Monday, November 18, 2024

ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3 వరకు కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలు

తిరుపతి,ప్రభన్యూస్‌: కొవిడ్‌ -19 వ్యాప్తి నేపథ్యంలో తిరుపతి కపిలేశ్వ రస్వామి ఆలయంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3వ తేదీ వరకు వా ర్షిక బ్రహ్మోత్సవాలను ఏకాం తంగా నిర్వహించనున్నారు. 21వ తేదీ సాయంత్రం 6.30 నుం చి రాత్రి 8.30 గంటల మధ్య అంకు రార్పణతో బ్రహ్మోత్స వాలు ప్రారంభం కానున్నాయి. 22న ఉదయం ధ్వజారోహ ణం(మీనలగ్నంలో), సాయంత్రం హంస వాహనం, 23న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 24న భూతవాహనం, సింహ వాహనం, 25న మకరవాహనం, శేషవాహనం, 26న తిరుచ్చి ఉత్సవం, అధికార నందివాహనం, 27న వ్యాఘ్ర వాహనం, గజవాహనం, 28న కల్ప వృక్ష వాహనం, అశ్వవాహనం, మార్చి 1వ తేదీన రథోత్సవం( భోగితేరు), నంది వాహనం, 2న పురుషా మృగవాహనం, కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం, 3న శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం, సూర్యప్రభ వాహనం, త్రిశూల స్నానం, ధ్వజావరోహణం కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి రొజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఫిబ్రవరి 20వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించను న్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిం చడం ఆనవాయితీ. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. మధ్యాహ్నం 3గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement