Monday, January 6, 2025

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

ధైర్యం కోల్పోవద్దు మరల పురుషార్థం చేయండి…
ఒక్కొక్కసారి మానవులు ఏవైనా ఆలోచనలను జయించాలని సంస్కారాలని పోగొట్టుకొనాలని ప్రయత్నించినా ఫలితం ఉండకపోవచ్చు. అపుడు నిరాశ నిస్పృహలు కలుగుట వలన కూడా సోమరితనం నిర్లక్ష్యం వస్తుంది. కానీ రారాదు. ఈ విషయంలో రాబర్ట్‌ బ్రూస్‌ కథ ఒకటి ప్రసిద్ధి గాంచింది. అతడు ఒక సాలెపురుగు చాలా సార్లు క్రింద పడిపోయిన తరువాత కూడా మరల ఎక్కాలనే ప్రయత్నాన్ని చూశాడు. ఇపుడు శివబాబా మీరు కూడా అధైర్య పడకండి అని అంటున్నారు. చేతిలో జ్ఞాన ఖడ్గం తీసికొని డ్రామా అనే ఢాలు ధరించి మరల పురుషార్థం చేయండి. తప్పకుండా మాయపై మీకు విజయం సిద్ధిస్తుంది. మనం శివబాబా పిల్లల మయ్యాము అంటే సఫలత మన జన్మ సిద్ధాధికారం.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement