Saturday, November 23, 2024

దైవ నిర్ణయం

”కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాముకి కోపం.” ఇలాంటి స్థితిలో ఏం చేయాలో తెలీదు. ఏం చేయకూడదో కూడా తెలీదు. అలా అని ఏమీ చేయకుండా కూడా ఉండలేం. ఊరుకోలేం. ఇలా చేస్తే అలా సమస్య అవుతుంది. అలా చేసిన్లటతే ఇలా సమస్య అయిపోతుంది. దీనినే విషమ స్థితి, విషమ పరిస్థితి అంటారు.

ఈవిషమ పరిస్థితులు చాలా చిత్రంగా, విచిత్రంగా ఉంటాయి. చూసేందుకు చాలా సరళంగా, సహజంగా అనిపించినా కొంచెం ఆలోచిస్తే చాలా జటిలం అనిపిస్తాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటాం కదా! ఇంచుమించు అలాంటి స్థితే యిది. ఇద్దరు ఉంటారు. రెండు రకాలుగా చెబుతారు. రెండు విధాలుగా అడుగుతారు. వీడు చెప్పినట్టు చేస్తే రెండో వాడికి కోపం వస్తుంది. రెండోవాడు కోరినట్లు ఒప్పుకుంటే మొదటివాడు ఒప్పుకోడు. సమస్య ముదిరి పాకాన పడు తుంది. సామరస్యం కుదరదు. సమన్వయం ఏ మాత్రం లభించదు. సమ తుల్యత సాధ్యపడదు. పరిష్కారం దొరకదు. సమంజసమైన విశ్లేషణాత్మక సమాధానం కనిపించదు.

ఇలాంటి విషమ పరిస్థితి దాపురించినప్పుడు మనం విచక్షణ, విజ్ఞత ప్రదర్శించాలి. పూర్వాపరాలు అన్నీ బాగా పరిశీలించి ఏది సబబు అనిపిస్తే అది చేయాలి. ఎవరు చెప్పింది సహేతుకంగా సమ్మతం అనిపిస్తే, వారు చెప్పింది చేయాలి. ఒక్కొక్కప్పుడు యిద్దరిదీ సబబే అనిపిస్తుంది. సహేతు కంగానే కనిపిస్తుంది. ఎవరి కోణంలో వాళ్ళదే ఒప్పు అవుతుంది. అలాంట ప్పుడు మనం మన జ్ఞానాన్ని, మన అనుభవాన్ని, మన విచక్షణను, విజ్ఞత ను ఉపయోగించి ఆలోచన చేయాలి. ఆ రకంగా అన్ని కోణాల్లో తులనం చేసి తర్వాత నిర్ణయం చేయాలి. ఆ నిర్ణయానికి ఆ రెండో మనిషి లేదా రెండో వర్గం మనని నిందించవచ్చు. నిలబెట్టి అడగవచ్చు. అయిష్టతతో అనరాని అనకూడని మాటలు అనవచ్చు. మన అస్తిత్వాన్నే ప్రశ్నించవచ్చు కూడా. ఇటువంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నో తారసపడుతుం టాయి. మనుషులకే కాదు. ఇలాంటి సందర్భాలు, ఘటనలు, సంఘటన లు దేవుడికి కూడా ఎదురవుతాయి. దేవుడు కూడా ఆ విషమ స్థితిని, విష మంగా ఉండే పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. సోదాహరణంగా కొంచెం విచారణ చేద్దాం. రెండు దేశాల మధ్య ఓ క్రీడ ముగింపు ఆట (ఫైనల్స్‌) పోటీ జరుగుతోంది అనుకుందాం. రెండు దేశాల జట్లు ఆట గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడతాయి. అహారహం తమ శక్తియుక్తుల్ని ఆటలో ప్రదర్శిస్తాయి. అతి జాగరూకతతో క్రీడా సమరానికి సిద్ధమవుతాయి. రెం డు దేశాలలోని క్రీడా అభిమానులు, ఆయా దేశాల పౌరులు తమ దేశం జట్టే విజేతగా నిలువాలని అనుకుంటారు. ఆశిస్తారు. వారి ఇష్టదైవాలను వేడుకుంటారు. గెలిపించాలని ప్రతి నిముషం ప్రార్ధనలు చేస్తారు. అయితే గెలుపనేది ఒక జట్టుకే వరిస్తుంది. అప్పుడు ఓడిపోయిన జట్టు కోసం చేసిన వారి ప్రార్థనలు ఏమయ్యాయి? వారు ప్రార్థన చేసిన దేవుళ్ళ శక్తి యుక్తులు ఏమయ్యేయి? వారి దేవుళ్ళు వారి ప్రార్ధనల్ని పట్టించుకోలేదని అనుకోరా? అలాంటి విషమ పరిస్థితిలో దేవుడు ఏం చేయాలి? ఏం చేస్తాడు? ఏది చేసినా రెండో జట్టు తరపున ప్రార్ధన చేసిన వారి చేత మాట పడవలసిందే. దేవుడు నిర్ధయుడు, కఠినాత్ముడు అని ఓడిపోయిన జట్టు కోసం ఏ దేవుళ్ళ కు ప్రార్థనలు చేసారో, ఆ దేవుళ్ళందరూ భక్తుల ఆగ్రహానికి గురికావాల్సిం దే. ఆ భక్తులు ఆక్రోశంతో చేసే నిందలు పడాల్సిందే. దీనినే ధర్మ సంకటం (ఎథికల్‌ డైలమా), కర్మ సంకటం(ఎక్ట్‌ డైలామా), ప్రవర్తనా సంకటం (బిహవియర్‌ డైలామా) అంటారు.
పూర్వకాలంలో ఒకానొక సమయంలో యిద్దరు మహాభక్తులు ఉండే వారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. బాగా వయసు మళ్ళినవారు. వాళ్ళిద్ద రూ తన ఆరాధ్య దైవాన్నే సర్వస్వం అనుకునే వాళ్ళు. తమ ఆరాధ్య దేవునికే తమ జీవితాలను అంకితం చేసుకున్న అసలు సిసలైన భక్తులు. పైగా వారిది అన్యోన్య దాంపత్యం కూడా. సమాజంలో ఆదర్శవంతంగా బ్రతికినవా ళ్ళు. బ్రతుకుతున్నవాళ్ళు.
ఇలాంటి పరిస్థితుల్లోనే పైన చెప్పుకున్నటువంటి ఓ విషమ పరిస్థితి దేవునికి వచ్చిపడింది. ముదుసలి అయిన భర్త ప్రతిరోజూ భగవంతుడ్ని ”దేవుడా తండ్రీ ఈ బాధ/అవస్థ నేనింక పడలేను. మంచానికి అతుక్కో పోయి ఈ శారీరక బాధల్ని భరించలేను. ఈ యీతి బాధల్ని భరించే శక్తీ, ఓపిక నాకు యిక లేవు. వెంటనే నన్ను నీ వద్దకు తీసుకుపోయి ఈ బాధ ల్నుంచి నన్ను విముక్తుణ్ణి చెయ్యి. నన్ను కనికరించి నన్ను శాశ్వతంగా బాధ ల నుండి విముక్తుణ్ణి చెయ్యి.” అని అనుక్షణం దేవుడ్ని ప్రార్ధిస్తున్నాడు. కన్నీ ళ్ళతో వేడుకుంటున్నాడు.
ఇక ముదుసలి భార్య సంగతి. ఆవిడ కూడా భగవంతుణ్ణి ఆమె కోణంలో వేడుకుంటోంది. ”భగవంతుడా తండ్రీ! నిన్నే సర్వం అని నమ్ము కున్న దాన్ని. ఇంత వరకు నిన్నేమీ కోరుకోలేదు. కానీ యీ రోజు కోరుకోవ టం తప్పటం లేదు. పిలిచిన పలికే దేవుడవని నిన్ను నమ్మిన దాన్ని. కరు ణించి నా పసుపు కుంకుమల్ని కాపాడు తండ్రీ.” అని ప్రతి క్షణం దేవుడ్ని ప్రార్ధిస్తోంది. అప్పుడప్పుడు తలని నేలకేసి కొట్టుకుంటూ దేవునికి మొర పెట్టుకుంటోంది.
ఎవరి ప్రార్ధన వారిది. ఎవరి కోరిక వారిదే. ఎవరికి అనుకూలమైన కోర్కెను వారు కోరుకుంటున్నారు. అది తప్పు అని మనం అనగలమా? సమంజసం కాదని మనం చెప్పగలమా? ఎవరికి వారిదే ఒప్పు. భర్త అవస్థ దృష్ట్యా చూస్తే ఆయనది సమంజసమే అనిపిస్తుంది. భార్య కోణంలో ఆలోచిస్తే, ఆమెదీ న్యాయమే అనిపిస్తుంది. అప్పుడు దేవుని పరిస్థితి ఏమి టి? ఆయన ఎవరి కోరిక తీర్చాలి? ఎవరిని అనుగ్రహించాలి?
నిజానికి దేవుడు యిద్దరి ప్రార్ధనలూ మన్నించటం ప్రకృతి ధర్మానికి విరుద్ధం. ఇద్దరి కోరికలు తీర్చటం సృష్టి ధర్మానికి వ్యతిరేకం. జనన మరణ కాలచక్ర భ్రమణానికి, తనకి తనే (ఆ దైవమే) నిర్దేశించుకున్న విధి విధా నానికి ప్రతి బంధకం. అప్పుడు దేవుడు ఏం చేయాలి? ఏం చేస్తాడు? కారణ కారకాలను, ప్రాప్తా ప్రాప్తాలను, పాప పుణ్యాలను, కర్మహితువులను, కర్మ ల జన్మల రహస్యాలను, జనన మరణ నిర్దేశక నియమాలను అన్నింటినీ పరిశీలిస్తాడు. హేతుబద్ధంగా పరిశీలన చేస్తాడు. అన్ని అంశాలను పరిశీలన చేసుకుని, అన్ని అంశాలను సమన్వయం చేసుకుని సరైన నిర్ణయాన్ని దైవం తీసుకుంటాడు. దైవం తీసుకున్న నిర్ణయం ఎవరికి అనుకూలమైనా, ప్రతికూలమైనా, కష్టమైనా, నష్టమైనా… వెరసి ఎవరికి ఏదైనా ఏమైనా భగ వంతుడు తన నిర్ణయం తాను తీసుకోవడం భగవంతుని సహజ లక్షణం.
కాబట్టి భగవంతుని నిర్ణయాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి. అతని ఆజ్ఞని ఆనందంతో మనస్పూర్తిగా అనుభవించ గలగాలి. భగవంతుని నిర్ణయం ఎంతటి క్లిష్టమైనదైనా, కష్టమైనదైనా, బాధించేదైనా, బాధ పెట్టేదైనా భగవంతుని నిర్ణయాన్ని మనసా వాచా కర్మణా మనం ఆమోదించి ఆనందపడాలి.
ఆ కరుణాంతరంగుని అనుగ్రహానికి పాత్రులం కావాలి.
అందుకోసం మనం మన సాధన కొనసాగిస్తూనే ఉండాలి.

  • రమాప్రసాద్‌ ఆదిభట్ల
    93480 06669
Advertisement

తాజా వార్తలు

Advertisement