ఒక వ్యక్తికి ఒక ఆలోచన ఎలా జన్మిస్తుంది?
ప్రపంచంలో సహజంగా వ్యక్తమయ్యే ఆలోచనను ఎలా సృజించుకోగలడు? ఒక వ్యక్తి తన శక్తితో, తన ఆలోచన వాస్తవ రూపం దాల్చేట్లుగాచేయగలడా? అన్న విషయాలను సద్గురు వివరిస్తున్నారు. ఒక వ్యక్తికి, జీవితంలో తాము ఏమికాదలచుకు న్నా, అది ఏదైనా కావచ్చు- తన వ్యాపారాన్ని వృద్ధిపర చుకోవడం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, మరే దైనా కావచ్చు, వారిలో మొదట ”నాకిది కావాలి” అన్న ఆలోచన తలెత్తుతుంది. ఒకసారి ఈ ఆలోచన వస్తే, చాలా మంది తమ శక్తిని ఆ లక్ష్యం సాధించడం కోసం తమ కార్యా చరణపై కేంద్రీకరిస్తారు. వారి కార్యాచరణ తీవ్రమైనదయితే ఆ ఆలోచన నిజమవుతుంది. లోకంలో చాలామంది వ్యవహరించే సాధారణమైన తీరు ఇది. ఒక నిర్దిష్ట శక్తి కోణంతో ఆ ఆలోచనలో శక్తిని నింపడం ఎలాగో వారికి తెలియదు. అయితే మీరు మీ శక్తిని మీ భౌతికతను దాటి కదిలింప గలిగితే, ఆ చలనం ఒక చైతన్యవంతమైన ప్రక్రియగా ఉన్న్లట యితే, మీరు ఒకచోట కూర్చుని మీ శక్తిని మరోచోటికి పంపగ లుగుతారు. కాని మీ జీవశక్తుల మీద మీరు తగినంత నియంత్రణ సాధించకుండా మీరీ పనిచేయడం ప్రారంభిస్తే వాటిని మళ్లి మీలోకి ఎలా ఉపసంహరించుకోవాలో మీకు తెలియకపోవచ్చు. ఆవిధంగా మీరు మీ జీవితాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు ఇది గమనించి చూడండి, ఎవరైనా ఒక వ్యక్తికి దేనిప్లటనా కోరిక ఒక పరిధిని మించి ఉంటే, సాధారణంగా ఆ వ్యక్తి తక్కువ వయస్సులోనే మర ణించవచ్చు. చాలామంది కోరికలు చెంచలమైనవి. వాళ్లు ఇవాళ ఒకటి కోరుకుంటారు, రేపు మరొకటి- అది నిరంతరం మారుతూనే ఉంటుంది. కాని ఎవరికైనా ఒక విషయం మీద తీవ్రమైన కోరిక ఉంటే, ఆ కోరిక తీరినా, తీరకపోయినా వాళ్లు తక్కువ వయస్సులోనే మరణిస్తారు. ముఖ్యంగా వారు కోరు కున్నది జరిగినట్లయితే వాళ్లు ఇంకా యవ్వనంలో ఉన్నప్పు డే మరణిస్తారు, ఎందుకంటే వాళ్లకు తమ జీవశక్తులను బయటకు తోయడమెలాగో తెలుసుకాని వాటిని మళ్లి లోపల కు తచ్చుకునేంత నైపుణ్యం, శక్తి ఉండదు.
ఆలోచన అన్నది ఒక ప్రకంపనా శక్తి. శక్తి లేకుండా మీరు ఆలోచనను సృజించలేరు. అది నిర్ణీత పద్ధతిలో జరగనప్పు డు, దానికి తగినంత శక్తి లేనప్పుడు, అది వ్యక్తంకాదు. మీ ఆలోచనా ప్రక్రియతో మీరెంతో శక్తిని ఉత్పత్తి చేయగలరు. ఎంత ఎక్కువ శక్తిని ఉత్పన్నం చేయగలరంటే, అది ఎదుటి వ్యక్తిని హతమార్చగలదు కూడా. మీ బుద్ధి ఏకాగ్రతతో ఉన్న ప్పుడు అది చాలా శక్తిమంతమైన సాధనం. దురదృష్టవ శాత్తు తరచుగా ప్రజలు ఈ ఏకాగ్రతను సకారాత్మకంగా (positive) కాక నకారాత్మకంగా (negative) వాడతారు. క్రోధా వేశంతో ఉన్న మనస్సు కాని, కామ వశమై ఉన్న మనస్సుకాని ఎంతో తీవ్రతతో ఉంటుంది కాబట్టి, మనం అలా ఉన్నప్పుడు మన బుద్ధి ఏకచిత్తంతో ఉంటుంది. అందుకే భారతీయ సం స్కృతిలో పిల్లలకు, ”మీరు కోపంగా ఉన్నప్పుడు ఎవరి గురిం చీ చెడ్డగా మాట్లాడకండి” అని చెప్తారు. ఎందుకంటే మీ మన స్సు పూర్తిగా క్రోధంతో తీవ్రంగా ఉంటే, మీరు ఏమి ఆలోచి స్తున్నారో దానిపట్ల ఏకాగ్రత కలిగి, మీరు ఆలోచిస్తున్నది తేలికగా వ్యక్తం కాగలదు. ఒక ఆలోచన ఎలా పుడుతోందో ఆ ప్రక్రియ గురించి చూద్దాం. మీ ఆలోచన చైతన్యవంతమై నదేనా, స్పృ#హతో కూడుకున్నదేనా..? లేదా, అప్పటికే మీ మనస్సులో ఉన్న లక్షలాది విషయాల్లో అదొకటా? మీ ఆలోచనా ప్రక్రియను మీరు ఎరుకతో నియంత్రించకపోతే, దాదాపు అదెప్పుడూ మానసిక అతిసార స్థితిలోనే ఉంటుం ది. దాని మీద మీకు ని యంత్రణ ఉండదు. పాత సరకు అంతా నిండి ఉంటుంది కాబట్టి అది శాఖా చంక్రమణం చేస్తూ ఉం టుంది. ఇది ఎలాగంటే, మీ కడుపులో చెడు ఆహారం ఎంత ఎక్కువయితే మీ అతిసారం కూడా అంత ఎక్కువగానే కొన సాగుతుంది. మీకు మానసిక అతిసారం ఉన్నప్పుడు దాన్ని ఆలోచన అనడానికి వీల్లేదు. ఒకావిడ ఒకసారి కొంతమంది మిత్రుల్ని భోజనానికి పిలిచింది. అందరికీ భోజనం వడ్డించి తన ఆరేళ్ల కూతుర్ని ”నువ్వు ప్రార్థన చేయవచ్చు కదా” అని అడిగింది. తన కూతురి ప్రతిభను అందరిముందూ ప్రదర్శిం చాలని ఆమె కోరిక. కూతురంది, ”నాకు ప్రార్థన ఎలాచేయా లో తెలియదు”. ”నేను ఎప్పుడూ చెప్పేది చెప్పు చాలు” అన్న ది తల్లి. కూతురు తన రెండు చేతులూ జోడించి ఇలా చెప్పింది. ”వీళ్లందర్నీ నేను భోజనానికెందుకు పిలిచాను” అని. ఇటు వంటివి మీలో కూడా జరుగుతూనే ఉంటాయి కదా. మీరు ధ్యానం చేయాలనుకుంటారు, కాని మీ మనస్సు ఎన్నో విష యాలు మాట్లాడుతూ ఉంటుంది.
మీరు ఓ పలక మీద ఏమైనా రాయదలచుకుంటే ముందు దాన్ని శుభ్రంగా తుడవాలి. అప్పుడే మీరు రాసింది స్పష్టంగా చదవగలుగుతారు. లక్ష విషయాలు దానిమీద రాసి ఉంటే, వాటి మీద మీరు మరో విషయం రాస్తే దాన్ని ఎవరూ చదవ లేరు. కొంతకాలం తర్వాత మీరే చదవలేరు. ముందు, మీరు మీ అంత:ముఖం ఖాళీ చేసుకొని, మీరు స్పృహతో ఆలోచనను ఉత్పాదించాలి. మీలోని స్థలాన్ని ఖాళీచేసి ఆలోచనను ఉత్పా దిస్తే అది నిజంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది మీ స్పృహతో కూడిన ప్రక్రియ నుండి జనించింది కాబట్టి. ఒక సారి ఇలా ఆలోచనను చేసిన తర్వాత దాన్ని స్పష్టంగా ఉంచు కుంటే దానిలో శక్తి నింపడం అన్నది చేయవచ్చు.
మీరు మీ మనస్సులో స్పృహతో, చైతన్యంతో ఒక ఆలోచ నను సృష్టిస్తే, అది ఏకాగ్రచిత్తంతో ఉంటే ఈ ప్రపంచంలో తన మార్గాన్ని ఏర్పరచుకోగలుగుతుంది. అది సహజంగానే వ్యక్త మవుతుంది. మీ జీవన శక్తుల మీద మీకు మరింత నియంత్రణ ఉంటే దాన్ని మీరు మరింత ముందుకు తీసుకొని వెళ్లగలరు.
ప్రేమాశీస్సులతో… సద్గురు