ఈనాటి ఆధునిక యుగంలో రోజు రోజుకు చింతలు అధికమవుతున్నాయి.
మానసిక వ్యధల వలన తలనొప్పి, ఎసిడిటీ, గుండెజబ్బులు, ఉబ్బసం ఆయాసం, మధుమేహం మరియు అనేక శారీరక రోగాలు వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. వ్యక్తికి కుటుంబంలో, సామాజిక జీవితంలో కూడా విపరీత ప్రభావం పడుతుంది. అతనిలో కార్యదక్షత తక్కువైపోతున్నది. మనసునను శాంతింపజేయాల్సిన అత్యంతావశ్యకత ఉన్నప్పటికీ ఈనాటి మానవుడు క్షణమాత్రమైన తన్ను తాను శాంతింప చేసికొనలేక పోతున్నాడు. సహజ రాజయోగం యొక్క విశేషత ఏమనగా యోగాభ్యాసం చేయుటచే అతడు ఏ విశేష గుణానుభవం పొందాలనుకుంటే అది పొందగలడు. ఆ గుణానికి సంబంధించిన మనన చింత చేయుటచే ఆ గుణం యొక్క లోతులకు వెళ్ళి కూడా అనుభవం చేసి కొనగలడు. ఆత్మ యొక్క నిజమైన గుణాలు ప్రేమ – శాంతి – ఆనందం, పవిత్రత మరియు శక్తుల యొక్క అనుభవం కోసం జ్ఞానం మరియు మనన చింతన యొక్క వర్ణన చేయబడినది.
-బ్ర హ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి