Friday, November 22, 2024

తిరుమలలో భక్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 48 గంటల సమయం

తిరుమల : వరుస సెలవుల కారణంగా తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శ నానికి 38 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీవారి సేవాసదన్‌, రాంభగీచ వరకు భక్తులు క్యూలైన్లలో నిలబడ్డారు. వీరికి 36 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. భక్తుల రాక పెరుగుతున్న దృష్ట్యా దర్శనం 48 గంటలు పట్టవచ్చని తెలిపారు. నిన్న 83,452 మంది భక్తులు దర్శించుకోగా 50వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లు వచ్చిందని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 21 వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. వీఐపీ బ్రేక్‌ , పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement