కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం కోసం 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. వీరికి స్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం తిరుమల శ్రీవారిని 69,587 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.35 వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 28,645 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement