Thursday, November 28, 2024

అమృతేశ్వరాలయాన్ని దర్శించిన మహాసరస్వతీ పుత్రులు చాగంటి..

  • దివ్య స్ఫటిక లింగం సాక్షిగా పురాణపండ గ్రంధాలు ఆవిష్కరణ

బళ్ళారి : పరమ రహస్యమైన పరమేశ్వరుని పవిత్ర కటాక్షంగా ఈ శ్రీ అమృతేశ్వరుని ఆలయాన్ని నిర్మించడం వల్లనే ఇక్కడా అడుగు పెట్టగానే నిర్మలంగా, నిశ్చలంగా మనస్సు ప్రశాంతంగా ఉందని విఖ్యాత ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వర రావు పేర్కొన్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి కోట్లాది రూపాయలతో అద్భుత శిల్ప సౌందర్యంతో నిర్మించిన శ్రీ అమృతేశ్వరుని ఆలయాన్ని ఆయన గురువారం సందర్శించారు. మూడు రోజుల పాటు పురాణేతిహాసాలపై ప్రవచనాలివ్వడానికి బళ్లారికి వచ్చిన చాగంటికి అమృతేశ్వరుని ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శైవాగమా సాంప్రదాయానుసారం అర్చనలు జరిపి దుస్సాలువ, వారాహి అమ్మవారి పంచలోహ మంగళ ప్రతిమతో ఘనంగా సత్కరించారు .

శ్రీ అమృతేశ్వర ఆలయం, వారాహి చలన చిత్రం ల సంయక్త ఆధ్వర్యంలో సాయి కొర్రపాటి సమర్పణలో పరమ శోభాయమానంగా ఒక ప్రత్యేక ఫైల్ లో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనాలు మూడు పవిత్ర గ్రంధాలను ఆయన ఆవిష్కరించడం విశేషం.

కాస్సేపు ప్రశాంతంగా ఈ దివ్య గ్రంధాలను ఆయన ఆలయ ప్రాంగణంలో పరిశీలనగా ఆసక్తిగా చూడటం, చదవటం భక్తులకు ఆశ్చర్యం కలిగించింది. చాలా ఉత్తమ , పవిత్ర ఆలయాన్ని దర్శించిన అనుభూతి కలిగిందని చాగంటి స్పష్టంగా సాయి కొర్రపాటిని అభినందించినట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement