కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టీబీసీ వరకూ భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 86,188 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.5 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారిని 41,032 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.