Saturday, November 23, 2024

త్రిమూర్తుల అఖండ విన్యాసమే సృష్టి!

సృష్టి స్థితి లయ కారకులు విడదీయలేని బంధం కలవారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లు నిరాకార నిర్గుణ స్వరూపం కలవారు. అయితే భావనా శక్తిని పొందిన మానవు డు వారికి ఒక రూపాన్ని కలిగించి ఆరాధిస్తున్నాడు. త్రిగుణాతీతులైన త్రిమూర్తులు సృష్టి అనే ప్రహేళికలో జీవులను పాత్రధారులుగా చేసి ఒక అనంత లీలను ఆహ్లాదంగా ఆస్వా దిస్తున్నారు. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మాత్రం అవకాశం కల్పించి, ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందుతారో వారు పరంధామం చేరగలిగే దివ్య మార్గాన్ని కూడా బోధించారు. పరంధా మం యొక్క పరమాత్మ తత్త్వమే ఏకత్వ భావమైన ”ఆత్మ”. అది యే క్షరము కాని అక్షర స్థితి. సృష్టి , స్థితి ఎంత ముఖ్యమో లయ కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకొంది. లయ కార కుని విన్యాసం అనుక్షణం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఒకవిధంగా జీవి పుట్టుక, మరణం అటువంటిదే! ఈ రెండూ లేని క్షణం ఉండదు. అదే త్రిమూర్తుల అఖండ విన్యాసం. మానవుని మేధకు అందని మహాన్యాసం. దీనిలో జీవుని ప్రయాణం కూడా ఒక క్షణ భంగు రం. ఈ సృష్టి కార్యమంతా ఒక ప్రణాళిక. ఆద్యంతములు లేనిది.
నమోరుద్రాయ హరయే బ్రహ్మణ పరమాత్మనే
ప్రధాన పురుషేశాయ సర్గస్థిత్యంత కారిణ
లయకారుడైన రుద్రుడిగా స్మరించినంతనే పాపాల్ని పరిహరించే విష్ణువుగా, అణువు నుండి బ్రహ్మాండాన్ని సృజించే చతుర్ముఖ బ్రహ్మగా ఉన్న ప్రధాన పురుషుణ్ణి, సృష్టి, స్థితి లయాలు చేసే త్రిమూర్తులకు మూలపురుషుడైన ”పరమాత్మ”కు నమస్సులు.
లయకారుడైన శివుని నిరాకార స్వరూపమే లింగము. ఈ అనంత విశ్వాకారము కూడా లింగ రూపముగా భావించారు. శివ నివాసమైన కైలాసము కూడా లింగ రూపమే!
శివలింగ పీఠము బ్రహ్మగా, పానవట్టం విష్ణువుగా, లింగము శివరూపమైన రుద్రునిగా భావించి అభిషేకిస్తారు.
ప్రణవమైన ‘ఓం’కారము మహేశ్వరుడు. శివమూర్తిని పూజించడం కన్న లింగమునే అభిషేకించుట శ్రేష్ఠముగా సనాతనము సూచించింది. లింగ స్వరూపానికి ఆధారం ప్రకృతి. త్రిగుణాత్మకమైన ప్రకృతిని ఒక ”శక్తి” రూపంగా భావించారు.
”ఆకాశం లింగమిత్యాహు: పృథివీ తస్య పీఠం” అనంత విశ్వం లింగరూపము. పద్నా లగు లోకాలతో కూడిన ఈ ప్రపంచమంతా లింగ స్వరూపము. మహాతత్త్వాలు సమిష్టిగా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మూడు అంశలుగా సృష్టి, స్థితి, లయలు చేస్తున్నా యి. వీరి శక్తి స్వరూప అంశయే శివుడని, శక్తి సంహితుడైన అర్థనారీసహిత ఈశ్వరుడని సనాత న వాఙ్మయం తెలియచేస్తోంది. శివసంకల్పం బీజం అయితే, విష్ణువు జగద్యోని. శివసంకల్ప మనే బీజము నుండి జగద్యోని విష్ణువు నందు బ్రహ్మ నాభికమలం నుండి ఉద్భవించాడు. శివప్రేరణతో శక్తి జనించగా త్రిగుణాత్మకమైన జగత్తులు జనించాయి. ఆ జగత్తులలో పృథివి పై మానవలోకం ఒకటి సృష్టించబడింది. త్రివర్ణ సహితమైన శివశక్తి ఈ జగత్తులు నిత్యమని భ్రమింప చేస్తున్నాయి. జనన మరణ చక్రంలో త్రిప్పుతుంటాయి. త్రిగుణాత్మకమైన ఈ జగ త్తులో వివిధ యోనుల్లో జనింపచేసి జీవుణ్ణి ఒక ఆటబొమ్మను చేసి క్రీడిస్తున్నారు త్రిమూర్తు లు. ఎవరైతే జ్ఞానాన్ని భిక్షగా పరమాత్మ నుండి గ్రహిస్తారో వారు చివరికి లయకారుడైన శివు ణ్ణి ఆశ్రయించి కళ్యాణ వైరాగ్యంతో ఆనంద స్వరూపుడై పరంధామాన్ని చేరుతున్నారు. వారి కిక జన్మ లేకుండా నాటక రంగంలో పాత్రకు శాశ్వత ముగింపు పలుకుతున్నాడు పరమేశ్వరు డు. ఈ మహా జగన్నాటకానికి కూడా ఒక మహా సంకల్ప ప్రణాళిక ఉంది. ప్రకృతిని సూక్ష్మ పంచభూతాలు చేరుకోగా మహాతత్త్వ మొదట జనించింది. ఆ మహాతత్త్వం నుండి అహం కారం, దాని నుండి ప్రణవం, ఆ ప్రణవ శబ్దం నుండి ఆకాశం, దాని నుండి స్పర్శ, దాని నుండి వాయువు, దాని నుండి రూపం, తేజస్సు, రసం, జలం, గంధం, పృథివి వరుసగా ఒకదాని నుండి ఒకటి ఆవిర్భవించేలా ప్రణాళిక ఉంది.
ఇక జీవునిపై వాటిని గ్రహించి అనుభవించి ఆడుకునేందుకు, శబ్దములను గుర్తించడాని కి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు మరియు అతి ముఖ్యపదార్థం మనసును సృష్టించారు. ఈ మనసు సంకల్ప, వికల్పాలను క్షణకాలంలో చేయగల అత్యంత శక్తిని సం తరించుకొంది.
ఈ బ్రహ్మాండంలో మొత్తం పధ్నాలుగు లోకాలున్నాయి. వాటి మధ్య భూలోకం ఒకటి. దీనిపై పదివంతులు జలం, దానికి పదిరెట్లు తేజస్సు, తేజస్సును పది వంతులు వాయువు ఆవరించి ఉంది. ఆ వాయువును పదిరెట్లు ఆకాశం ఆవరించి ఉంది. ఆకాశం అహంకారమై తే, ప్రకృతి అహంకారాన్ని ఆశ్రయించింది.
ఆదికర్తా చ భూతానాం సంహర్తా పరపాలక:
తస్మాన్మహేశ్వరో దేవో బ్రహ్మణోధిపతి శివ: సకల ప్రాణుల్నీ పుట్టించే ఆదికర్త, రక్షకు డు, సంహారకర్త అయిన శివుడు త్రిమూర్తులకు అధిపతి. శివుడే జగత్కర్త కోట్ల కొలదీ బ్రహ్మాం డాలు ఈ అనంత విశ్వంలో సృష్టించబడగా ప్రతి బ్రహ్మాండంలో ఉన్న త్రిమూర్తి ప్రణాళిక యే ఈ బ్రహ్మ, విష్ణు, రుద్రులు, సృష్టి స్థితి లయ కర్తలు. అనుక్షణం ఈ బ్రహ్మాండ బ్రహ్మాండం లో ప్రణవాలు శబ్దం చేస్తూనే ఉంటాయి. సృష్టి జరుగుతూనే ఉంటుంది. దాని వెనుక లయం అవుతూనే ఉంటుంది. జీవులు సృష్టించబడుతూనే ఉంటాయి. జగన్నాటకం కొనసాగుతూ నే ఉంటుంది. వీటన్నింటికీ అతీతంగా పరమాత్మను చేరుకునే ”జ్ఞాన మార్గం” ఒకటి ఉందని గ్రహించడమే పరంధాముడి చ్చిన వరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement