Wednesday, November 20, 2024

చిత్తశుద్ధిలేని…శివపూజలేల

”ఆత్మశుద్ధి లేని ఆచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినుర వేమ.”

మనసు నిర్మలంగా లేకుండా మలిన బుద్ధితో చేసే ఆచారం, శుభ్రంగా లేని వంటపాత్రలో చేసిన వంట, నిర్మలమైన స్వచ్ఛమైన మనసు తో చేయని శివపూజ ఎందుకు? అంటే ఇవన్నీ వ్యర్థం అని యోగి వేమన భావన.
ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ పుణ్యక్షేత్రాన్ని సంద ర్శించాలని అనుకుంటారు. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలని ఆరాట పడతారు. కాశీ విశ్వేశ్వర దర్శనం సర్వపాప హరణం అని నమ్ముతారు. మోక్ష కారకం అని భావిస్తారు. కాశీ విశ్వేశ్వర దర్శనం పునర్జన్మ రాహత్యమ ని, కైలాస ప్రాప్తి కలిగిస్తుందని, మోక్షాన్ని స్తుందని విశ్వసిస్తారు.
అయితే కాశీ వెళ్ళినంత మాత్రాన సకల పాపాలు పోతాయా? కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నంత మాత్రాన పునర్జన్మ లేకుండా పోతుందా? కైలాస ప్రాప్తి లభిస్తుందా? మోక్షం సిద్ధిస్తుందా?
లక్షలాది మంది కాశీకి వెళుతున్నారే! లక్షల్లో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారే! వీరందరికీ కైలాసప్రాప్తి లభించిందా? లభిస్తుం దా? అని తార్కికంగా ఆలోచన చేసేవారు ఉన్నారు. సందే#హంచే వారూ ఉన్నారు. ఏంలేదు. అంతా ఒఠ్ఠిదే అని తీసిపారేసేవారూ ఉన్నారు.
తప్పొప్పులు చూడకుండా చేసిన పనులన్నీ చేసేసి, కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నంత మాత్రాన, కైలాస ప్రాప్తి ఎలా లభిస్తుందనీ వాదులా డే వారూ, వాదన చేసేవారూ ఉన్నారు.
ఓ శివరాత్రి పర్వదినాన కాశీని సందర్శించుకోవాలనీ, విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలనీ తండోపతండాలుగా భక్తులు కాశీ చేరుకున్నారు. దర్శ నం కోసం తంటాలు పడుతున్నారు. ఈ సందడంతా చూసిన పార్వతీ పరమేశ్వరులు వీరి చిత్తశుద్ధి పరీక్షించాలనుకున్నారు.
శివపార్వతులు యిద్దరూ పండు ముదుసలులా మారిపోయారు. కాశీ విశ్వేశ్వరాలయం ముఖ ద్వారం చేరుకున్నారు. పండు ముసలి ఆకా రంలో ఉన్న భర్త ఈశ్వరుని తలను తన ఒళ్లో పెట్టుకుని కూచుంది ముసల మ్మ రూపంలో పార్వతీదేవి. దాహంతో విలవిల లాడిపోతున్నాడు ముసలి భర్త రూపంలో ఉన్న పరమశివుడు. గిలగిలా కొట్టుకుంటున్నాడు. చొంగ లు కారుస్తున్నాడు. చూసేందుకు హృదయ విదారకంగా ఉందా దృశ్యం.
”అయ్యా! నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్లి గంగాజలం తీసుకురావటం కుదరదు. ఏ క్షణంలో నా భర్త ప్రాణం పోతుందో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నీళ్ళు తేడానికి ఎలా పోగలను? కాబట్టి మీలో ఎవరైనా దయతలచి నా భర్త దా#హం తీర్చేందు కు కొంచెం గంగాజలం పోయండి. నా భర్తని బ్రతికించండి.” అని దేవాల యంలోనికి వెళ్తున్న భక్తులందరినీ, పేరు పేరునా ప్రాధేయపడింది. చేతులె త్తి ప్రార్ధిస్తోంది ముసలమ్మ రూపంలో ఉన్న పార్వతీదేవి.
