Monday, November 25, 2024

కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లా సుప్రసిద్ధ కాణిపాకం వినాయకుడి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 వరకు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు గణనాథుడు సిద్ధి, బుద్ధి సమేతంగా వివిధ వాహనాలలలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. కానిపాకం వినాయ‌కుడిని ద‌ర్శించుకోవ‌డానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. . కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవ వేడుకలు ఏటా వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 31న వినాయక చవితి మొదలు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, తర్వాత 12 రోజుల పాటు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement