తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టు మెంట్లలో భక్తులు వేచియుండగా వీరికి దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 72,804 మంది భక్తులు దర్శించుకోగా 39,142 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.82 కోట్లు వచ్చాయని వెల్లడించారు. అక్టోబర్ నెలకు చెందిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 24న బుధవారం ఉదయం 10 గంట లకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నది. అలాగే మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియను అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిం చనున్నట్లు పేర్కొంది.