Tuesday, November 26, 2024

ముగిసిన మేడారం హుండీల లెక్కింపు


రూ.11కోట్ల 44 లక్షల ఆదాయం
వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: తెలంగాణ కుంభమేళా మేడారం వన దేవతల హుండీల ద్వారా రూ. 11కోట్ల 45 లక్షల ఆదాయం వచ్చింది. హుండీల లెక్కింపు సోమవారంతో ముగిసింది. గత నెల 16నుండి 19 తేది వరకు ములుగు జిల్లాలోని మేడారంలో నాలుగు రోజుల పాటు- జరిగి న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా దేవాదాయ శాఖ గద్దెలమీద ప్రాంగణంలో 497 హుండీలను ఏర్పాటు- చేసింది. వీటిలో 450 ఐరన్‌ 44 క్లాత్‌ మరో మూడు బియ్యం హుండీలను ఏర్పాటు- చేసింది. జాతర ముగి సిన వెంటనే హుండీలను హన్మకొండ లోని టీ-టీ-డీ కళ్యాణ మండపానికి తరలించారు. జాతర ముగిసిన తరువాత తిరుగు వారం పురస్కరించు కొని మరో 20 హుండీలను ఏర్పాటు- చేసింది. మొత్తం 517 హుండీలను పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా, అధికారుల పర్యవేక్షణ మధ్య గత పది రోజుల పాటు- వేయిమంది సిబ్బంది లెక్కింపు చేశారు. సోమవా రం సాయంత్రంతో లెక్కింపు పూర్తయింది. ఈసారి హుండీల ద్వారా రూ.. 11కోట్ల, 44లక్షల, 12వేల.707 రూపాయల ఆదాయం వచ్చింది. గత జాతరతో పోలిస్తే 1కోటి57 లక్షల ఆదాయం పెరిగింది. 2020జాతరలో రూ, 9కోట్ల, 87 లక్షల, 24,663 ఆదాయం వచ్చింది. కాగా ఈ జాతరలో 631 గ్రాముల బంగారం, 48కిలోల350 గ్రాముల కానుకలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement