ఞానాన్ని బోధిస్తుంది. వెలుగు అజ్ఞానాన్ని పారద్రోలు తుంది. కావాలని అజ్ఞానంతో మెలగితే జ్ఞానాగ్ని నిన్ను దహించి వేస్తుంది. ముక్తికి మార్గం జ్ఞానయజ్ఞము. అజ్ఞానం అనే నిప్పుతో సహవాసం చేస్తే అది నిన్ను భస్మం చేస్తుందని గ్రహించాలి.
”చంద్రమా మనసో జాత:” చంద్రుడు మనసుకు ప్రతీక. భూ మి మీదనున్న మానవునికి అది పెరుగుతూ, తరుగుతూ దర్శనమి స్తుంది. వెలుగునీడలు నిజం కాదు. ఉన్నది ఒక్కడే పరంజ్యోతి. అదే పరమాత్మ.ఆత్మ సత్యం, మిగిలిన ఉపాధులన్నీ మిథ్య అని చంద్రు డు బోధిస్తాడు. జీవులన్నింటిలో ప్రకాశించేది ప్రత్యక్ష భగవానుడు సూర్యుడే! ఉన్నది ఒక్కడే! కాని ఆయన ప్రతిబింబాలు అనేకం. అం దుకే సూర్యారాధన వివేకం. ప్రకృతిని సమతౌల్యం తో చూడడం జీ వుని విధి, కర్తవ్యం. లేదంటే సూర్యుని ఆగ్రహానికి గురికాక తప్పదు.
పావురం ఒక పక్షి. జీవుడు కూడా ఒక పక్షిలాంటి వాడే! ఆశల వలయంలో చిక్కి, వలలో చిక్కిన పావురంలా విలవిలలాడిపోతా డు. అత్యాశ, దురాశ గల పావురాలను అనుసరిస్తే చివరికి వలలో చిక్కి నరకాన్ని చూస్తారని పావురం బోధిస్తుంది. కొండచిలువ దీన్నే అజగరం అని కూడా అంటారు. సాధారణంగా ఇది తన భారీ దేహం వలన తన దగ్గరకు వచ్చిన ఆహారాన్ని మాత్రమే కబళిస్తుంది. ఉన్న దానితో తృప్తిపడు, ఏది నీదైతే అది మాత్రమే నీకు దక్కుతుంది. తుమ్మెద ఒక వైపు జ్ఞానమనే పుష్పం ఎక్కడుంటే అక్కడకు చేరుకోమని చెపుతూనే అసంతృప్తితో నువ్వు సాధించేది శూన్యం అని బోధిస్తుంది. తేనె కోసం అనేక పుష్పాలపై వ్రాలేకంటే జ్ఞానపు ష్పం కోసం అన్వేషించమంటుంది. తేనెటీగ శ్రమకు ప్రతిరూపం. శ్ర మించమని చెపుతూనే పరుల కోసం, ధర్మం కోసం సంపదను విని యోగించమని హెచ్చరిస్తోంది. లేకపోతే తేనెపట్టును ఏ ఎలుగుబం టో లేక వేటగాడో దోచుకుపోయినట్లు సంపద నిరుపయోగమవు తుంది. ఇక తేనె సేకరించేవాడు పరుల సొత్తు హరించే వాడుగా భా వించాలి. పాప పరిహారార్థం జ్ఞానమనే తేనెపట్టును ఆశ్రయించాలి.
