Saturday, November 23, 2024

వేపల్లె కుండల్లో చల్ల చిలకడమూ-క్షీరసాగర మథనమూ

కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్‌ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్‌ ప్పెణ్ణ
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్‌ త్తు
వాశ నఱుం కుళల్‌ అయిచ్చ యర్‌ మత్తినాల్‌
ఓ శై పడుత్త తయిర్‌ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్‌ పిళ్ళాయ్‌! నారాయణన్‌ మూర్‌త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్‌! తిఱవేలోర్‌ ఎమ్బావాయ్‌
మాడభూషి తెలుగు భావార్థ గీతిక

అదిగో వినలేదా కీచుకీచు పిట్టల కిలకిలారావములు
భారద్వాజ పక్షుల మధుర సంభాషణల నిక్వణాలు
కుండలలో చిక్కగా నిండిన మజ్జిగల చర్రు చర్రున
నిలువెత్తు కవ్వాల యవ్వనులు చిలుకు సవ్వడులు
ఊగెడు గోపికల కేశాల రాలిన పూలవాసనాలు తాకలేద
వగలు నగలు నగవులు కలిసి దీపించు వెల్గులు చేరలేద
పీతాంబరుని వేడక ఈ పిచ్చి నిదురేలనే పిచ్చిపిల్ల
మనము తెరచి మాధవుడినె తలచెదము తనివిదీర
బాపురే వ్యాఖ్యారేఖ- వ్రేపల్లెలో ఓ ఉదయం

బాపు తిరుప్పావై గీతార్థాలను వివరించే అద్భుతమై కళాఖండాలను సృష్టించారు. భాగవ తంలోని కథ దధిమధన శ్రీకృష్ణ లీలను గోదాదేవి అంతర్లీనంగా అల్లితే దాన్ని మన కళాకారుడు బాపు అద్భుత చిత్రంగా ఆవిష్కరించినారు. వ్రేపల్లె గోపికలు నిత్య భక్తులు. పెరుగు చిలుకుతూ, అమ్ముతూ కూడా శ్రీకృష్ణుని స్మరిస్తారు. మాట, చేత, మనసు ద్వారా చేసే వ్యాపారాలన్నీ కృష్ణుడికి అర్పిస్తున్నారు. మేం కృష్ణునికే చెందిన వారం, ఏం చేసినా ఆయన కోసమే అంటారు. నెత్తిన పాలు పెరుగు మోస్తూ పట్టణానికి వెళ్లి అక్కడ పాలు పెరుగూ అని అమ్మేందుకు గోవిందా దామోదరా మాధవా అని అరిచేదట. ప్రభాత సమయాన యశోద ఇంట చేతి కడియాల గలగలలతో తిరిగే కవ్వం, కన్నయ్య అల్లరి, సంతోషంగా పాలిచ్చే గోవు, నెత్తిన కుండలతో మాట్లాడే గోపికలు. ఈ మనో#హర దృశ్యంలో, వ్రేపల్లెలో ఒక ఉద యాన్ని బాపు మన ముందుంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement