Saturday, November 23, 2024

చాతుర్మాస్య వ్రత ఫలం అనంతం

ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని పిలుస్తారు . ఆరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు.
హిందూవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే వ్రతం చాతు ర్మాస్య వ్రతం. చాతుర్మాసం నాలుగు నెలలు సనాతన ధర్మా నికి సంబంధించిన పనులు చేయమన్నారు. భగవంతుని పూజిం చడం, దేవుడిని ధ్యానించడం సర్వ శుభప్రదమని భావిస్తారు. ఈ కాలం లో ఏ పని ప్రారంభించినా చాలా ఫలితం పొందవచ్చునని శాస్త్ర వచ నం. దీనిని నాలుగు నెలలు పాటు ఆచరిస్తారు.
అనాదిగా మునులు, రుషులు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతు న్నాయి.
యుగ యుగాలుగా చాతుర్మాస్యాన్ని ఆచరిస్తు న్నట్టు భవిష్య, స్కాంద పురాణాలలోని కథనాల వల్ల అవగతమవు తుంది. పూర్వ కాలంలో మనకు వర్ష, హమంత, వసంత అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి. ఈ ఋతువులలో వర్ష ఋతువు తోనే సంవత్సరం ప్రారంభమయ్యేది . ఆ కారణం గా సంవత్సరానికి ”వర్షం” అనే పేరు వచ్చింది. సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలంలో ఒక్కో ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు. ఆషాఢ పూర్ణిమ నుంచి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుంచి సాకమేద యజ్ఞం, ఫాల్గుణ పూర్ణిమ నుంచి వైశ్వ దేవ యజ్ఞం చేసేవారు. ఈ క్రమంలో ఆనాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలంలో చాతుర్మాస్య వ్రతంగా మారి ఆచరణలోకి వచ్చింది.
చాతుర్మాస వ్రతం పాటించేవారు ఆహార నియ మాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకు కూరలు, వంకాయలు, భాద్రపద మాసంలో పెరు గు, పులిసిన ఆహారపదార్థాలు, ఆశ్వీయుజ మాసం లో పాలు, పాల ఉత్పత్తులు, కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా విసర్జించాలి. వాటిని ఆహారంగా స్వీకరించ కూడదు.
ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడు కోవటానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఏవిధంగా చూసినా చాతుర్మాస్య వ్రతదీక్ష అనేది మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాఙ్మయం వివరిస్తోంది .
చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల (బ్రహ్మచర్య, గృహస్థ, వాన ప్రస్థ, సన్యాస) వారు పాటించవచ్చు. కుల, వర్గ నియమాలు కానీ, లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తున్న వారు ఆహార నియ మాలు పాటిస్తూ, ఆథ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి. వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించే వారు ఈ నాలుగు నెలలు తాను నివసించే గ్రామం ఎల్లలు దాటరాదు.
వ్రతం ఆచరించే కాలంలో వేకువ జామునే స్నానం చేయాలి. బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, మంచంపై కాకుండా నేలపై నిద్రిం చడం, అహంస పాటించాలి.ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి.
ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యా యాలను కంఠస్థం చేయాలి. అలాగే –
యోగసాధన చేయడం శ్రేయస్కరం. దానధర్మాది క్రతువులను ఆచరించాలి. ఈ వ్రత వైశిష్ట్యాన్ని గురించి సాక్షాత్తు పరమ శివుడు, పార్వతి మాతకు వివరించగా, పార్వతి మాత వ్రతాన్ని ఆచరించి ఈశ్వరానుగ్రహం పొందిందని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే శయన ఏకాదశి రోజు నుంచే ముత్తయిదవులు చాతుర్మాస్య గోపద్మ వ్రతం కూడా ఆచరిస్తారు. చాతుర్మాసంలో శుభకార్యాలు చేయడం చాలా అశుభం. నూతన పనుల ప్రారంభోత్సవాలు, వివాహ వేడుకలు, నిశ్చితార్థం, పిల్లలకు నామకరణం చేయకూడదు. ఈ పనులు చేయడం నిషిద్ధం. ఈ రోజుల్లో మంచం మీద పడుకోకూడదు. నేలపై పడుకోవాలి. తులసిచెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోయాలి. చాతు ర్మాస దీక్షలో ఈ నియమాలను పాటిస్తే పేదరికం నుంచి బయటపడ తారు. సుఖశాంతులు కలుగుతాయి.
– దాసరి దుర్గా ప్రసాద్‌
77940 96169

Advertisement

తాజా వార్తలు

Advertisement