Sunday, November 17, 2024

దేవతారాధనకు శ్రేష్టం కొబ్బరికాయ!

భారతదేశపు దేవాలయాలలో చేసే అత్యంత సామాన్య నివేదనలలో కొబ్బరికాయ ఒకటి. వివాహములు, పండు గలు, కొత్త వాహనము, వంతెన, ఇంటి గృహప్రవేశాలు వంటి శుభ సందర్భాలలోనూ కొబ్బరికాయ నివేదింపబ డుతుంది.
నీటితో నిండి మామిడి ఆకులతో అలంకరింపబడి దానిపై కొబ్బరికాయ ఉన్న కలశమును ముఖ్యమైన పూ జా సందర్భాలలో ప్రత్యేక తిథులను ఆహ్వానించడానికి ఉపయోగించ బడుతుంది. హోమము చేసే సమయము లో ఇది హోమాగ్నికి ఆహుతిగా అర్పించబడుతుంది. భగవంతుని తమ కోరికలు తీర్చుకొనడానికి కొబ్బరికా య పగుల గొట్టబడి స్వామికి నైవేద్యముగా పెట్టబడుతుం ది. తరువాత ప్రసాదముగా పంచబడుతుంది.
పగిలిన కొబ్బరికాయ అహంకారపు విరుపును ప్రతి బింబింప చేస్తుంది. మనలోని అంతరంగ ప్రవృత్తులకు (వాసనలు) ప్రతీక ఐన లోపలి నీరు, మనసుకు ప్రతీక ఐన కొబ్బరి తో సహా భగవంతునికి నివేదింపబడతాయి. భగవంతుని స్పర్శ తో శుద్ధి అయిన మనసు ప్రసాదంగా వినియోగించబడుతుంది. సాధకునికి ఆధ్యాత్మిక ఉన్న తిని కలిగిస్తుందనే నమ్మకముతో కొబ్బరినీరు అభిషేక ప్రక్రియలలో వాడబడుతుంది.
కొబ్బరికాయ ఫలాపేక్ష రహిత సేవకి కూడా ప్రతీక. కొబ్బరి కాయకు పైనున్న మూడు కళ్ళ గుర్తుల్ని బట్టి త్రినే త్రుడైన పరమశివునికి ప్రతీకగా భావిస్తారు. అందువల్లనే మన కోరికలు తీర్చడానికి అది సాధనంగా పరిగణించబ డుతుంది. కొన్ని వైదిక ప్రక్రియలలో పరమ శివునికి, జ్ఞాని కి ప్రతీకగా కొబ్బరి కాయ కలశంపై పెట్టబడి అలంకరిం పబడి, మాలాలం కృతము చేయబడి పూజించడం అత్యంత శ్రేష్టం.

Advertisement

తాజా వార్తలు

Advertisement