Friday, November 22, 2024

ఓర్వలేకనే రంధ్రాన్వేషణం!

వ్యాసమహాముని పూనుకుని, తన మ#హమతో, కురుక్షేత్ర సంగ్రామంలో వీరమరణం పొందిన దుర్యోధనాది వీరులనందరినీ దివిజ లోకం నుండి భూలోకానికి తెచ్చి, భూలోకంలో పూర్వపు వారి రూపాలలోనే చూపించి, వారివారి స్త్రీజనం, ఆప్త జనంతో పూర్తిగా ఒకరోజు ఇచ్చ వచ్చి న రీతిలో కాలం గడిపేలా చేసి, ఆ రోజు గడిచాక తిరిగి వారిని దివిజ లోకానికి పంపివేయడంతో, తనకు సంబంధించిన అం దరూ పోయారన్న మహా శోకంలో అడవిలో ఆశ్రమవాసం లో తపస్సు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న ధృతరాష్ట్రు డికి కొంత శాంతి లభించినట్లుగా అయ్యి, పూర్వపు దు:ఖం నుండి కాస్త తేరుకుని, ధర్మరాజును ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, అప్పటి కర్తవ్యాన్ని గురించి ఇలా బోధ చేస్తాడు:
”రాజుగా రాజ్యపాలనానికి సంబంధించిన సంగతుల న్నిటినీ స్వయంగా నీవే చూసుకోకుండా ఇలా వచ్చి అడవిలో ఆశ్రమవాసంలో ఉన్నమాతో నెలరోజులుగా కాలం గడపడం సరైన పనేనా? కాదు కదా! రాజుగా నీ బాధ్యతలను గురించి, రాజ్య పాలనంలోని మెళకువలను గురించి, రాజనీతిని గురిం చి, ఆ నియమాలను గురించి ఇప్పటికే భీష్మాది కురు వృద్ధులు ఎన్నో సంగతులను నీకు చెప్పారు. నీవు చెవియొగ్గి శ్రద్ధగా అన్నీ విని మనసుకు పట్టించుకున్నావు. అంతకుమించిన ఉప దేశం ఏదీ నీకు మరొకరు చేయవలసినది లేదు, నీవు వినవల సినదీ లేదు. గిట్టినివాళ్ళు ఎప్పుడూ ఎక్కడ తప్పులు దొర్లుతా యా పట్టుకుందాం అని మాటేసి వెదుకుతూ రంధ్రాన్వేషణం చేస్తూ సిద్ధంగా కూర్చుని ఉంటారు. అందువలన, తమ్ములతో నూ స్త్రీ జనంతోను కలిసి త్వరగా ఇక్కడినుండి వెళ్ళిపో! నీ పూనికతో అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఈ నెలనాళ్ళు మాతో గడపడం వలన నాకు ఎంతో మేలు జరిగింది. మునపటి శోకం అంతా మది నుండి తొలగిపోయింది. చిత్తం శాంతిని చేకూర్చుకుని ప్రశాంతతను, నిర్వికార తేజాన్ని పొందింది నాయనా!” అని ధర్మరాజుతో ధృతరాష్ట్రుడు వివరంగా చెబు తాడు. ఇందులో ముఖ్య విషయం పెదతండ్రిగా ధర్మరాజుకు తక్షణమే రాజ్యపాలనంలో లీనం కమ్మని కర్తవ్య బోధ చేయ డం! అయితే, అందులో భాగంగా సందర్భానుసారంగా ధృత రాష్ట్రుడు చెప్పే మాటలలో ‘రంధ్ర మొవ్వని జనంబు వేచు’ అన్న నానుడిని తలపించే మాటలను ఉపయోగిస్తాడు తిక్కన తెలుగు మహాభారతం, ఆశ్రమ వాస పర్వం, ద్వితీయాశ్వా సంలోని పద్యంలో.’గిట్టనోడు ఎప్పుడూ బొక్కలే వెదుకుతా డు’ అనే అర్థంలో ఈ మాటలు ఈనాటికి కూడా సామాన్య జనం సంభాషణల్లో ప్రయోగించబడుతూ వినిపిస్తుంటాయ న్నది అందరూ ఎరిగినదే!
తిక్కన మహాకవి తెలుగు మహాభారతంలో చెప్పినట్లు గా, మూలమైన వ్యాసుడి మహాభారతంలో కూడా ఇలాంటి ప్రయోగం ఏదైనా ఉన్నదా అని పరిశీలిస్తే సంస్కృత మహా భారతం ఆశ్రమవాస పర్వంలో భాగమైన ‘పుత్రదర్శన పర్వం’ లో ఇలా వుంది.
”బుద్ధిమంతుడైన ఈ యుధిష్ఠి రుడు అందరు తమ్ములతోను, సమస్త స్త్రీ జనంతోను, ఇంకా తోడుగా వ చ్చిన స#హృదయులందరితోను కలిసి నీ సేవలో నిమగ్నమై ఉన్నా డు. ఇప్పుడిక వీరందరికీ వీడ్కోలు పలికే సమయం వచ్చింది. వీరందరూ #హస్తినాపు రం వెళ్ళిపోయి పూర్వంలా రాజ్యపాలనకు సంబంధించిన పనుల్లో మునిగిపోవాలి. వీరు ఇక్కడికి వచ్చి నీ సేవలో నిమగ్నమై నెల రోజులు పైగా గడిచిపోయాయి కదా! కౌరవు లలో శ్రేష్టుడా! రాజా! రాజ్యంలో చాలా మం ది శత్రువులు ఉంటారు. వాళ్ళెవరో తెలుసుకుని ఎల్లప్పు డూ వారిపై ఒక కన్ను వేసి ఉంచి, వారి బారినుండి రాజ్యాన్ని కాపా డుకుంటూ ఉండాలి!” అని వ్యాసమ#హర్షి ధృతరాష్ట్రు నితో చెప్పిన మాటలు పైన సూచించిన శ్లోకాల సారాంశం!

Advertisement

తాజా వార్తలు

Advertisement