భక్తులందరి చేతుల్లోనూ గంగాజలం నిండుగా ఉన్న పాత్రలు ఉన్నాయి. ఆలయంలోకి భక్తులు వెళ్తున్నారు. ఎంత వేగిరం విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని పుణ్యం సంపాదించేద్దాం అనే ఎవరి తొందరలో వాళ్ళు, ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కానీ ఏ ఒక్కరూ ఈ ముదుసలులకు సహాయపడేందుకు కనీసం ఆలోచించటం లేదు. సహాయపడాలని ముందుకు రావటం లేదు. సరికదా కనీసం సానుభూతి చూపిన పాపాన కూడా పోలేదు.
పైగా వాళ్ళలో కొందరు వాళ్లనలా చూసి విసుక్కుంటున్నారు. మరి కొందరు ఈసడించుకుంటున్నారు. ఇంకొందరు వారిద్దరినీ విమర్శించు కుంటూ, తిట్టుకుంటూ ముదుసలులను ఇద్దరినీ తప్పించుకుని వెళ్లిపోతు న్నారు. మానవత్వం ఏమాత్రంలేని పాషాణువుల్లా తమకేమీ సంబంధం లేనట్లు కదిలిపోతున్నారు. మరికొందరైతే విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని వచ్చాక, నీ భర్త నోటిలో నీరు పోస్తాంలే అంటూ విసురుగా వెళ్లిపోతున్నారు. ముసలమ్మ రోదన అరణ్య రోదనే అవుతోంది.
ఇదిలా ఉండగా కొంత సేపైన తర్వాత , జనం బాగా కిక్కిరిసి ఉన్నారనీ , ఇలా ఉన్నప్పుడైతే, తన చేతి వాటం చూపటానికి యిది మంచి అవకాశం అని, ఇప్పుడైతే మంచి బేరం తగులుతుందనే ఆశతో ఓ దొంగ అక్కడికి వచ్చే డు. జనంలో కలిసిపోయేడు. ముసలి వాళ్ళిద్దరినీ చూసేడు. ”ఎవరమ్మా మీరు. ఇక్కడ ఎందుకు ఉన్నారు?” అని ముసలమ్మని అడిగేడు. అప్పుడు ముసలమ్మ రూపంలో ఉన్న పార్వతీ దేవి ”మేమూ దర్శనానికే వచ్చేమ య్య. ఇంతలో ఉన్నట్టుండి నా భర్త పడిపోయి దాహంతో కొట్టుకుంటున్నా డు. గిలాగిలా లాడిపోతున్నాడు. ఎవరైనా యిన్ని మంచి నీళ్ళు తెచ్చి నోటిలో పోస్తే బ్రతుకుతాడేమోనని అందరినీ ప్రాధేయపడుతున్నాను.” అని దొంగకి చెప్పింది.
అంతే! వెంటనే తన చంకన తగిలించుకున్న సొరకాయ బుర్రలోఉన్న నీరుని దాహంతో గిజగిజలాడుతున్న ముసలివాని నోట్లో పోయబోయాడు దొంగ. అప్పుడు ముసలమ్మ ”నాయనా! నీరు పోసే ముందు నువ్వు చేసిన పుణ్యకార్యాలు అన్నీ చెప్పి నీరుపొయ్యి.” అని అంది. దొంగకు యిదంతా అయోమయంగా ఉంది. అయినా ముదుసలిని బ్రతికించాలనే మంచి మన సుతో ముసలమ్మ చెప్పినట్లే చేసాడు. ”అమ్మా! నేనో దొంగను. ఇంతవరకు నేనన్నీ పాపాలే చేసాను. ఇప్పుడు నీ భర్త నోటిలో నీరుపోయాలి అనుకున్నా ను. ఇదొక్కటే పుణ్య కార్యం.” అని ముసలమ్మకు చెప్పి వృద్ధ³ుని నోటిలో నీరు పోసాడు దొంగ.
అంతే! తక్షణం శివపార్వతులిద్దరూ తమతమ సస్వరూపాలతో దొంగకు దర్శనం ఇచ్చారు. ”సత్యాన్ని మించిన ధర్మం లేదు. పరోపకా రానికి మించిన దైవ ప్రార్థన లేదు.” అని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ దొంగను ఆశీర్వదించారు.
ఇది… సత్యానికి, పరోపకారానికి ఉన్న విశిష్టతను తెలియచెప్పే కథ. పునర్జన్మ రహతమై మోక్షప్రాప్తి, కైలాస ప్రాప్తి ఎలా కలుగుతాయో వివరించే కథ. అయితే కథలో ఉన్న అంతరార్ధాన్ని మనం గ్రహంచాలి. అవసరమైన సత్యనిష్టని, పరోపకార తత్వాన్ని అవగతం చేసుకోవాలి. పరుల సేవే పర మాత్ముని సేవ అని గుర్తెరగాలి.
పరమాత్మ తత్త్వాన్ని గుర్తించాలి. పరమాత్మ కృపకు పాత్రులు కావాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement