Tuesday, November 26, 2024

రాష్ట్రంలో బౌద్ధమత క్షేత్రాలను అభివృద్ధి చేయాలి

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రపంచదేశాల్లో బౌద్ధమత క్షేత్రాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయని,ఏపీలో కూ డా బౌద్ధమత క్షేత్రాలను అభి వృద్ధి చేస్తే గొప్ప సంపద సృష్టిం చ వచ్చని ఏపీ పంచాయతీ పరి షత్‌ ఛైర్మన్‌ జాస్తి వీరాంజ నేయులు అభిప్రాయప డ్డారు. ఏపీలో అమరావతి, భట్టిప్రో లు, నాగార్జున కొండ, ఘంట శాల, శాలిహుండం, బొజ్జన కొండ, గుం టుపల్లి వంటి గొప్ప బౌద్ధక్షేత్రాలు ఉన్నాయ న్నారు. వీటిని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. శ్రీలంకలోని కాండీలో గల సేక్రేడ్‌ టూత్‌ రెలిక్‌ ఆలయానికి విశేష ఆదరణ ఉందన్నారు ప్రపంచదేశాల నుంచి పర్యాటకులు కాండీకి వెళతారని ప్రతినెలా అక్కడ ఆలయానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తోందన్నారు. అమరావతి మ్యూజియంలో వెలకట్టలేని గౌతమబుద్దుల వారి అవశిష్టాలు ఉన్నాయన్నారు. వాటితో బంగారు బుద్ద ఆలయాన్ని ప్రభుత్వం నిర్మించినట్లైతే బౌద్దులు, లామాలు, దలైలామా వంటి వారు భారీగా విరాళాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఆ దేవాలయం వల్ల భవిష్యత్‌లో వేలకోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని జాస్తి అభిప్రాయపడ్డారు. సోమవారం ప్రపంచవ్యాప్తంగా బుద్ధ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించుకోనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement