Saturday, January 4, 2025

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

సోదర భావము
సత్యయుగంలో పులి, ఆవు ఒకే చెరువులో కలిసి నీరు త్రాగేవి. మరి పరమాత్ముని సంతానమైన మనం, పరస్పరం సోదరులమైన మనం కలిసి పనిచెయ్యలేమా? సత్యయుగీ ప్రపంచం పాల సముద్రం వలె ఉంటూ అక్కడి వారు దివ్య గుణమూర్తులుగా ఉండేవారు. తియ్యని పాలలా కలిసిపోకుండా ఇక్కడ మనం పరస్పరం ఘర్షణ పడుతూ ఉండటం సబబేనా? మనం దైవీ స్థితి నుండి దిగజారిపోలేదా?
దేవతల ప్రతీ అంగాన్నీ పద్మముతో పోలుస్తారు. ఉదాహరణకు, కమలాక్షి కమల నేత్రం, కమల ముఖం. పద్మములా దివ్యంగా ప్రకాశిస్తూ సుమధురంగా ఉండకుండా ముళ్ళలా కఠినంగా ఉండటం ఎంతవరకు సమజంసం ? నిస్సందేహంగా కోపము ఒక దుష్ట మానవునికి గుర్తు. కోపానికి లోనవుతూ ఉంటే మనం ఎలా దేవతలుగా అవుతాము? స్వర్గ సామ్రాజ్యాన్ని ఎలా పొందగలం? ఈ విధంగా ఆలోచించినప్పుడు ఆత్మ జ్యోతి ప్రకాశిస్తుంది. కోపావేశాలు పారిపోతాయి.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి
—————————

Advertisement

తాజా వార్తలు

Advertisement