Friday, November 22, 2024

వెనుకబడిన వర్గాల వారికి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల, ప్రభ న్యూస్‌: జనవరి 13 నుంచి 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్య కార గ్రామాల పేదలకు ఉచి తంగా చేయించాలని బోర్డు నిర్ణ యం తీసుకుందని టీటీడీ ధర్మక ర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లాలోని కనిగిరి, దర్శి ప్రాంతాల్లో నిర్మించనున్న టీటీడీ కల్యాణమండపాలకు శం కు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఛైర్మన్‌ మాట్లాడారు. టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజుకు వెయ్యి మందికి చొప్పున ఎస్సీ, ఎస్టి, బిసి, మత్స్య కార గ్రామాల పేదలకు ఉచితంగా స్వామివారి దర్శనం చేయించామని చైర్మన్‌ వివరించారు. అదే విధంగా వైకుంఠ ద్వార దర్శనం కూడా చేయించనున్నామన్నారు. దర్శిలో ఎకరన్నర భూమిలో కోటిన్నర రూపాయల ఖర్చుతో నిర్మించే ఈ కళ్యాణ మండపంలో 630 మంది అతిథులతో పెళ్ళి చేసుకోవడానికి అనుగుణంగా పెళ్ళి మండపం, డైనింగ్‌ హాల్‌, వధూవరుల వసతి గదులు ఇతర సదుపా యాలన్నీ ఉంటాయన్నారు. కనిగిరిలో ఎకరం భూమిలో 2 కోట్ల రూపాయలతో కల్యాణ మండపం నిర్మిస్తామని, ఇక్కడ 630 మంది అతిథులతో పెళ్ళి చేసుకోవడానికి అనుగుణంగా పెళ్ళి మండపం, డైనింగ్‌ హాల్‌, వధూవ రుల వసతి గదులు ఉంటాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టి,బిసి, మత్స్య కార గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు.
ఒకే గొడుకు కిందకు గోశాలలు
గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రతి ముఖ్య ఆలయంలో భక్తులు గోపూజ చేసుకునే ఏర్పాట్లు- చేస్తున్నట్లు- ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 100 ఆలయాలకు గోవు, దూడలు ఉచితంగా అందించా మనీ, రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని గో శాలలను ఒక గొడుగు కిందకు తెచ్చి వాటికి అవసరమైన సహాయం అందించే ప్రణాళికలు తయారు అవుతున్నాయన్నారు. ఇందుకోసం కార్పొరేట్‌ సంస్థలతో త్వరలో సమావేశం ఏర్పాటు- చేయనున్నామని ప్రకటించారు. భగవంతుడిని భక్తుల చెంతకు తెచ్చే విధంగా పెద్ద ఎత్తున శ్రీవారి కల్యాణాలు నిర్వహించనున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement