Tuesday, January 7, 2025

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

ఆత్మనిశ్చయంతో వ్యవహారం ఎలా బాగవుతంది?
ముందు మనం మన వ్యవహారమును తీసికొందాము. మన వ్యవహారంలో ఆత్మిక దృష్టినవలంభించి, ఆత్మ నిశ్చయంతో ప్రవర్తిస్తే మనకు అలసట అనేది రాదు. మన దృష్టి చెడిపోదు. మూడవది మనం వికారాలతో, పాప కర్మలతో గూడా రక్షింపబడతాయి. నిరాకారి స్థితిలో నిరహంకారి, నిర్వికారి స్థితి లభిస్తుంది. కావున స్వయమును దేహానికి అతీతంగా ఆత్మ నిశ్చయం చేసికొనుటచేత మనలను వాళ్ళు కూడా ఇతరులకు అతీతంగా అనుభవం చేసికొంటారు. మనం వాళ్లకు ప్రియంగా అనిపిస్తాము. ఈ విధంగా మన వ్యవహారంలో శాంతి, ప్రేమ, సద్భావన ఉంటాయి. చూడండి ఎన్ని రకాల అమూల్యమైన మహా వాక్యాల్లో! దీనివలన మన వ్యవహారం రమణీయంగా అందంగా తయారవుతుంది. ప్రస్తుత సమయంలో కూడా శాంతి ప్రదాయకంగా భవిష్యత్తులో గూడా సుఖ ప్రదాయకంగా వుంటుంది. మన వ్యవహారం బాగుపడుటయే గాక మన జీవితంలో శుభ పరివర్తన కలుగుతుంది. మోసం, కపటం, లోభం, మోహం మొదలగునవన్నీ తొలగిపోతాయి. మన మనస్సులో ఒక విధమైన ఉల్లాసం వస్తుంది. శక్తి పెంపొందుతుంది. ఈ ఒక్క వాక్యాన్ని ఆచరించడం వలన మన అనేక చింతలు, వ్యధలు, వాసనలు(కోరికలు) వేదనలు ఉపశమిస్తాయి. మరియు మనం బిందు స్వరూపాత్మలపై ఆత్మిక సుఖంలో ఆనందించుట నేర్చుకోగలము.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement