Thursday, September 19, 2024

ఉపాసన, ఉపవాసాలకు ఉద్దిష్టం దక్షిణాయనం


ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. ‘అయనం’ అంటే ప్రయాణం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. కానీ సూర్యోదయా న్ని గమనిస్తే, అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరి గ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజు లు మాత్రమే. అవి మార్చి 21, సెప్టెంబరు 23. మిగతా ఆరు నెలలు ఈశాన్యానికి దగ్గరగా, మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశా న్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతల కు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. అం దుకే ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించ డానికి ప్రత్యేక ఉపవాసాలు, పూజలు చేస్తారు. అందుకే దక్షి ణాయనం ఉపవాస కాలం అంటారు. ఈ సమయంలోనే యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్ష చేపడతారు. ఆ షాడ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తా డు మహావిష్ణు వు.
శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగ నిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరో ధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపసాన, తరుచు గా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియ మాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప, దాన, పూజలు ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి. ఈ
సమయంలో దానాలు కూడా విశే ష ఫలాలనిస్తాయి. అందుకే మోక్షానికి ఉత్తరాయ ణం, ఇహానికి దక్షి ణాయనం ప్ర తీకలుగా భావిస్తా రు.

Advertisement

తాజా వార్తలు

Advertisement