Tuesday, November 26, 2024

దశరథ తనయుడికి బ్రహ్మాది దేవతల హితబోధ

రావణ సంహారం తరువాత, సీతాదే విని గ్రహంచుటకు శ్రీరాముడు తీవ్రంగా ఆలోచనలో ఉండగా, సీతాదేవి పసిగట్టి, దు:ఖం తో, రామునితో ”ఇంతకాలం కలసి జీవించి, నేను ఎటువంటి దాననో మీరు గుర్తించకపోయినట్లౖైెతే, నేను పూర్తిగా నశించినట్లే! నేను లోక ప్రసిద్ధి పొం దిన జనక మహారాజు పెంపకంలో పెరిగినదాన ను. నా భక్తి, నా శీలము అంతా కూడా వెనుకకు నెట్టినట్లే అయ్యింది.” అని పలికి, ”లక్ష్మణా! నీవు చితి పేర్చు. అగ్నిప్రవేశం చేసి, నా పవిత్రతను ఋ జువు చేస్తాను!” అంది.
లక్ష్మణుడు క్షణం ఆలోచించి, రాముని కేసి చూ సి, చితి ఏర్పాటు చేయగా, సీత అగ్నిప్రవేశం చేసింది. వెంటనే అగ్ని జ్వాలల నుండి ”అగ్ని దేవుడు” సీతాదే విని తీసుకుని వచ్చి రామునితో ”రామా! ఇదిగో నీ సీత. ఈమె చాలా పవిత్రురాలు. ఏ దోషము లేదు. సీత వాక్కు, మన స్సు, బుద్ధి, చూపు… అహర్నిశలు నిన్నే తలుస్తోంది. చిత్తము నీ యందే నిలిపి నీవే ఉత్తమ గతి అని తలుస్తోంది. సీతను రావణుడు ఎన్ని విధాలుగా లోభ పెట్టినా, భయపెట్టినా, ఆ రాక్షసుని లెక్క చేయ క ధైర్యంతో నిలబడింది. ఏ శంకా, ఏ పాపము అంటని సీతాదేవిని స్వీకరించు” అన్నాడు.
బ్రహ్మాది దేవతలు, కుబేరుడు, పితృదేవతలతో కూడిన యముడు, ఇంద్రుడు, వరుణుడు, మహశ్వరుడు, సృష్టి మూల పురుషుడు బ్రహ్మ అం దరూ లంకా నగరం చేరారు. రామునితో బ్ర#హ్మ ”రా మా! నువ్వు సర్వలోకాలకు కర్త వు. జ్ఞానవంతులలో శ్రేష్ఠుడవు. సర్వ సమర్ధుడవు. అటువంటి నీవు సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తుండగా ఎందుకు ఉపేక్షించా వు? నీవు పూర్వం కల్పములో వ సువులలో ”ఋతు ధాముడు” వి. రుద్రులలో ఎనిమిదవ వాడ వు. సాధ్యులలో ఐదవ వాడవు. అశ్వనీ దేవతలు నీ కర్ణాలు. సూర్యచంద్రులు నీ నేత్రాలు. ఓ! శత్రు సంహారకుడా! నీవు సృష్టికి ముందు, సృష్టి తరువాత, ఎల్లప్పుడూ ఉండేవాడివి. నీవు సాధారణ మానవుని వలె సీతను పరిగణిస్తున్నా వు. ఆమె మహా సాధ్వి. ఉత్తమురాలు. పవిత్రురాలు.” అని చెప్పారు.
అంత రాముడు వారితో ”దేవతలారా! నేను దశరథుని కుమా రుడును. మానవునిగానే ఊహస్తున్నాను. నేను ఎవరినో? ఎందుకు ఇలా అ య్యానో? వివరించండి” అన్నాడు.
బ్ర#హ్మ బదులిస్తూ” సత్య పరాక్రముడా! నీవు స్వయం ప్రకాశ రూపుడవు. లక్ష్మీ సమేతుడవు. సర్వ సమర్థుడు అయిన నారాయణు డవు .నీ చేతిలో చక్రం ఆయుధంగా గల వాడవు. ఎన్నో అవతారాలు ధ రించి లోక కళ్యాణానికి శ్రమిం చిన మహావిష్ణువువి. పురుషులలో ఉత్తముడవు. సర్వాంతర్యామివి నీవే. బుద్ధి, ఓ ర్పు. సృష్టి, ప్రళయాలు నీవల్లనే కలుగుతున్నాయి. నీవే ఓంకారం. జనన మరణాలకు అతీతుడవు. నీవు ఎవ రవో? ఎవరికి తెలియదు. ఈ జగత్తంతా నీ శరీరం. నీ స్థిరత్త్వ మే భూమి. నీ క్రోధమే అగ్ని. రావణ సంహారం నిమిత్తం అవత రించిన వాడవు. సీతామాత సాక్షాత్తు మహాలక్ష్మి.” అని చెప్పాడు.
అగ్ని ”రామా! సీత పునీతురాలు. స్వీకరించు” అన్నాడు.
అంత శ్రీరాముడు ”మంగళప్రదురాలైన సీత రావణుని రా జ్యంలో చాలాకాలం ఉండబట్టి, లోకానికి నిర్దోషురాలని నిరూపిం చుటకు మిన్నకుండి పోయాను. నా మనసులో ఎల్లప్పుడూ మెద లాడే జనక రాజపుత్రి అయిన సీత హృదయంలో నాయందే భక్తి కలదని నిత్యము నన్నే తలస్తూంటుందని నాకు తెలుసు. సత్యమునే ఆశ్రయించి ఉన్న నేను, మూడు లోకాల్లో నమ్మ కం కలిగించుటకే సీత అగ్నిప్రవేశం చేస్తున్నా ఉపేక్షిం చాను. మీరందరూ నా హతము కోరి శాంతి వచనా లు చెప్పారు. మీరు చెప్పిన ధర్మమార్గాన్ని అనుసరిస్తాను!” అని సీతతో అయో ధ్యకు బయలుదేరగా, దేవత లు ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement