Saturday, January 4, 2025

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

తనపై తనకు అంకుశం
మనస్థితిలో బలహీనతలు రావడానికి కారణాలు చాలా ఉంటాయి. ఉదా: మనలను సావధాన పరిచేవాళ్లు లేకపోవుట మన లోపాలు చెప్పి మరల మనస్థితిని సరిగా చేసే ఆదేశ నిర్దేశాలిచ్చి ఆదుపాజ్ఞలలో పెట్టే సన్నిహితులుండరు. మనస్థితి సంపూర్ణంగా, నిర్దోషంగా తయారు కానంతవరకు తప్పకుండా అతనికి ఎవరో ఒక నిర్దేశకులుండుట అవసరం. వారి ఉన్నతి కోసం వారికి హితోపదేశం చేసేవారు కావాలి కానీ చూడబోతే కొంచెం ఈశ్వరీయ జ్ఞానం విన్న తరువాత ఈశ్వరీయ సేవలో కొంచెం నిమగ్నమై తరువాత ఏ మంచి సాంగత్యం ఉంచుకొనరు. ఎవరికీ తమస్థితి గురించి విడమరిచి చెప్పరు. దాని వలన తమ దోషాలు తాము చూచుకోలేరు. వాటిని దూరం చేసికొనలేరు. ఇలాంటి పరిస్థితి చూచి వారికి ఏ ప్రగతి సాధించలేక పోతున్నామనే నిరాశ కలుగుతుంది. తనలో తాను ఎక్కడున్న వాడిని అక్కడే ఉన్నాను. అనుకొంటాడు. కావున ముందు ఉన్నతి కోరుకొనేవారు తమ పురుషార్ధంలో తీవ్రత తీసికొని వచ్చుటకు తనస్థితిని యొక్క చార్టు ఇవ్వడం చాలా అవసరం.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి
——————————–

Advertisement

తాజా వార్తలు

Advertisement