Friday, November 15, 2024

బుద్ధి కర్మానుసారిణి!

మన మనసుకున్న శక్తితో మనను మనమే ఉద్ధరించుకోవాలి. అంతే తప్ప నాశనం చేసుకోకూడదు. మన మనసే మనకు చుట్టం. అదే మనకు శత్రువు కూడా అవుతుందంటుంది భగవద్గీత. అర్థమ య్యేలా చెప్పుకోవా లంటే.. తల్లిదండ్రులైనా, గురువులైనా, శ్రేయోభిలాషు లైనా.. మన మంచి కోరి మంచి మాటలు చెబుతారు. మిత్రులుగా పక్కనుంటూ మన చెడు కోరుకునేవారు.. చెడ్డదారులు పట్టిస్తారు. మంచి మాటలు వినాలా? చెడుమార్గంలో సాగాలా? అనే నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం మనమే. మన ఇంద్రియాలు తరచుగా మనల్ని తప్పు దోవల్లోకి లాక్కుపోతాయి. వాటికి లొంగిపోయామా.. పతనం తప్పదు. వాటిని మన అదుపులో పెట్టుకుంటేనే మనం జయిస్తాం. ఇది జీవిత రహస్యం. విజయం సాధించడా నికైనా, ఓడిపోవడానికైనా మూల కారణం మనమే. చాలా మంది తమ ఓటములకు, తాము జీవితంలో ఎదగకపోవడానికి ఇతరులే కారణమని చెబుతుంటారు. మరికొందరేమో.. పరిస్థితుల ప్రభావం అంటు ంటారు. తరచి చూస్తే.. చాలామంది విజేతల కుటుంబ పరిస్థితులు మనకంటే ప్రతి కూలంగా ఉంటాయి. కానీ వారు ప్రతిదాన్నీ తమకు అనుకూలంగా మార్చు కుంటారు. ప్రతి ఓటమిని, ప్రతికూల పరిస్థితులను కూడా సోపానాలుగా మార్చుకుంటారు. దీనికి కారణం.. వారికి ఉండే వివేక జ్ఞానం. ఈ ప్రపంచాన్ని ఒక్కసారి గమనించినట్లయితే ఎన్నో అద్భుతాలు గోచరిస్తా యి. అచేతనాలుగా పరిగణించబడే రాళ్లు, రప్పలు మొదలుకొని ప్రాణము న్న జీవుల్లో గొప్పవాడనిపించుకున్న మానవుడి దాకా అంతా ప్రపంచమే. రాళ్లు, రప్పలకు అసలు ప్రాణమే ఉండదు. పశుపక్ష్యాదులకు ప్రాణం, జ్ఞానం ఉన్నా.. ఆ జ్ఞానం వాసనా జ్ఞానమే కానీ, వివేకం ఉండదు. వివేకంతో కూడిన జ్ఞానం ఉండేది ఒక్క మనుషులకే. అంత గొప్ప సామర్థ్యం ఉన్న మనిషి ఎప్పు డూ నిరాశచెందకూడదు. చిన్నచిన్న వైఫల్యాలకు కుంగిపోకూడదు. ఆ వైఫ ల్యాలకు ఇతరులను పరిస్థితులను కారణంగా చూపకూడదు. ఈ ప్రపంచం లో మానవులుగా పుట్టినందుకు.. వివేకంతో కూడిన జ్ఞానాన్ని కలిగి ఉన్నం దుకు మనం ఎంతో అదృష్టవంతులం. పంచభూతాలు మనకు అనేక రకాలు గా ఉపయోగపడుతున్నాయి. ఎన్నో రకాల ప్రాణులు మన జీవనాన్ని సుఖ మయం చేస్తున్నాయి. ఏక వ్యక్తిత్వమనే దృక్పథం నుండి ప్రపంచ వ్యక్తిత్వ మనే పథంవైపు పయనం సాగించాలని మన సంస్కృతి మనకు చెబుతుంది. ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్న మనిషి స్వశక్తిని నమ్ముకుని మనసా, వాచా, కర్మణా కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఆధ్యాత్మిక ఉన్నతికైనా.. జీవితంలో పురోగతికైనా అదే ముఖ్యం.
– కామిడి సతీష్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement