Tuesday, November 26, 2024

బ్రహ్మవాదిని శచీ పౌలోమి

”దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం,
భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహమే”
దేవేంద్రుని ప్రియురాలవగు నీకు నమస్కారము. వీరికి వివాహము, భాగ్యము, ఆరోగ్యము, సంతతి కలిగింపుము అని ప్రార్ధిస్తాడు. తరు వాత వధువును తెరకు తూర్పున పశ్చిమ ముఖంగా కూర్చో బెట్టి, వరుని తెరకు పశ్చిమమున తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఇరువురికి మధ్యవున్న తెరను తొలగిస్తారు. అపుడు వధూవరులు ఒకరి భ్రూమధ్యము మరియొ కరు చూసుకుని జీలకర్ర బెల్లమును ఒకరి నెత్తిన మరియొకరు ఉంచుతారు.
మన సంప్రదాయంలో పూర్వం ఐదు రోజుల పెండ్లి జరిగేది. ‘నాగెల్లి’ అనే ఓ పురాతన తంతుకు సంబంధించింది. ఆ కార్యక్రమంలో ఓ తంతు నా గెల్లి/ నాగవెల్లి/ నాకబలి/ నాగపెండ్లి/ నాగవెండ్లి/ నాగవల్లి ఇలా ప్రాం తాలను బట్టి వేరువేరుగా పలుకుతుంటారు. సంస్కృతంలో నాకం అంటే స్వర్గం. బలి అంటే నైవేద్యం. అంటే.. స్వర్గంలోని దేవతలకు నైవేద్యం పెట్ట డం. వధూవరుల పెండ్లికి ముందు రోజు ఇంద్రుని భార్య అయిన శచీదేవిని పూజించి.. పెండ్లి తర్వాత ‘నాకబలి’ పూజ చేస్తారు. స్వర్గాధిపతి ఇంద్రుడితో పాటు అతని పరివారం మొత్తానికి ఈ పూజ చేయడం వల్ల నూతన వధూ వరులకు మంచి జరుగుతుందని నమ్మకం.
శచీదేవి ఇతర పేర్లు: కన్యకాంబ, దేవరాణీ, శచీ పౌలోమి, పులో మజా, మంజునాశీ, మఘోనీ, మహంద్రీ, వాసవీ, శక్రణీ, శచీమ్‌ ఇంద్రాణీ.
తూర్పు దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత ఇంద్రుడు. ఇంద్రు ని భార్య శచీదేవి. ఆయన వాహనము ఏనుగు. నివసించే పట్టణము ‘అమ రావతి.’ ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము. ఈయన పురుష సంతాన కారకుడు. అధికారం కలుగజేయువాడు.
పూర్వం చంద్రవంశంలో నహుషుడు అనే గొప్ప రాజు జన్మించాడు. ఆయన కీర్తిప్రతిష్టలు ఇంద్ర లోకానికి చేరుతాయి. ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. దానివల్ల తనకు పాపం చుట్టుకున్నదని భావించి కొన్నేళ్లపాటు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఒక కమలంలో ఉండిపోవాలని నిశ్చయించుకుంటాడు. ఇంద్రుడు వచ్చేవరకు ఇంద్ర పదవి ని అష్టదిక్పాలకులంతా ఆలోచించి సమర్థుడైనవాడు, కీర్తి ప్రతిష్టలు గల నహుషునికి కట్టబెట్టారు. నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కనిపించింది. అప్పుడు నహుషుడు, ”ఇంద్రపదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా!” అనుకున్న అతడు మనసులోని మాటను శచీదేవికి తెలియజేసాడు. దేవతల గురువు బృహస్పతి సలహా మేరకు శచీ దేవి నహుషునికి ”ఇంద్ర పదవిలో ఉన్న నీవు గొప్ప ఋషులచే పల్లకీని మో యించుకుంటూ రా!” అని కబురు పంపింది.
”ఓస్‌! ఇంతేకదా అనుకున్న నహుషుడు అగస్త్యుడు మొదలైన ఋషు లందరి చేత పల్లకీని మోయించాడు. అసలే ఇంద్రపదవి. ఆపై తన సొంతం కానున్న శచీదేవి! నహుషుని సంబరానికి అంతులేకుండా పోయింది. శచీదే విని చేరుకునేందుకు అతని మనసు ఉవ్విళ్లూరుతోంది. ఆ తొందరలో పల్లకీ ని మోస్తున్న అగస్త్యుని కాలితో ఒక్క తన్ను తన్ని ”సర్పసర్ప” (త్వరగా, త్వర గా) అంటూ ఆయన్ని తొందరపెట్టాడు. ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్చు లో లేక ‘సర్ప సర్ప’ అంటున్న నువ్వు, సర్పానివై భూలోకాన పడి ఉందు వుగాక” అంటూ శపించాడు. అంతేకాదు ఐదుగురు భర్తలు ఉన్న ద్రౌపది పతివ్రతా ఎలా అయిందన్న సందే#హం చాలామందికి ఉంటుంది. ఎందుకంటే.. ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య శచీదేవి ద్రౌపది గా జన్మించింది. అంటే పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడుకాడు. పాండవులు, ద్రౌపది నవమాసాలు మాతృ గర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు. వీరందరూ అయోనిజులే. ద్రౌపది అగ్ని నుంచి పుట్టింది. ఈమె పాంచాల రాజు అయిన ద్రుపదుడుకి అగ్నిద్వారా జన్మించింది. కారణజన్మురాలైన ఈమెను యగ్న సేని అంటారు. ద్రౌపదికి పాంచాలి, సైరంధ్రీ అనే పేర్లు కూడా ఉన్నాయి.
ఒకసారి త్వష్ట ప్రజాపతి కుమారుడైన ‘త్రిశిరుని’ ఇంద్రుడు సంహరిం చాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలో క ధిపత్యార్హతను కోల్పోయాడు. ఇంద్రుడు బ్రహ్మహత్య పాతక నివారణకై తపస్సు చేస్తున్న కాలంలో, అతని భార్య శచీదేవి, అసురుల ఆగడాలకు భయపడి, తన భర్తతిరిగి వచ్చేవరకు తనకు ఆశ్రయం ఇమ్మని అగ్నిదేవుని అర్థించి ఆయన నీడలో కాలం గడుపుతోంది. తన భర్త అయిన మహంద్రు డు ఐదురూపాలతో భూలోకంలో జన్మించాడని తెలుసుకున్న శచీదేవి, యజ్ఞ కుండం నుంచి ద్రౌపదిగా జన్మించి, పాండవులకు అర్థాంగి అయిం ది. భౌతికంగా పాండవులు ఐదుగురుగా కనిపిస్తున్నా.. నిజానికి వారందరూ కలిసి ఒక్కరే. ఒక్కరితో అంటే ఒకే భర్త అయిన ఇంద్రునితో, ధర్మబద్ధమైన సంసార యాత్ర సాగించిన ‘ద్రౌపది’ అంటే శచీదేవి పతివ్రతే కదా మరి.
పుత్రవ్యామోహం, పుత్రుని మీద మమకారం అనేది కేవలం మానవు లకే కాదు దేవతలకు కూడా ఉంటుందని శచీదేవిని చూస్తే అనిపిస్తుంది. ఒకానొక కాలంలో శతజిహ్వుడనే రాక్షసుడు యజ్ఞ విధ్వంసకుడుగా చెల రేగి ప్రవర్తిస్తుండేవాడు. అలాంటి సమయంలో బ్రహ్మ శచీదేవి కుమా రుడైన జయంతుని దగ్గరకు వచ్చాడు. ‘ఓ జయంతా! నీవు వెళ్లి యుద్ధం చేసి ఆ శతజిహ్వుడను రాక్షసుని పరిమార్పుము’ అని ఆదేశించాడు. ఈ సంగతి శచీదేవి విన్నది. వెంటనే ఆమె బ్రహ్మకు అడ్డుపడి మహామహులెందరో ఉన్నారు కదా వారిలో ఎవరినైనా యుద్ధానికి పంపండి. అసలే శతజిహ్వు డు రాక్షసుడు వానితో పోరుకు నా కొడుకును పంపించకండి అన్నది. దాం తో బ్రహ్మకు కోపం వచ్చింది. ఇంత భయపడుతున్నావు కనుక నీవు భూ లోకంలో వైశ్యకన్యవై జీవించుదువుగాక ! అని శాపం ఇచ్చాడు. దీనితో ఇం ద్రుడు భయపడిపోయాడు. ‘తండ్రీ బ్రహ్మాదేవా! మా అజ్ఞానాన్ని మన్నిం చు తండ్రీ. ఈ శచీదేవి వైశ్య కులంలో పుడితే ఎలా ‘ అంటూ వేడుకున్నాడు. ఇంద్రుని వేడుకోలు విన్న బ్రహ్మ ఈ శచీదేవి వైశ్య కులంలో పుట్టినా ఎవరినీ పెండ్లి చేసుకోకుండానే నీ దగ్గరకు తిరిగి వస్తుందిలే వరం ఇచ్చాడట. ఆమె యే కన్యకా పరమేశ్వరి లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి.
– భువనేశ్వరి మారేపల్లి, 9550241921

Advertisement

తాజా వార్తలు

Advertisement