కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామి సర్వదర్శనం కోసం 36 గంటల సమయం పట్టనుంది. సోమవారం శ్రీవారిని 62,152 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 30,682 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.