మన చుట్టూ అలజడి, అశాంతి అలముకొని యున్న సమయంలో శాంతి గురించి మాట్లాడటం నిష్ప్రయోజనం అనిపిస్తుంది. కాని అలాంటప్పుడే శాంతిని, ప్రశాంతతని యెలా సంపాదించుకొని హాయిగా బ్రతకగలం? అని ఆలోచన వస్తుంది.
మన చుట్టూ అలజడి, అశాంతి అలముకొని యున్న సమయంలో శాంతి గురించి మాట్లాడటం నిష్ప్రయోజనం అనిపిస్తుంది. కాని అలాంటప్పుడే శాంతిని, ప్రశాంతతని యెలా సంపాదించుకొని హాయిగా బ్రతకగలం? అని ఆలోచన వస్తుంది.
పూలను చూడండి. అవి కూడా మన వలెనే అశాంతి ఆవరించిన వాతావరణంలోనే వికసించాయి. కాలుష్యం, తీపి కలిసిన ప్రకృతిని తట్టుకొని అవి కూడా మనుగడ సాగించవలసి వుంది. అయినా అవి ఆనందంగా నవ్వుతూనే పరిమళాన్ని వెదజల్లుతున్నాయి.
మురికి కాలువల ప్రక్క బాటల కు అటుయిటు కంటక ప్రాయమైన ఎడారులు – ఇలా ఎలాంటి ప్రదేశంలో చెట్టు మొలిచినా పూలు మాత్రం అక్షయ పరిమళాన్ని అందిస్తూనే వున్నాయి. తమ స్నిగ్ధ సౌందర్యంతో మనలను మురిపిస్తూనే వున్నాయి. ఇక్కడ మనం ఒక సంగతిని లోతుగా ఆలోచించాలి. అదేమంటే… ఆనంద సమయాలలోనే కాక విచార ఘడియలలో కూడా పూలనే యెందుకు యిస్తుంటారు? అని.
శాంతికి, ప్రశాంతికి పూలు సంకేతాలు. ఎప్పుడూ ప్రశాంతంగా వుండమని అవి మూగ సందేశం ఇస్తుంటాయి. అందుకే వీటిని సర్వవేళలలో కానుకగా యిస్తుంటాము.
అలాగే మన ఆత్మ కూడా శాంతి, ప్రశాంతికి నిలయం అని, అది దాని సహజ లక్షణం అని గుర్తించి, శాంతి గరుడయిన భగవంతునిలో మనస్సు లగ్నం చేస్తే మనం కూడా శాంతి పువ్వులము అవుతాము. పూలవలె నిత్యానంద రసానుభూతిని పొందుతాము.
-బ్ర హ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి