Thursday, December 19, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

పాప పుణ్యాలకు గీటురాయి(ఆడియోతో…)

మంచి పనులు మరియు చెడు పనుల విస్తారమైన జాబితాను తయారు చెయ్యడానికి ప్రయత్నిస్తే దానిని పూర్తి చెయ్యడం అనుభవం అనే చెప్పవచ్చు. ఎందుకంటే క్షణ క్షణానికీ ప్రతి మానవుడు కొత్త పరిస్థితులను కొత్త సమస్యలను ఎదుర్కుంటూనే ఉన్నాడు. ఎదుర్కుంటున్న ప్రతీసారీ – నేను ఈ పనిని చేయాలా లేక మానుకోవాలా, ఇది నా బాధ్యతా కాదా అని ఆలోచిస్తాడు. కాబ ట్టి మంచి చెడుల జాబితాకన్నా దానిని గుర్తించగలిగే గీటురాయి మానవుడికి ఎంతో ఉపయోగపడుతుంది.

కర్మల జ్ఞానమును లేక మంచి చెడులను పరిశీలించగలిగే గీటు రాయిని పరమ పాప పరిహారకుడు, ధర్మరాజు అయిన ఒక్క భగవంతుడే తెలియజేయగలరు. చెడు భావాలతో ప్రేరేపితమైన కర్మలు, మాటలు మరియు ఆలోచనలు అనగా కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, సోమరితనము వంటివి ‘పాపాలు’. వీటన్నింటిలోకి కామ వికారము మానవునికి ప్రధాన శత్రువు మరియు ముఖ్య పాపము. ఎందుకంటే ఈ ఒక్క వికారంతో మానవుడు మిగతా వికారాలకు సునాయాసంగా లోబడుతాడు.

…బహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీల క్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement