Friday, November 8, 2024

చల్లని తల్లిశ్రీచెంగాలమ్మ పరమేశ్వరి!

గ్రామగ్రామాన వెలసి ఒక్కో పేరుతో పిలిపించుకుంటూ, సహస్ర నామధారిణి అయి ప్రజలను కన్నబిడ్డల వలే కాపాడుతుంది. అమ్మ ఎక్కడైనా అమ్మే! కానీ భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచుతాయి. జగన్మాత దేవాలయాల్లో కొన్ని భక్తులకు విపరీ తమైన విశ్వాసాన్ని కలిగించాయి. అలాంటి అపూర్వ అనుభూతిని కలి గించే ఆలయాల్లో చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి. నవ్యాంధ్రలో నెల్లూరు జిల్లాలో తమిళ నాడుకి సరిహద్దులో ఉన్న సూళ్లూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందు కొంటున్న ది శ్రీచెంగాలమ్మ. పదో శతాబ్ద కాలంలో ఈ గ్రామం పేరు ‘శుభగిరి”. ఒక గొల్లపల్లె. రోజూ మాదిరిగానే పశువులను మేతకు తోలుకెళ్ళారు. సాయం త్రం తిరిగి ఇళ్లకు చేరుకునేముం దు సమీపంలోని పవిత్ర కళంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకుని కొట్టుకుని పోతూ, ఒక శిలను పట్టుకుని, ఆ ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు. నీటి ఉధృతి తగ్గిన తర్వాత చూస్తే అష్ట భుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల క్రింద దానవుని దునుముతున్న దేవి విగ్రహం పశువుల కాపరి చూసి గ్రామ పెద్దలకు చెప్పాడు. గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకుని వచ్చి ఒక రావి వృక్షం క్రింద తూర్పు ముఖంగా ఉంచారు. మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖ ముగా నిటారుగా నిలబడి మహసాసురమర్దిని స్వయంభుగా వెలసి ఉండడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
అదేరోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో అమ్మ వారు కనబడి, తాను అక్కడే ఉండదలచానని చెప్ప డంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అసుర సంహారిణి అయినా అమ్మవారు శాంతిమూర్తిగా కొలువుతీరడం వల్ల ”తెన్‌ కాశీ” (దక్షిణ కాశి) అని పిలిచేవారు. ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సంద ర్భంగా కాలక్రమంలో అదే ”చెంగాలి”గా ”చెంగాలిపేట” గా పిలవబడి, చివరకి ఆంగ్లేయుల పాలనలో సూళ్ళూరుపేటగా మారిందంటారు. ఊరి పేరు వెనక మరో కారణం కూడా చెబుతారు. ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద ”సుడి మాను” తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది. అదే సూళ్ళూరుపేటగా రూపాంతరం చెందినదని అంటారు. సువిశాల ప్రాంగణంలో వుండే ఈ ఆలయంలో వున్న ఉప ఆల యాలలో గణపతి, లింగ రూప కైలాసనాధుడు, నాగ దేవత లు కొలువు తీరి భక్తులను కరుణిస్తారు. నూతనంగా నిర్మించబడి న ప్రధానాలయం ముఖ మండపంలో అత్యంత సుందరంగా మలిచిన నవ దుర్గా రూపా లను నిలిపారు. గర్భాలయంలో సర్వాలంకరణభూషితగా శ్రీ చెంగా లమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు. ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజ కులస్థులే పూజాదికాలు నిర్వర్తిస్తున్నారు.
రోజంతా భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాం టి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయం లోనికి ప్రవేశించి భంగపడ్డాడట. అప్పుడు ఆలయ నిర్వాహ‌కులు తలు పులు చేయించారట. కానీ అమ్మవారు స్వప్నంలో ”నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు” అని తెలపడంతో వాటిని ప్రాంగ ణంలో ఒ కచోట ఉంచారట.
ఎండిపోయిన కలప నుండి తయారు చేసిన ఆ తలుపుల నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఇది శ్రీ చెంగా లమ్మ మహత్యమా అన్నట్లుగా వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరిం చడం ఒక విశేషంగా పేర్కొనవచ్చును.
ఈ వృక్షం దగ్గర నాగ లింగం, నవగ్రహ మండపం ఉంటా యి. సంతానాన్ని కోరుకొనే దంపతులు ఈ పవిత్ర వృక్షా నికి గుడ్డతో ఊయలలు కడతారు. ప్రదక్షిణలు చేస్తారు.

పూజలు… ఉత్సవాలు
ప్రతి నిత్యం నియమంగా ఎన్నో రకాల పూజలు, అర్చనలు, సేవలు శ్రీచెంగాలమ్మ పరమేశ్వరికి జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవ కలశ అభిషే కం, మహా చండీయాగం ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్ధం నిర్వహిస్తున్నారు. వివాహము, ఉపనయనం, పిల్లలకు తొలి సారి చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోడానికి దేవాలయంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. విశాల మండ పము, వసతి గదులు అందుబాటులో ధర లతో దేవస్థానం ఏర్పాటు చేసింది. గణపతి నవ రాత్రులు, ఉగాది, మహాశివరాత్రి, నాగుల చవితి సందర్భాలలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు వేలాదిగా పాల్గొంటారు.

సుళ్ళు ఉత్సవం
సూళ్ళూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరికి ఏడు సంవత్సరాల కొకసారి మే- జూన్‌ నెలల మధ్య బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఏడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు సుడి మాను ప్రతిష్ట, బలిహరణతో ప్రారంభం అవుతాయి. రెండో రోజు నుండి నాలుగో రోజు వరకు సుడిమా నుకు చక్రం, నల్ల మేక, పూలమాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు. మూడో రోజున మహిషాసుర మర్దని అంటే దున్నపోతు బొమ్మతలను నరకడం జరుగుతుంది. లోక కంటకుడైన మహిషాసురుని మహాకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందిం చిన ప్రజలు అయిదో రోజున కాళింది నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆఖరి రోజున పరమేశ్వరిని పుష్ప పల్లకిలో ఊరేగిస్తారు. ఈ ఏడు రోజులు అమ్మవారిని గ్రామంలో అశ్వ, సింహ, నంది ఇలా రోజుకో వాహనం మీద ఊరేగిస్తారు. మహిమగల తల్లిగా, కోరిన వరాలను ప్రసాదించే పరమేశ్వరిగా కొలువుతీరిన చల్లని తల్లి శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి.
సేకరణ: పద్మలత

Advertisement

తాజా వార్తలు

Advertisement