Thursday, November 21, 2024

రామసేతు నిర్మాణం…వారధి దాటిన రామసేన

కేవలం ఐదురోజులలో రామసేన సముద్రంపై రామసేతు నిర్మాణం చేసింది. నూరు యోజనాల దూరంలో ఉన్న లంకకు చేరాలంటే సముద్రం దాటటానికి రాముని సైన్యానికి వార ధి నిర్మాణం చేపట్టాల్సివచ్చింది. కోట్లాది వానరవీరులతో దక్షిణ దిక్కు ఉన్న సముద్రతీరానికి రామసేన చేరింది. మొదట రాముడు సముద్రానికి అభివందనం చేసి తమ సైన్యానికి దారి ఇమ్మ ని ప్రార్థించాడు. ఎంతసేపటికి సముద్రుడు కరుణించలేదు. చివరకు రాముడు క్రోధంతో ”లక్ష్మ ణా నా కోదండాన్ని అందుకో, నా బాణాలతో సముద్రుడిని జలర#హతం చేస్తాన”ని పలికాడు. ”నా ఓర్పును చేతకానితనంగా భావించే వాడిని వదలరాదు.” అంటూ శరపరంపర సంధించి వదిలాడు. రాముని బాణానికి నీటిలోని సొరచేపలు, తిమింగలాల వంటి పెద్ద జలచరాలన్నీ ముక్కలుగా అయి నీటిపై తేలుతున్నాయి. సముద్రంలో నీరు సలసల కాగుతున్నది.
లక్ష్మణుడు రాముని క్రోధాగ్నిని తగ్గించుకోవాలని సముద్రుడు తప్పక దిగి వస్తాడని, మీ లాంటి వారికి ఆగ్ర#హం తగదన్నాడు.
”లక్ష్మణా! రాక్షసుల ఆవాసమైన ఈ సముద్రం పూర్తిగా ఇంకిపోవాలి. అప్పుడే మన సైన్యం సులువుగా దాటగలద”ని ఆకర్ణాంతం నారిలాగి వదిలాడు. రాముడి ధనుష్టంకారానికి సమస్త లోకాలు దద్ధరిల్లాయి. అప్పటికి సముద్రుడు కళ్లు తెరిచి ఒక యోజనం వెనక్కు జరిగాడు. వెంట నే శరణు, శరణు అంటూ రామునికి పాదాభివందనం చేసాడు. అఘాధత్వాలు, జడత్వము నా లక్షణం. నేను మీకు దారి చూపి స#హకరిస్తానన్నాడు. రాముడు నేను ఎక్కుపెట్టిన బాణం దించ ను, దానిని ఎవరిమీద ప్రయోగించాలో చెప్పమన్నాడు. అందుకు సముద్రుడు తన శత్రువులైన ద్రుమకుల్య తీర్థంలోని దస్యులపై బాణం వేయమన్నాడు. అంతట రామ బాణం దస్యుల్ని నాశ నం చేసి భూమిలో పెద్ద రంధ్రం చేసింది. దాని నుంచి జలం బయటకు వచ్చి మరో సంద్రంగా మారింది. ”అంత రామా! నలుడు విశ్వకర్మ కుమారుడు. అతను తండ్రి అంతటివాడు. సేతు ని ర్మాణం అతను చేయగలడ”న్నాడు సముద్రుడు. నలుడు మీరు ఆజ్ఞాపిస్తే ప్రారంభిస్తానన్నాడు.
రాముని ఆదేశంతో వానరులు ఆకాశం అంత ఎత్తున భారీచెట్లు, గిరి శిఖరాలు, బండరాళ్లు తెచ్చి సముద్రంలో వేయసాగారు. అవి వస్తుంటే సముద్రజలాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా యి. జల చరాలు దూరంగా పారిపోతున్నాయి. మొదటిరోజు 14 యోజనాల సేతువు పూర్తి అయింది. కొంతమంది వానర వీరులు ఎత్తుపల్లాలు, రెండువైపులా సమంగా ఉండేలా సరి చేస్తున్నారు. రెండోరోజు ఇరువది, మూడోసారి ఇరువది ఒకటి, నాలుగోనాడు ఇరువది రెండు, ఐదోనాడు ఇరువది మూడు యోజనాలతో రామ సేతు నిర్మాణం పూర్తిచేసారు. వంద యోజనా ల వారధి 10 యోజనాల వెడల్పుతో సముద్రంలో శోభిస్తున్నది. సేతువు పూర్తకాగానే విభీషణు డు ముందుండి వానర సేనను వారధి దాటించాడు. వానరసైన్యం సముద్రం దాటగానే రావణు ని కోటకు సముద్రానికి మధ్య మరో సముద్రంలా భ్రమింపజేస్తున్నది. రాముడు లంక గడ్డ మీద అడుగుపెట్టగానే సీత గుర్తుకు వచ్చి ఆమె ఇక్కడ పడుతున్న బాధలకు నిట్టూర్పు వదిలాడు. లంక నగర వైభవాన్ని చూసి నిర్మాత విశ్వకర్మను కొనియాడాడు. వానర సైన్యం లంక గడ్డపైకి చేరుకో వడంతో మహోత్సా#హంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు రాక్షసులతో యుద్ధం చేద్దామా అన్న ఉత్సుకతతో కూడిన ఆనందంతో జై శ్రీరాం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసారు. అవి లంక నగరంలో ప్రతిధ్వనించి రాక్షసుల గుండెల్లో వణుకు పుట్టించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement