Thursday, July 4, 2024

బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము బృందావనం!

మధుర ”బృందావనం”లో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన ఇది. ఒక పండితుడు తన పూరి గుడిసె లాంటి ఇంటి ముందు అరుగుపై కూర్చుని నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా భక్తితో. భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే, ఆ ప్రాంతం వారు, చాలా మంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందేవాళ్ళు!
అప్పుడప్పుడూ ఆయన తాను చెబుతున్న పురాణం మధ్య లో ఆపి, లోనికి వెళ్ళి వస్తూ ”మా పిల్లవాడికి స్నానం చేయించానని భోజనం పెట్టానని పడుకో బెట్టి వచ్చానని, దుస్తులు ధరింపజేశా న”ని చెప్పేవాడు. ఇలా రోజూ జరుగుతూ వుండేది.
కానీ గుడిసెలో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాట ఏది ఎవరికీ వినపడేది కాదు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆయన దే#హం చాలించాడు, గ్రామస్తులు చాలా బాధపడ్డారు. ఎం త మంచివాడు, ఎంతో భక్తిశ్రద్ధలతో ఎవరిని ఏమీ అడగకుండా అద్భుతంగా భగవద్‌ కథలు వినిపించి మనలను తరింపజేశాడే మరల ఎవరు ఇంత గొప్పగా చెబుతారంటూ విచారపడుతూ ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలు ప్రారంభించారు.
మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లాడి కోసం లోనికి వెళ్లి చూస్తే ఎవరూ కనపడలేదువారికి. ఒక రోజు ఎదురు చూ శారు, పిల్లాడి జాడలేదు. చివరకు వాళ్ళే అతడి కళేబరాన్ని యము నా నది ఒడ్డుకు తీసుకెళ్ళి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు. ఇక నిప్పు పెట్టడానికి వాళ్ళలో ప్రతివాడు నేను పెడతాను అంటే, నేను పెడతాను అంటూ పోటీలు పడ్డారు ఎందుకంటే, మహా పుణ్యాత్ముడు ఆయనకు చేసే ఈ పనివల్ల కర్మ చేసేవారికి ఎం తో పుణ్యం వస్తుంది కదా! ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే, దూరం నుండి ఒక పిలుపు వినవచ్చింది, వారికి
”ఆగండి… ఆగండి” అంటూ దూరంగా, ఒక పదహారేళ్ళ బాలుడు పరుగున అటే వస్తూ కనిపించాడు.
”నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి. నన్ను ఒక పని మీద పొరుగూరు పంపిం చాడు, అది చూసుకొని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది. నన్ను క్షమించి, దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యా న్ని అనుగ్ర#హంచండి” అని విచారవదనంతో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది.
”చూశారా! రక్త సంబంధము బలం ఎలా ఉంటుందో? ఆయ నకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా, ఇతరులకు ఆ అవకాశం ఉంటుందా” అనుకుని సరే అన్నారు.
ఆ పిల్లవాడు చక్కగా వేద మంత్రాలు పఠిస్తూ, అంత్యేష్టి కార్య క్రమం అద్భుతంగా నిర్వ#హస్తూ ఉన్నాడు. చక్కని పాండిత్యం అం దమైన మోము, ఉచ్చారణ, పనసలు చదువుతూ ఉంటే, పురో#హ తులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమా వర్చస్సు?! ఏమా శాస్త్ర పరిజ్ఞానం ఇంతవరకూ ఎవరూ, కనీవినీ ఎరుగని శాస్త్ర విధి ప్రకా రం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షణ నమస్కారం చేస్తూ దు:ఖిస్తూ చితికి నిప్పు అంటించాడు. ”నాయనా ఇక నీవు వెనుదిరిగి చూడ కుండా దూరం వెళ్లు అన్నారు” ఊరి పెద్దవాళ్ళు.
ఆ పిల్లవాడు అలాగే అన్నట్టుగా తల ఊపి, నేరుగా వెళ్తుండ డం, దాదాపుగా 20 గజాల దూరం వెళ్ళాక, కనిపించకుండా అంత ర్ధానం కావడం వారందరూ కళ్ళారా చూశారు. తెలిసిపోయింది, ఆ వచ్చినవాడు ”కృష్ణయ్య”.
ఇన్నాళ్లూ విన్న భాగవత కథల పుణ్యమా అని, శ్రీకృష్ణుని ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహా భాగ్యం లభించింది కదా అంటూ, ఆ బాలుడు నడచిన నేలపై గల ధూళిని ప్రసాదంగా మ#హదైశ్వర్యముగా స్వీకరించారు, వారంతా! ఇప్పటికీ ఆ ప్రదేశా న్ని పరమ పావనంగా పవిత్రంగా భావిస్తూ పూజిస్తున్నారు బృందా వన వాసులు! శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై భక్తుల పాలిట కల్పతరువుగా ఉంటున్నాడనుటకు నిదర్శనం ఈ వాస్తవ గాథ!
మా అబ్బాయికి నిద్ర, ఆహారం, స్నానం ఏర్పాట్లు చేసి వస్తాన ని చెబుతూ శ్రీకృష్ణ భగవానుని తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యా సతో అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావునికి కృష్ణుడు కొడు కు రూపంలో వచ్చి, కన్న తండ్రికి కొడుకు చేస్తున్నట్టుగా, శాస్త్ర రీతి లో స్వయంగా, అంతిమ క్రియలు చేసాడు. భక్తుడు, ఈ భవ బంధా లను కోరుకోకుండా, నేరుగా భగవంతునితో సంబంధ బాంధవ్యా లు పెట్టుకొని, పంచుకుంటూ, పెంచుకుంటూ ముక్తిని పొందాడు!
కడుపున పుట్టిన కొడుకులు కూడా దూరంగా ఉంటూ తండ్రి ఆర్తితో పిలిచే పిలుపుకు అందకపోవచ్చు, కానీ పరమాత్ముడు మా త్రం తనను నమ్మిన భక్తుడిని సదా సంరక్షిస్తాడు. ఇలా భగవంతునికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు, ఊ#హకు అందదు.
”భావాగ్రా#హ జనార్దనా” అంటే భక్తుని అంతరంగంలో కదిలే భావాలను జనార్ధనుడు సదా గ్ర#హస్తూ ఉంటాడు. ఆ ప్రేమానుబం ధం అనిర్వచనీయం, అద్భు తం. అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనం! ఆ అందా ల ఆనందాల అనుబంధాల బృం దావన వనసీమలో, ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేది!

Advertisement

తాజా వార్తలు

Advertisement