విభేదము
భక్తి మార్గానికి చెందిన సాధు సన్యాసులు అంతర్ముఖత గురించి సాధారణంగా ఇలా చెబుతారు. రెండు చెవులను మూసుకోండి. రెండు కళ్ళను నాలుగు, నాలుగు
వేళ్ళతో మూసుకుని ఆ తరువాత ధ్యానం చెయ్యండి. మీకు మధుర నాదం వినిపిస్తుంది. గంటల చప్పుడులా, తర్వాత మీరు ఓంకార నాదాన్ని వినగలుగుతారు. తర్వాత జ్యోతిని దర్శించుకుంటారు.
మానవమాత్రులైన సాధు సన్యాసులు నేర్పించే ఈ విధమైన అంతర్లీనము భక్తి మార్గంలో ప్రసిద్ధి చెందింది. కానీ భగవ ంతుడు చూపిన మార్గము జ్ఞాన మార్గము, దీనినే రాజయోగ మార్గము అని కూడా అంటారు. దీనిని జ్ఞాన స్వరూపుడైన శివ పరమాత్మ మనకు బోధించారు. సాధువులు నేర్పించే ఆత్మశోధనకు పూర్తిగా స్థూల కార్యాలు చెయ్యడం అవసరం. అంటే చేతిని కళ్ళపై లేక నోటిపై ఉంచుకోవడం లాంటివి. కానీ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన లోపల నుండి ధ్వని వినిపిస్తే దానిని ఆధ్యాత్మిక కృషి అనవచ్చా? అది దివ్య గుణాలు పెంపొందించుకునేందుకు పనికొస్తుందా? దానిని సద్గుణాలలో ఒకటిగా లెక్కించవచ్చా? కళ్ళు మూసుకోవడం వలననో లేక కళ్ళను రుద్దుకోవడం వలననో ప్రకాశం కనిపించవచ్చు, కానీ ఇది మనల్ని దేవతలుగా మార్చగలుగుతుందా? ఇలా ఎవరైనా ఎంతకాలం తమ కళ్ళను,
నోరును మూసుకుని ఉండగలరు? నిజానికి, ఈ విధంగా వినిపించే నాదానికి, కనిపించే ప్రకాశానికి ఆత్మతో కానీ పరమాత్మతో కానీ సంబంధము ఉండదు.
…బహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీల క్ష్మి