తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 79,836 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.56 కోట్లు వచ్చిందని, 35,916 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా సోమవారం ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.