లౌకిక జీవనం కోసం ధర్మబద్ధంగా సంపదను ప్రోగు చేయాలి. లేకపోతే గద్ద అనే పక్షినీ అక్రమ సంపదను ఎరగా భావించి తన్నుకు పోతుంది. శ్రీరాముడు సముద్రమంత గంభీరుడు. నదులన్నీ తన లోకి వచ్చి చేరుతున్నాయనే గర్వం లేకుండా తనలో అపారమైన సంపదలను నిక్షిప్తం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది. నీలో నున్న జ్ఞానాన్ని పంచిపెట్టి, ప్రశాంత వాతావరణాన్ని కలిగించు అని సముద్రం బోధిస్తుంది. ప్రాపంచిక సుఖాలనే మంటలను చూసి జ్ఞానజ్యోతి అనుకుం టే మంటలో పడి శలభంలా నశిస్తావని దీపపు పురుగు బోధిస్తుంది. కాంతి కనకాలు అశాశ్వతం. అతిగా ఆశిస్తే ఉచ్చులో పడిపోతావని, ఎరగా చూపిన ఆడ ఏనుగు వెనకాల వెళ్ళిన మగ ఏనుగు బోధిస్తుంది.
సప్త వర్ణమయమైన ప్రకృతి ప్రలోభాల మయం. శ్రావ్యమైన సంగీతం విని వేటగాడి బాణానికి గురైన జింక కోరికలనే ప్రలోభా లు ముక్తి, మోక్షాలకు ఆటంకం అని బోధిస్తుంది. ఎల్లప్పుడు ఒకే చోట జీవిస్తూ, రుచి అనే ఎరకు గురవుతూ వేటగాని చేతిలో చిక్కే చేప జ్ఞానేంద్రియాల్లో నోటిని, నాలుకను అదుపు చేసుకోమని, మం చి మాటలుమాట్లాడి వాక్కును ఆభరణంగా చేసుకొనమని చెపు తుంది. విటుని కోసం ఎదురు చూసే వేశ్య, వేశ్యాలంపటంలో పడిన జీవుడు ఎన్నటికీ ఆ ఊబిలోంచి బయటకు రారని తెలియచేస్తారు. అందుకే వేశ్య కూడా గురువుగా భావించబడింది. మూడు సంవత్స రాల లోపు బాలలు భగవంతునితో సమానం. వారి చిరునవ్వులో ఆనందాన్ని చూడలేనివాడు సాత్త్వికుడు కాడు. కావున బాలల మన స్సులా నిష్కల్మషంగాఉండాలి. అందుకే బాలలు మనకి గురువులు.
తల్లితండ్రుల చాటు కన్య మనసు కాబోయే వరుణ్ణి చూసేంత వరకూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాని తరువాత మధురమై న అలజడికి లోనవుతుంది. కాబట్టి కన్య మనసులా కాకుండా ఆధ్యా త్మిక సాధకుడు గంభీరమైన ఏకాంతాన్ని కోరుకోవాలి. పాము సా ధారణంగా ఒంటరిగా జీవిస్తుంది. జాతి సర్పమైతే మానవుని కంట బడదు. తన పాత చర్మాన్ని కుబుస రూపంలో నిర్ణీత సమయాల్లో విసర్జిస్తుంది. అలాగే జ్ఞాని మౌనంగా ఒంటరిగా ఉంటాడు.
ఆయుధాలు తయారుచేసేవాడు ఎంత నైపుణ్యం, ఏకాగ్రత కలిగి ఉంటాడో, అలాగే ఆత్మాన్వేషకుడు కూడా అంతే శ్రద్ధ, భక్తితో సాధన చేయాలి. సాలెపురుగు తన గూడు తానే నిర్మించుకొని బందీ అవుతుంది. కానీ తన గూటి దారాన్ని తానే తిరిగి లోపలికి లాగుకు ని విముక్తి పొందగలదు. అలాగే జ్ఞానంతో ముక్తికి దగ్గర అవ్వాలి. గొంగలి పురుగు ఎంత జుగుప్సగా కనబడినా అది తన జీవ సమాధి లోకి పోయి తిరిగి అందమైన సీతాకోకచిలుకలా మారుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు అంత్యకాలంలో భగవానుని స్మరించినవాడు ఆయననే చేరతాడు. ఈవిధంగా అవధూత శ్రీ దత్తాత్రేయులు ప్రకృతినే గురువుగా భావించమని, జ్ఞానయోగంతో నిత్యానందం పొంది ఆ పరంధామం చేరమని బోధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement