కర్నూలు, ప్రభ న్యూస్ బ్యూరో: భ్రమరాంబిక, మల్లికార్జు న స్వామి వారు కొలువై ఉన్న శ్రీశైలంలో మహాశివ రాత్రి ఏర్పా ట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు. ఆ వివరాలను ఆలయ ఈవో లవన్న ఆదివారం పాత్రికేయుల సమావశంలో వెల్లడించారు. మహాశివరాత్రి ఈ సందర్భంగా బ్రహ్మోత్స వాలు 22 నుండి మార్చి 4 వరకు 11 రోజులపాటు- నిర్వహిం చనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 4 వ తేదిన రాత్రి జరిపే పుష్పోత్సవ, శయనోత్సవాలతో బ్రహ్మోత్స వాలు ముగియనున్నాయని చెప్పారు.
కార్యక్రమాలు ఇలా
శివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా తొలిరోజు 22న ధ్వజా రోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 23న భృంగి వాహ నసేవ, 24న హంసవాహనసేవ, పట్టు-వస్త్రాలు సమర్పణ ఉంటు-ంది. 25న మయూరవాహనసేవ, 26వ తేదీ రావణవాహనసేవ, 27న పుష్పపల్లకీ సేవ, గజవాహనసేవ నిర్వహించనున్నారు. ఇక మార్చి 1 మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రభోత్సవం, నందివాహనసేవ, లింగో ద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పొగాలంకరణ, స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిం చనున్నారు. ఇక 2వ తేదీ రథోత్సవం, తెప్పోత్సవం 3వ తేదీ యాగ పూర్ణాహుతి , సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజా వరోహణ కార్యక్రమం చేపడతారు. 4 వతేదిన అశ్వవా హనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమం తో శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
పట్టు-వస్త్రాల సమర్పణ
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పురస్కరించుకుని ఈ నెల 22న శ్రీ కాళహస్తీ శ్వరస్వామి వార్ల దేవస్థానం తరఫున శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లకు పట్టు- సమర్పిస్తారు. ఈనెల 24న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం తరపున, 25న కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వా మివార్ల దేవస్థానం తరపున సమర్పించనున్నారు. ఇక ఈనెల 26న సాయంకాలం -తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టు-వస్త్రాల సమర్పించనుడటం గమనార్హం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని శ్రీశైలంలో ప్రభుత్వం చలువ పందిర్లు : శివదీక్షా శిబిరాలు , గంగాసదన్ వెనుక భాగం, టోలేట్ సమీపంలోని బసవవనం, సిబ్బంది వసతి గృ హాల వద్ద బాలగణశవనం, ఆలయ దక్షిణభాగంలో రుద్రా క్షవనం, మల్లమ్మకన్నీరు మొదలైన చోట్ల చలువ పందిర్లు వేసి భక్తులు సేదతీరేందుకు అవకాశం కల్పించారు. సాక్షిగణపతి, పార్కింగ్ ప్రదేశాలు, అన్నదాన భవనము, కల్యాణకట్ట, చండీశ్వరసదనం మొదలైన ఆరుబయలు ప్రదేశాలలో కూడా చలువపందిర్లు వేశారు.
30 లక్షల లడ్లు
వడ, ప్రసాదాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 30 లక్షల లడ్డుప్రసాదాలను భక్తులకు అందుబాటు-లో ఉండేవిధంగా ప్రణాళిక రూపొందించారు. మొత్తం 15 కౌంటర్ల ద్వారా అడ్డుప్రసాదాలు అందజేయనున్నారు.
పార్కింగ్ కోసం 28 ఎకరాలు
శ్రీశైలంకు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టు-కొని మొత్తం 28.90 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు- చేయడం చేశారు. హెలిప్యాడ్, ఆగమ పాఠశాల ఎదురుగ గల ప్రదేశం, యజ్ఞవాటిక, వాసవీవిహార్ వద్ద కారు పార్కింగ్ ఏర్పాట్లు- చేయబడ్డాయి. రింగురోడ్డు వద్ద ఏ.పి.ఎస్. ఆర్.టి.సి, తెలం గాణ ఆర్.టి.సి. కర్ణాటక ఆర్.టి.సి బస్సులకు పార్కింగ్ ఏర్పా ట్లు- చేయబడ్డాయి. అదనంగా ఔటర్ రింగు వెంబడి సుమారు 3 వేల వాహనాలను కూడా పార్కింగ్ చేసుకోవచ్చు.
జల్లు స్నానాలకు ఏర్పాట్లు
పాతాళగంగలో నీటిమట్టం గణనీయంగా తగ్గుతోంది. ఈ పరిస్థితులలో నదిలోకి దిగి స్నానాలు చేయడం అపాయ కరం. అందుకే పాతాళగంగ ఎగువభాగంలోనూ, పాతాళ గంగ స్నానఘట్టాల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాటు- చేయబ డ్డాయి. పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, శౌచలయాలకు అన్ని మరమ్మతులు చేసి భక్తులకు అందుబాటు-లో ఉంచడం జరిగింది.
విద్యుద్దీపాలంకరణ
రథవీధి , క్షేత్రపరిధిలో పలుచోట్ల విద్యుద్దీపాలంకరణ చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులు కూడా ప్రత్యేకంగా పుష్పాలంకరణకు చర్యలు తీసుకోబడ్డాయి. స్వాగ త తోరణాలు ఉత్సవాలలో పండగ వాతావరణం ఉండేందుకు క్షేత్రపరిధిలో పలుచోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు- చేయ బడ్డాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ పుష్కరిణి వద్ద గల భ్రామరీకళావేదిక , శివదీక్షా శిబిరాల వద్ద గల నటరాజ కళావేదిక మరియు ఆలయ మాడవీధి ( శివవీధి )లోని నిత్యకళారాదన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. శ్రీ స్వామిఅమ్మవార్ల గ్రామో త్సవం లో పలు జానపద కళా రూపాలు ఏర్పాటు- చేయ బడ్డాయి . కమాండ్ కంట్రోల్ రూమ్. అన్నదాన భవన సము దాయం వద్ద కమాండ్ కంట్రోల్ రూములో కంట్రోలింగ్ పాయింట్ ఏర్పాటు- చేయబడుతుంది.